Business

మార్కెట్ అంచనాలు బ్రేక్ చేసిన ఐసీఐసీఐ బ్యాంక్-వాణిజ్య వార్తలు

మార్కెట్ అంచనాలు బ్రేక్ చేసిన ఐసీఐసీఐ బ్యాంక్-వాణిజ్య వార్తలు

* మార్కెట్ అంచనాలు బ్రేక్ చేసిన ఐసీఐసీఐ బ్యాంక్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను బ్రేక్ చేస్తూ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘ఐసీఐసీఐ బ్యాంక్’ 23.6 శాతం నికర లాభం గడించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం రూ.10,272 కోట్లుగా నిలిచింది. మార్కెట్ వర్గాలు రూ.9,981 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేశాయి.బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలోనూ 13.4 శాతం గ్రోత్ నమోదు చేసింది. 2022-23 సంవత్సర డిసెంబర్ త్రైమాసికంలో రూ.16,465 కోట్ల నికర వడ్డీ ఆదాయం గడిస్తే, ఈ ఏడాది రూ.18,678 కోట్ల ఆదాయం సంపాదించింది. కానీ, నికర వడ్డీ మార్జిన్లు మాత్రం స్వల్పంగా తగ్గాయి. 2022-23 సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 4.65 శాతమైతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 4.53 శాతంగా నమోదైంది.డిసెంబర్ నెలాఖరు నాటికి బ్యాంకులో డిపాజిట్లు 18.7 శాతం పెరిగి రూ.13,32,315 కోట్లకు చేరాయి. దేశీయ రుణాల పోర్ట్ ఫోలియో సైతం 18.8 శాతం పెరిగి రూ.11,14,820 కోట్లకు చేరుకున్నది. నికర మొండి బకాయిలు (ఎన్పీఏ) స్వల్పంగా పెరిగాయి. 2022-23తో పోలిస్తే 0.43 శాతం నుంచి 0.44 శాతానికి పెరిగాయి. స్థూల మొండి బకాయిలు రూ.1,389 కోట్లుగా నమోదయ్యాయి.

* కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల

ప్రైవేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ శనివారం తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 6.7శాతం వృద్దితో రూ.4,264.78 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.3,995.05 కోట్లుగా నమోదైంది. అదే పన్ను తర్వాత నికర లాభం రూ.3,005 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే సమయంలో రూ.2,791.88 కోట్లుగా ఉంది.సమీక్ష కాలంలో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ. 6,554 కోట్లుగా నమోదైంది. వడ్డీ మార్జిన్ (NIM) త్రైమాసికానికి 5.22 శాతంగా ఉంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (NPAలు) 1.73 శాతంతో మెరుగుపడ్డాయి. డిసెంబర్ చివరి నాటికి మొత్తం అడ్వాన్సులు రూ. 3.72 లక్షల కోట్లుగా ఉన్నాయి. నిర్వహణ ఖర్చులు రూ. 4,284 కోట్లకు పెరిగాయి. డిసెంబర్ చివరి నాటికి కాసా నిష్పత్తి 47.7శాతంగా ఉంది. కరెంట్ డిపాజిట్లు ఏడాది క్రితం రూ.56,372 కోట్ల నుంచి రూ.59,337 కోట్లకు పెరిగాయి. ఇదే బాటలో పొదుపు డిపాజిట్లు ఏడాది క్రితం రూ.1.18 లక్షల కోట్ల నుండి రూ.1.23 లక్షల కోట్లకు పెరిగాయి.

* అమెజాన్ బెస్ట్ ఆఫర్

CP Plus 3MP ఫుల్ HD స్మార్ట్ వైఫై సీసీటీవీ కెమెరా ఇప్పుడు సరసమైన ధరల్లో లభిస్తోంది. 1296 పిక్సల్ తో పూర్తి HD ప్లగ్ అండ్ ప్లే Wi-Fi కెమెరా, పూర్తి స్పష్టతతో చిన్న వివరాలను చూపించే ప్రస్పుటమైన చిత్రాలను చూపిస్తుంది. ఇది Alexa, Ok Googleతో కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా స్మార్ట్ హోం భద్రతను ఆస్వాదించొచ్చు. ఈ EzyKam అందించే 360 డిగ్రీల పాన్, 85 డిగ్రీల టిల్ట్ .. అమర్చిబడిన ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో కవర్ చేస్తుంది.ఇంట్లో, ఫోన్లో, ప్రపంచంలో ఎక్కడైనా మీ ఫోన్ లో ఎప్పుడైనా మీ ఇల్లు, కార్యాలయాలను ప్రత్యక్ష ప్రసార వీడియో పుటేజీని చూడొచ్చు. మీరు ప్రత్యక్ష వీడియో ఫీడ్ ను చూసేటప్పుడు అవతలి వైపు ఉన్న వ్యక్తితో కూడా మాట్లాడవచ్చు. దీనిలో 128 GB వరకు SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది. CP Plus 3MP సీసీటీవీ కెమెరా ఒరిజినల్ ధర రూ. 4000, ఆఫర్ ధర రూ. 1,399 లు.

* హెచ్​యూఎల్ లాభం 2508 కోట్లు

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌), అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.2,508 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.2,481 కోట్లతో పోలిస్తే ఇది 1.08% అధికం. ఇదే సమయంలో విక్రయాల ద్వారా ఆదాయం రూ.15,314 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ.15,259 కోట్లకు పరిమితమయ్యింది. అయితే మొత్తం వ్యయాలు రూ.12,305 కోట్లకు పెరిగాయి. ఏకీకృత ఆదాయం కూడా రూ.15,707 కోట్ల నుంచి రూ.15,781 కోట్లకు పెరిగింది. ‘మున్ముందు గిరాకీ క్రమంగా పుంజుకోవచ్చని భావిస్తున్నాం. ప్రభుత్వ వ్యయాలు, గ్రామీణుల ఆదాయాల్లో పెరుగుదల, రబీ పంట దిగుబడులపై ఇది ఆధారపడి ఉంటుంద’ని హెచ్‌యూఎల్‌ సీఈఓ, ఎండీ రోహిత్‌ జావా తెలిపారు. మధ్య, దీర్ఘ కాలంలో భారత ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ సామర్థ్యంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని, స్వల్పకాలంలో సవాళ్లు ఎదురైనా ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హెచ్‌యూఎల్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

* నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు శనివారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో లాభాల్లోనే మొదలైనా చివరకు నష్టాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, రియాల్టీ షేర్లలో అమ్మకాలతో అస్థిరకు గురయ్యాయి. దీంతో మొదటి సెషన్‌లో వచ్చిన లాభాలు సైతం ఆవిరయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ ఉదయం 71,776.57 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. మధ్యాహ్నం వరకు అదే జోరును కొనసాగించిన సూచీలు నష్టాల్లో ముగిశాయి.చివరకు 260 పాయింట్ల నష్టంతో 71,425 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 21,586 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో హెచ్‌యూఎల్, ఎంఅండ్ఎం, టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్స్‌గా నిలువగా.. కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. సెక్టోరల్‌లో బ్యాంక్‌, మెటల్‌, పవర్‌ ఇండెక్స్‌లు 0.5-1 శాతం, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫార్మా, రియల్టీ 0.4నుంచి ఒకశాతం వరకు క్షీణించాయి.బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న స్టాక్‌ మార్కెట్‌ మూతపడనున్నది. సోమవారం ట్రేడింగ్‌ నిలిపివేయనున్న నేపథ్యంలో శనివారం స్టాక్‌ మార్కెట్లు పని చేశాయి. మళ్లీ మంగళవారం ట్రేడింగ్‌ జరుగనున్నది.

* భారీగా పెరుగుతున్న రైల్వే స్టాక్‌ల ధరలు

రాబోయే 2024-25 యూనియన్ బడ్జెట్‌లో రైల్వేకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తుందని పెట్టుబడిదారులు ఆశిస్తున్న కారణంగా గత కొద్ది రోజులుగా రైల్వే స్టాక్‌లు ఎన్నడూలేని విధంగా రికార్డ్ గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ఇంతకుముందు 2023-24 బడ్జెట్‌లో, రైల్వే మంత్రిత్వ శాఖ రికార్డు స్థాయిలో రూ. 2.4 లక్షల కోట్ల నిధలను అందుకోగా ఈసారి అంతకంటే ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉంది. దీంతో గత కొద్ది నెలలుగా స్థిరంగా ఉన్న రైల్వే షేర్ల ధరలు 2024 ఏడాది ప్రారంభం నుంచి మాత్రం భారీగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా రైల్ వికాస్ నిగమ్ (RVNL), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), ఇర్కాన్ ఇంటర్నేషనల్, NBCC (ఇండియా), RailTel కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,Texmaco రైల్ అండ్ ఇంజనీరింగ్ స్టాకులు చరిత్రలో రికార్డు స్థాయి ధరకు చేరుకున్నాయి. RVNL షేర్ ధర 2023 మార్చి నెలలో రూ. 64 గా ఉండగా ప్రస్తుతం అది రూ.320 కి చేరుకుంది. IRFC షేర్ ధర మార్చి 2023 లో రూ.26 కాగా ఇప్పుడు అది రికార్డు స్థాయి రూ.176 కు చేరుకుంది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్ ధర మార్చి 2023 లో రూ.54 కాగా ప్రస్తుతం అది రూ.266 కు చేరుకుంది.ఏడాది కాలంలోనే రైల్వే స్టాకులు పెట్టుబడిదారులకు 100 శాతం కంటే ఎక్కువ లాభాలను అందించాయి. రానున్న రోజుల్లో కేంద్రం కొత్త రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని చూడటం, రైళ్ల భద్రత, కొత్త వందే భారత్ రైళ్లు, స్టేషన్ల పునరాభివృద్ధి, కొత్త ట్రాక్‌ల నిర్మాణం, బుల్లెట్ ట్రైన్ వంటి వాటికి భారీ ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రైల్వేకు సంబందించిన అన్ని స్టాకులు రయ్ మంటు దూసుకుపోతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ 2024-25 యూనియన్ బడ్జెట్‌లో రైల్వేలకు సుమారు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులను అంచనా వేసింది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z