NRI-NRT

సింగపూర్‌లో బెజవాడ యువకుడి మృతి. సాయమందించిన TCSS.

సింగపూర్‌లో బెజవాడ యువకుడి మృతి. సాయమందించిన TCSS.

విజయవాడకు చెందిన ప్రదీప్ కుమార్ వంగపండు(32) సింగపూర్‌లో ఉద్యోగరీత్యా గత 8 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన గుండె సంబంధిత వ్యాధి(cardiomegaly)తో మృతి చెందారు. మూడు సంవత్సరాల కిందట లావణ్యతో ఆయనకు వివాహం జరిగింది. లావణ్య తన తల్లిదండ్రులను బాల్యంలోనే కోల్పోయింది. ఇప్పుడు భర్త కూడా దూరం కావడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి సహాయం చేయడానికి సంతోష్ వర్మ, మణికంఠ రెడ్డి సహకారంతో విరాళాలు సేకరించారు. ₹3,28,000లు విరాళంగా లభించాయి. ప్రదీప్ తల్లిదండ్రుల ఖాతాలో ₹1,64,000, భార్య లావణ్య ఖాతాలో ₹1,64,000 జమ చేశారు. సాయం అందించిన దాతలకు ప్రదీప్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ లావణ్యను ఓదార్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z