DailyDose

శ్రీశ్రీ కుమార్తె మద్రాసు హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తి

శ్రీశ్రీ కుమార్తె మద్రాసు హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తి

మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్‌ నిడుమోలు మాలాను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి ప్రతిపాదించింది. ఆమె మహాకవి శ్రీశ్రీ కుమార్తె. గతేడాది మార్చిలో మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమెతోపాటు మద్రాసు హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ఏఏ నక్కీరన్‌, జస్టిస్‌ ఎస్‌.సౌందర్‌, జస్టిస్‌ సుందరమోహన్‌, జస్టిస్‌ కె.కుమరేష్‌బాబును శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి కొలీజియం సిఫార్సు చేసింది.