Politics

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దీపావళి’ అంటేనే కాంతి వెలుగు. చీకటిపై వెలుగు..చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం.. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ.

దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని కోరుకుంటున్నా’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z