DailyDose

నీట్ యూజీ బిట్స్‌లో ప్రవేశాలకు త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ

నీట్ యూజీ బిట్స్‌లో ప్రవేశాలకు త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ

విద్యార్థి లోకానికి ఇది అత్యంత కీలక సమయం. వార్షిక పరీక్షలు ఒకవైపు.. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం పోటీ పరీక్షలు ఇంకోవైపు.. ఒత్తిడిని తట్టుకొని ప్రిపేర్‌ అయ్యేందుకు ఇప్పట్నుంచే విద్యార్థులకు కచ్చితమైన ప్రణాళిక అవసరం. ఇంజినీరింగ్‌, మెడికల్‌, ఫార్మా సహా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ప్రిపేర్‌ అవుతున్న వారికి త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్‌ సెషన్‌ – 1 పరీక్షలు ప్రారంభం కానుండగా.. త్వరలోనే నీట్‌ యూజీ, బిట్‌శాట్‌, సీయూఈటీ -యూజీతో పాటు మరికొన్ని పరీక్షలకు దరఖాస్తులు షురూ కానున్నాయి.

నీట్‌ (యూజీ): దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG 2024) పరీక్ష మే 5న జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్‌టీఏ ప్రకటించింది. జనవరి నెలాఖరులో ఈ పరీక్షకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. అలాగే, దరఖాస్తుల ప్రక్రియ కూడా ఈ నెల నుంచే షురూ కానుంది.

బిట్‌శాట్‌: బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (BITS)లో యూజీ కోర్సుల్లో 2024-25లో ప్రవేశాలకు బిట్‌శాట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు జనవరిలోనే దరఖాస్తులు మొదలయ్యే అవకాశం ఉంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల సమాచారాన్ని ఈ వారంలోనే తమ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు bitsadmission.com సంప్రదించొచ్చు.

సీయూఈటీ (యూజీ): దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ యూజీ పరీక్ష నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనుంది. ఈ పరీక్ష మే 15 – 31 తేదీల మధ్య జరగనుండగా.. ఇంకా దరఖాస్తుల ప్రక్రియ మొదలుకావాల్సి ఉంది. పూర్తి సమాచారం కోసం cuet.samarth.ac.inలో చూడొచ్చు. అలాగే, జేఈఈ మెయిన్‌ సెషన్‌-2, ఏపీఈఏపీ సెట్‌, తెలంగాణ ఎంసెట్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తదితర పోటీ పరీక్షలకు కూడా వచ్చే నెలలో దరఖాస్తులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z