Agriculture

ఈ ఏడాది పంటల సాగు గణనీయంగా తగ్గింది!

ఈ ఏడాది పంటల సాగు గణనీయంగా తగ్గింది!

ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణలో 24 జిల్లాల్లో 20శాతం కంటే తక్కువగా పంటలు సాగవుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. రాష్ట్రంలో పది శాతం కంటే తక్కువ సాగు చేసే జిల్లాలు తొమ్మిది, 20శాతం కంటే తక్కువ సాగు చేసే జిల్లాల సంఖ్య 24గా పేర్కొంది. మొత్తంగా యాసంగిలో నిరుటి కంటే ఈ ఏడాది పంటల సాగు గణనీయంగా తగ్గిందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి తాజాగా నివేదిక ఇచ్చింది.

జయశంకర్‌ భూపాలపల్లిలో 0.95 శాతం, మెదక్‌ జిల్లాలో 1.64, పెద్దపల్లిలో 1.65, ములుగులో 4.10, కరీంనగర్‌లో 4.81, యాదాద్రి జిల్లాలో 6.90, వరంగల్‌లో 7.45, సిద్దిపేటలో 7.73, ఖమ్మం 9.28, జగిత్యాల 9.46, సిరిసిల్ల 9.80, జనగామ 9.83 శాతాల చొప్పున సాగు జరుగుతోందని వ్యవసాయ శాఖ పేర్కొంది. హనుమకొండలో 10.36, నల్గొండ 10.66, రంగారెడ్డిలో 11.43, మహబూబ్‌నగర్‌లో 12.29, నారాయణపేట 12.41, భద్రాద్రిలో 12.94, సూర్యాపేట 12.79, మహబూబాబాద్‌ 14.50, వనపర్తి 16.94, మంచిర్యాల 17.80, మేడ్చల్‌ 18.26, సంగారెడ్డి 18.99 శాతం మేరకు పంటలు వేసినట్లు తెలిపింది.

ఆదిలాబాద్‌ జిల్లాలో 70.61 శాతం, నిర్మల్‌ జిల్లా 54.66, నిజామాబాద్‌ 52.12 శాతాల చొప్పున పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలో వరి 40.50 లక్షల సాగు లక్ష్యానికి గాను 2.93 లక్షల (7.24 శాతం) మేరకు పంటలు వేశారు. పెసలు, ఉలవలు, బొబ్బర్లు, నువ్వులు 25 శాతం కంటే తక్కువగా ఉండగా మొక్కజొన్న, జొన్న, గోధుమ, పొద్దుతిరుగుడు 30 శాతం దాటిందని, వేరుసెనగ, మినుములు, కుసుమలు, శనగ పంటలు 50 శాతం మేరకు సాగవుతున్నాయని పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z