‘‘నిజ జీవితానికీ, కెమెరా ముందు నటించే పాత్రలకూ చాలా తేడా ఉంటుంది. నాకు ఆ తేడా స్పష్టంగా తెలుసు’’ అని అన్నారు కియారా. ఇటీవల ఆమె నటించిన ‘కబీర్ సింగ్’ మంచి విజయాన్ని మూటగట్టుకుంది. సినిమాల్లో నటించడం గురించి కియారా మాట్లాడుతూ ‘‘వ్యక్తిగతంగా నా అభిప్రాయాలు, అభిరుచులు వేరు. కానీ పాత్ర పరంగా వేరుగా ఉంటాయి. ఉదాహరణకి నన్ను ఎవరైనా తిడితే నేను తట్టుకోలేను. అసలు ఒప్పుకోను. కానీ తెరమీద పాత్రల పరంగా ‘నేను ఒప్పుకోను’ అని అనడానికి వీలుండదు. అందుకే నా ఇష్టాయిష్టాలను పాత్రల మీద రుద్దను’’ అని అన్నారు. నచ్చినవారు కనిపిస్తే ప్రేమలో పడటానికి తానెప్పుడూ సిద్ధమేనని, ప్రేమ, పెళ్లి విషయంలో తనకు ఎలాంటి ఆంక్షలూ లేవనీ ఆమె తెలిపారు.
కియారా ఈజ్ క్లియర్
Related tags :