Health

కాలి వేళ్ల మధ్య ఫంగస్ వచ్చిందా?

How to treat fungal infections between toes?

వానాకాలం పాదాలు నీళ్లలో తరచుగా నానుతూ ఉండడం వల్ల కాలి గోళ్లకు ఫంగస్ సోకుతుంది. ఈ ఫంగ్సను వదిలించాలంటే ఈ చిట్కా పాటించాలి! ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు చేతి వేళ్ల కంటే కాలి వేళ్లకే ఎక్కువని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ నిర్ధారించింది. ఇందుకు కారణం పాదాలు నేలకు దగ్గరగా ఉండడం, ధరించే చెప్పులు, బూట్లు శుభ్రంగా ఉంచుకోకపోవడం, పదే పదే నీళ్లలో పాదాలు తడుస్తూ ఉండడమే! అయితే ఏ కారణం వల్ల పాదాలకు ఫంగస్ సోకినా దాన్ని వదిలించే చిట్కాలను పాటించాలి.
**ఇందుకోసం….
బేకింగ్ సోడా: 4 టేబుల్ స్పూన్లు
యాపిల్ సెడార్ వినెగర్: 1 కప్పు
నీళ్లు: తగినన్ని
పేపర్ టవల్స్: 4
పాదాలు మునిగేలా బక్కెట్లో నీళ్లు నింపి, దాన్లో ఒక కప్పు వెనిగర్ వేసి కలపాలి.
ఈ నీళ్లలో పాదాలను 15 నిమిషాలపాటు నానబెట్టి, తుడిచేయాలి.
తర్వాత అవే నీళ్లలో బేకింగ్ సోడా కలిపి, మరో 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత పేపర్ టవల్తో తుడిచేయాలి.
ఇలా రోజుకు రెండుసార్లు చేయాలి. వెనిగర్ వల్ల ఫంగస్ కారక బ్యాక్టీరియా నశిస్తుంది.
బేకింగ్ సోడా ఫంగస్ పెరుగుదలను అరికడుతుంది.