Politics

లోకేష్‎కు సీఐడీ నోటీసులు

లోకేష్‎కు సీఐడీ నోటీసులు

రెడ్ బుక్ అంశంపై సీఐడీ అధికారులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‎కు నోటీసులు ఇచ్చారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు సూచనల మేరకు సీఐడీ అధికారులు లోకేష్‎కు శుక్రవారం వాట్సప్‎లో నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్లు సీఐడీ అధికారులకు లోకేష్ సమాధానం కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు విచారణ జనవరి 9కి వాయిదా వేసింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.

ఇదిలా ఉంటే యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని నారా లోకేష్ గతంలో నిరసనలు చేశారు. తనను అడ్డుకున్న అధికారులు, నాయకుల పేర్లను రెడ్ బుక్‎లో రాసుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వాళ్లను ఇబ్బంది పెట్టి, అసౌకర్యానికి గురి చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని హెచ్చరించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు నారా లోకేష్. దీనిపై స్పందించిన కొందరు అధికారులు నారా లోకేష్‎పై కంప్లైంట్ చేశారు. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు అదేశాల మేరకు సీఐడీ అధికారులు ఈరోజు నారా లోకేష్ కు నోటీసులు పంపించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z