Devotional

తిరుమలలో కాటేజీల పునర్నిర్మాణం

తిరుమలలో కాటేజీల పునర్నిర్మాణం

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలలో 13 కాటేజీల పునర్నిర్మాణం చేపట్టనున్నారు. తిరుమల లోని వరాహ స్వామి కాటేజీ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రహదారి వేయనుంది టీటీడీ. అలాగే.. రాజగోపురాల పటిష్టతపై నిపుణులతో కమిటీ వేసింది. పారిశుధ్య కార్మికుల వేతనాల పెంచుతూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాని నిర్వహిస్తామని వివరించారు.భక్తులు తమకు ముఖ్యమైన రోజులలో హోమంలో స్వయంగా పాల్గోనే అవకాశం కల్పిస్తామన్నారు టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి. టిటిడి పారిశుధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచుతామని.. 5 వేల మంది పారిశుధ్య కార్మికులకు జీతాల పెంపు వర్తింపు చేస్తామని ప్రకటించారు. టిటిడి పరిధిలోని కార్పోరేషన్ లో విధులు నిర్వర్తిస్తూన్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నామని.. కార్పోరేషన్లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పోందితే వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు చేస్తున్నట్లు వెల్లడించారు టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి.

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z