DailyDose

నరకంలో శిక్షలు ఎలా అమలు చేస్తారు?

నరకంలో శిక్షలు ఎలా అమలు చేస్తారు?

నరకం లో శిక్షలు మన ఆత్మకు వేస్తారా? మరి ఆత్మ నీటిలో మునగదు, అగ్నిలో కాలదు అని చెప్తారు కదా? రెండిటికీ సమన్వయం ఎలా కుదురుతుంది?
తదుపరి చర్చలకు తావు ఇవ్వకుండా వుండుటకు, ఎక్కువగా వివరించను. కాబట్టి జాగరూకతతో వినగలరు.

ఒకానొక సందర్భంలో నేను గరుడ పురాణము చదవటం తటస్థించింది. అందులో చివరి చాప్టర్లలో ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది.

చనిపోయాక ఆత్మ ప్రయాణం.

అందులో ఏడు రకాల నరకాలను ఆత్మ ప్రయాణించవలసి వస్తుంది. ఈ శిక్షలు వేయటం కోసమని , ఒక్కోటీ ఇంతింతదూరముంటుందని ప్రత్యేకం చెబుతారు.

వైతరణీ నది వెంబడి ఆ ప్రయాణం కోసం ఆత్మకు ప్రత్యేకం ఒక తాత్కాలిక శరీరం ఇస్తారు. మనకులాగా అది ఛిద్రమవటం, కృశించటం అవదు సరికదా , తీవ్రతరమైన బాధలను, నొప్పులను కలిగిస్తుంది. ఆ తాత్కాలిక శరిరానికి ఏం wear and tearవుండదు. క్షోభంతా ఆత్మ పడుతుంది.

షరా: ఇది నేను చెప్పటంకాదు, గరుడపురాణం అంది. ఓపికుంటే చదువుకోగలరు. ఇది వుందని , లేదని, నిజమని , అబద్ధమని నేను అనటం లేదు. నాకు తెలిసింది చెప్పాను.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z