Food

మూత్రపిండాల వ్యాధి నివారించే కొత్తిమీర

మూత్రపిండాల వ్యాధి నివారించే కొత్తిమీర

తెలుగు వంటగదిలో తప్పక ఉండే ఆకు కూరల్లో ముఖ్యమైనది కొత్తిమీర.. కూరకు రంగు, మంచి రుచిని, సువాసను తీసుకువచ్చే కొత్తిమీర అనేక గుణాలను కలిగి ఉంది. దీనిని దనియాల మొక్కగా కంటే కొత్తిమీరగానే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఔషదమొక్కగా కూడా కొత్తిమీరకు పేరుంది. అనేక వ్యాధులు దగ్గరకు రాకుండా చేస్తుంది. అయితే కొత్తిమీరతో జీర్ణ సమమస్యలకు, కొలలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ మధుమేహం, మూత్రపిండాలను అనేక వ్యాధులు రాకుండా చూడటంలోనూ ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది కాకుండా కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్ సి కూడా పచ్చి కొత్తిమీరలో లభిస్తాయి. కొత్తిమీర కొన్ని ఇతర అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.. అవేమిటంటే..

1. మధుమేహంలో మేలు చేస్తుంది

పచ్చి కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దివ్యౌషధం. మధుమేహ రోగులకు పచ్చి కొత్తిమీర , రక్తంలో ఇన్సులిన్ పరిమాణాన్ని నియంత్రిస్తుంది.

2. మూత్రపిండాల వ్యాధి..

కొత్తిమీరలో కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేసే అనేక అంశాలు ఉన్నాయి.

3. జీర్ణ శక్తిని పెంచడానికి

పచ్చి కొత్తిమీర కడుపు సమస్యలను తొలగించడంలో మాత్రమే కాకుండా జీర్ణ శక్తిని పెంచడంలో కూడా మేలు చేస్తుంది.

4. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

పచ్చి కొత్తిమీరలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే అంశాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తి దనియాల గింజలను ఉడికించి, దాని నీటిని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

5. రక్తహీనత నుండి ఉపశమనాన్ని అందిస్తుంది

కొత్తిమీర శరీరంలో రక్తాన్ని పెంపొందించడంలో ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనతను తొలగించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

6. కంటి చూపును మెరుగుపరుస్తుంది.

పచ్చి కొత్తిమీరలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది, కొత్తిమీరను రోజూ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

7. జీవక్రియను పెంచడానికి

కొత్తిమీర గింజలు జీవక్రియను వేగవంతం చేసే అంశాలున్నాయి. కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేయగలదు, ఫలితంగా బరువు తగ్గుతుంది.