NRI-NRT

TANA2023: మహాసభల విజయవంతానికి కృషి చేసిన వారికి సన్మానం

TANA2023: మహాసభల విజయవంతానికి కృషి చేసిన వారికి సన్మానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన తానా 23వ మహాసభలు విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలు, దాతలు, 60కమిటీల సభ్యులను జ్ఞాపికలతో ఆదివారం నాడు ఫిలడెల్ఫియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు.

తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ లావు, కాన్ఫరెన్స్‌ సెక్రటరీ సతీష్‌ తుమ్మల, మిడ్‌ అట్లాంటిక్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ సునీల్‌ కోగంటి, ట్రెజరర్ రాజా కసుకుర్తి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లక్ష్మి దేవినేని, జనార్దన్ నిమ్మలపూడి, జాయింట్ ట్రెజరర్ సునీల్ పాంత్రా, ఫౌండేషన్ ట్రస్టీలు విద్యాధర్ గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేకా, న్యూ జెర్సీ రీజనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ వాసిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించి వేడుకల విజయవంతానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

TANA 2023 Conference Supporters Appreciation Meet
TANA 2023 Conference Supporters Appreciation Meet
TANA 2023 Conference Supporters Appreciation Meet
TANA 2023 Conference Supporters Appreciation Meet
TANA 2023 Conference Supporters Appreciation Meet