Movies

2025లో ఇళయరాజ బయోపిక్

2025లో ఇళయరాజ బయోపిక్

దిగ్గజ సంగీత దర్శకుడు, మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమా తెరకెక్కనుందంటూ గత కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఓ ప్రకటన వెలువడింది. కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ధనుష్‌ హీరోగా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ఇది పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే 2025లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.