DailyDose

టీటీడీకి ప్రవాసాంధ్రుడు కోటి విరాళం-తాజావార్తలు–06/26

Daily Breaking News - Telugu NRIs Donate 1Crore INR To TTD - June 26 2019

* టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బుధ‌వారం ఉద‌యం రూ.1.1 కోట్లు విరాళంగా అందింది. అమెరికాకు చెందిన ప్ర‌వాస భార‌తీయులు శ్రీ‌మ‌తి కొమ్మారెడ్డి మాధ‌వి, శ్రీ కొమ్మారెడ్డి న‌గేష్ దంప‌తులు ఈ మేరకు విరాళం డిడిని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌కు అందించారు. తిరుప‌తిలోని ఈవో కార్యాల‌యంలో ఈ విరాళాన్ని అందజేశారు.
* ప్రస్తుతం సౌత్‌, నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. అద్భుత విజయాలు సాధించిన ఎంతో మంది జీవితాలతో పాటు విచిత్ర వ్యక్తితాలు వింత ప్రవర్తనలు కలిగిన వ్యక్తుల కథలను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు. 2019 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అందరికీ నవ్వులు పంచిన కేఏ పాల్‌ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుందట.
* రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) చీఫ్‌గా కశ్మీర్‌కు చెందిన సామంత్‌ గోయల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో భారత బలగాలు చేపట్టిన మెరుపు దాడులు, బాలకోట్‌ వైమానిక దాడులకు గోయల్‌ వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
* చైనా నుంచి బయటకు వచ్చి మనదేశంలో ప్లాంట్లు నిర్మించే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని, ట్యాక్స్‌‌ హాలిడే ఇవ్వాలని వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. రాయితీలు ఇవ్వడంతోపాటు దేశంలోని తీరప్రాంతాల వెంట ఇండస్ట్రియల్‌‌ జోన్స్‌‌ ఏర్పాటు చేసి, స్థానిక కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఫలితంగా మేకిన్‌‌ ఇండియా కార్యక్రమానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదనలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ త్వరలో నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
* కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలలో ల్లినియం ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్..ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ఛైర్మన్ ఫిలిప్ గంట, జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు
* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అక్రెడిషన్‌ కలిగి ఉన్న జర్నలిస్టులందరికి వివిఐపి బ్రేక్‌ దర్శనం కలిగిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. నూతనంగా చైర్మన్‌ బాధ్యతలు చేపట్టిన సుబ్బారెడ్డి ని, జర్నలిస్ట్‌ సంఘాల జెఎసి నేత జోగినాయుడు ఆధ్వర్యంలో జర్నలిస్ట్‌ బృంద సభ్యులు బుధవారం కలిశారు. జర్నలిస్ట్‌ లకు టిటిడిలో విఐపి బ్రేక్‌ దర్శనం సౌకర్యం కల్పించాలని సుబ్బారెడ్డిని కోరారు. సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించి మాట్లాడుతూ.. త్వరలో నిర్వహించనున్న టిటిడి బోర్డ్‌ మీటింగ్‌ లో జర్నలిస్ట్‌ సమస్య కు అధికారక ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు.
* రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు.ఉపరాష్ట్రపతిని నిర్మలాసీతారామన్‌ కలిశారు.
* రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయిదాడులపై రేపు డీజీపీ ని కలుస్తాముప్రజావేదిక ను కూల్చివేయడం సరైంది కాదుఅర్ధరాత్రి ప్రజావేదిక ను కూల్చారుకాపు నేతలు ఈ సమావేశానికి ఎందుకు రాలేదో నాకు తెలియదు
* జనసేనాని పవన్ కల్యాణ్ప్రజావేదిక కూల్చివేతపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పందించారు.ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతి లేని మిగతా భవనాలనూ కూల్చివేయాలని సూచనఅప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం. జులై రెండో వారంలో గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు నాయకులతో సమీక్షలు
* ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు టీడీపీ అధినేత నారా చంద్రబాబ నాయుడు.. తాజా రాజకీయ పరిణామలు, ప్రజావేదిక కూల్చివేత, ప్రభుత్వ చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.ఇప్పటికే ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ పూర్తి కావొస్తుండగా… ఆ తర్వాత తాను నివాసం ఉంటున్న భవనం కూల్చివేత వరకు పరిస్థితి వస్తే ఏం చేయాలి? అనే దానిపై నేతలతో సమాలోచనలుప్రజావేదిక కూల్చివేత తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోంది? అనే చర్చ సాగుతోంది. వివాదం కోర్టులో ఉన్నందున ఇల్లు కూల్చే ఆలోచన ప్రభుత్వం చేయకపోవచ్చు అంటున్నారు మరికొందరు నేతలు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ కూడా అక్రమ కట్టడమేనని వైఎస్ జగన్ సర్కార్ వాదిస్తుండడంతో.. గౌరంగా ఖాళీ చేయడం మంచిదని కొందరు నేతలు అభిప్రాయంమరోవైపు ఇప్పుడు ఖాళీ చేస్తే ప్రభుత్వ చర్యలకు అంగీకారం తెలిపినట్టు అవుతుందని.. ఇప్పుడు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని కొందరు నేతలు చంద్రబాబుకు సూచించినట్టు సమాచారం
*‘పద్మ’ అవార్డులకు శాప్ దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రంలో ప్రతిభావంతులైన, అత్యున్నత ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల నుంచి ‘పద్మ’ అవార్డుల కోసం రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) దరఖాస్తులను ఆహ్వానిస్తోందని శాప్ పరిపాలనాధికారి ఎం.సుశీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను వచ్చే నెల 6వ తేదీలోపు విజయవాడ ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుదారులు ఇతర వివరాలకు www.padmaawards.gov.in వెబ్సైట్లో చూడవచ్చని చెప్పారు.
* సచివాలయ ఉద్యోగులతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అంగీకరించినట్టు సమాచారం…గత ప్రభుత్వం, ఐదు రోజుల పనిదినాల కోసం ఇచ్చిన జీవో గడువు ఈ నెల 27వ తేదీతో ముగియనుంది.
* 2018కి గాను ఈ ఏడాది ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాను కేంద్రం విడుదల చేసింది.రాజస్థాన్‌‌లోని బికనూర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో తొలిస్థానం లభించింది.తెలంగాణా లో రాచకొండ కమిషనరేట్‌ నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌కు 14వ స్థానం లభించింది. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌కు 20వ స్థానం లభించింది.
* మంగళగిరి లో హత్యకు గురైన టిడిపి నేత ఉమాయాదవ్ భౌతికకాయానికి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావుకుటుంబ సభ్యులకు అండగా ఉంటా అని హామీ ఇచ్చిన లోకేష్
* కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీస్‌ స్టేషన్‌ దగ్గర మున్సిపల్‌ చైర్మన్‌ ఇంటూరి రాజగోపాల్‌.. అతడి అనుచరులు వీరంగం సృష్టించారు. రౌడీ షీటర్ల ఫోటోల సేకరణలో భాగంగా.. ప్రస్తుత చైర్మన్ రాజగోపాల్‌కు.. జగ్గయ్యపేట ఎస్‌ఐ ఫోన్‌ చేశారు. దీంతో వీరావేశానికి లోనైన చైర్మన్‌ ఇంటూరితో పాటు అతడి అనుచరులు.. మద్యం సేవించి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి హల్‌చల్‌ చేశారు.స్టేషన్‌కు వస్తూనే అక్కడ ఉన్న పోలీసులతో మొదట అతడి అనుచరులు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌.. తన వంటిపై చొక్కా విప్పి నగ్నంగా తన ఫోటో తీయండి చూస్తానంటూ పోలీసులను అవమానించారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న పోలీసుల ఫోన్‌లు సైతం అతడి అనుచరులు లాక్కొన్ని.. బెదిరింపులకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. మున్సిపల్‌ చైర్మన్‌కు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణింగింది.
* ములుగు జిల్లా వాజేడు మండలం, అరుణాచాలపురం ప్రధాన రహదారి వంతెనపై వెలసిన మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. పొడుభూముల సమస్యలపై పోరాటానికి ఆదివాసీ, గిరిజన తండాలు ఏకం కావాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో కరపత్రాలు వెలసాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు
* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అక్రెడిషన్‌ కలిగి ఉన్న జర్నలిస్టులందరికి వివిఐపి బ్రేక్‌ దర్శనం కలిగిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. నూతనంగా చైర్మన్‌ బాధ్యతలు చేపట్టిన సుబ్బారెడ్డి ని, జర్నలిస్ట్‌ సంఘాల జెఎసి నేత జోగినాయుడు ఆధ్వర్యంలో జర్నలిస్ట్‌ బృంద సభ్యులు బుధవారం కలిశారు. జర్నలిస్ట్‌ లకు టిటిడిలో విఐపి బ్రేక్‌ దర్శనం సౌకర్యం కల్పించాలని సుబ్బారెడ్డిని కోరారు. సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించి మాట్లాడుతూ.. త్వరలో నిర్వహించనున్న టిటిడి బోర్డ్‌ మీటింగ్‌ లో జర్నలిస్ట్‌ సమస్య కు అధికారక ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు.
*గతేడు ఆరంభమైన పోలీసు నియామక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో అధికారులు మరో దఫా 15 వేల ఉద్యోగాల భర్తీకి సమాయత్తమవుతున్నారు. ఇందుకు ఇది వరకే ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
*రాష్ట్రంలోని పంచాయతీల్లో త్వరలో దాదాపు 17 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారికి, కొత్తగా చేరేవారికి నెలకు రూ.8,500 చొప్పున వేతనం అందనుంది.
* పాకిస్థాన్లోని బాలాకోట్లో జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం జరిపిన దాడిపై కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. మన పైలెట్లు 90 సెకన్లలోనే పని పూర్తి చేశారట! ఈ ఆపరేషన్ మొత్తాన్నీ అత్యంత గోప్యంగా ఉంచారు.
* నూతన సచివాలయ భవనం సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది. ప్రస్తుతం సీఎం కార్యాలయం సమతా బ్లాక్లో ఉండగా… కొత్త సచివాలయంలో దాన్ని డి-బ్లాక్ వెనుక నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
*లోక్సభలో భారీ ఆధిక్యం ఉన్నా రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం లేకపోవటంతో కీలకమైన బిల్లుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో ఆ సమస్యను అధిగమించనుంది.
*ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల వారీగా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిసెంట్ల వరకే ఈ పదోన్నతులు ఉండనున్నాయి.
*వ్యక్తిగత పర్యటనపై విదేశాలకు వెళ్లిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంగళవారం తిరిగి హైదరాబాద్కు వచ్చారు. ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెదేపా నేతలు బక్కని నర్సింలు, ఎన్.దుర్గాప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు తన నివాసానికి వెళ్లారు.
*ఇటీవల వరంగల్లో దారుణంగా హత్యాచారానికి గురైన చిన్నారి శ్రీహిత కేసుపై వెంటనే న్యాయ విచారణ జరిపి, నిందితుడిని కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని వరంగల్ తెరాస ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు.
*హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ట్రాఫిక్ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.
* ఇటీవల వరంగల్లో దారుణంగా హత్యాచారానికి గురైన చిన్నారి శ్రీహిత కేసుపై వెంటనే న్యాయ విచారణ జరిపి, నిందితుడిని కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని వరంగల్ తెరాస ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు.
* సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్ వరకు ఏసీ వీక్లీ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. జులై 5 నుంచి సెప్టెంబరు 27 వరకు ప్రతి శుక్రవారం ఒక ప్రత్యేక రైలు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి (నెం.08408) బయల్దేరుతుంది.
*తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన జిల్లా కార్యాలయాల నిర్మాణానికి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు విరాళాలు అందజేశారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలఎమ్మెల్సీలు పురాణం సతీష్, భానుప్రసాద్రావులు మంగళవారం ప్రగతిభవన్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిసి తమ నెల వేతనం రూ.2.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. మిగతా ప్రజాప్రతినిధులూ వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలంటూ కేటీఆర్ అభినందించారు.
*తెలంగాణ హైకోర్టులో 48మంది వ్యక్తిగత సిబ్బంది నియామకానికి సంబంధించి, రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు న్యాయమూర్తుల వద్ద కార్యాలయ సహాయకులుగా వారిని కేటాయిస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలిచ్చారు.
* బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఈ నెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదలవచ్చని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. వాటి కదలికలు ప్రస్తుతం సాధారణంగా ఉండటం వల్లనే ఒక మాదిరి వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఒకట్రెండు చోట్ల బుధవారం భారీ వర్షాలు పడవచ్చని కూడా ఆయన చెప్పారు. తమిళనాడు తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 155 ప్రాంతాల్లో మంగళవారం ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అధికంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 98 మిల్లీమీటర్లు నమోదు కాగా; చిట్యాలలో 91, హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 82.8, మాదాపూర్ 76, ఆసిఫ్నగర్ 66.5, జూబ్లీహిల్స్లో 64.8 మి.మీ.వర్షం కురిసింది.
*రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మెగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. వేసవిలో ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారి కోసం వీటిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
*ఎన్నికల సందర్భంగా వివిధ జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. బదిలీలకు సంబంధించి బుధ, గురువారాల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు.