DailyDose

భారీ ఎన్‌కౌంటర్…ఐదుగురు మృతి-నేరవార్తలు–08/24

భారీ ఎన్‌కౌంటర్...ఐదుగురు మృతి-నేరవార్తలు–08/24-Huge encounter in chattisgarh forests-5killed-telugu crime news today-08/24

* ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మరోసారి తుపాకీల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్‌ జిల్లా అంబుజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలకు వారు ఎదురుపడ్డారు. దీంతో తుపాకుల మోతమోగించారు.
* వెంకటగిరి రూరల్ మండలం, మన్నేగుంట శివారు చెరువులో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 30 వేల రూపాయల విలువగల 3 ఎర్రచందనం ముద్దలను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. రాజేష్ అనే నిందితుడు అరెస్ట్.
* ఆసిఫాబాద్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మూడనమ్మకాలతో బాలింత ప్రాణాలు పోగొట్టుకుంది. వైద్యం నిరాకరించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈనెల 16వ తేదీన కర్పతగూడకు చెందిన సుమలత శిశువుకు జన్మనిచ్చింది.
* పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ ప్రముఖ పుణ్యక్షేత్రం వాసవి ధామ్ లో చోరీకి గురి అవ్విన పంచలోహ విగ్రహంసుమారు 50,000 విలువ గల పంచలోహ విగ్రహం చోరీకొత్తగా నిర్మితమైన 102 అడుగులు వాసవి ధామ్ ఆలయంలో 90 అడుగుల పంచలోహ విగ్రహం దగ్గర మరఖాత శిల్పం వద్ద ఉండే చిన్న పంచలోహ విగ్రహం చోరీ.
*మహారాష్ట్రలోని భివాండిలో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భవనానికి పగుళ్లు రావడంతో.. మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై.. దాంట్లో నివాసముంటున్న 22 కుటుంబాలను రాత్రి ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది.
*అనంతపురం జిల్లా శెట్టూరు కరిడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు పిల్లలు చనిపోయారు. వీళ్లిద్దరూ అన్నదమ్ములు. చెరువుగట్ట వద్ద టాయిలెట్‌కు వెళ్లిన 9 ఏళ్ల బాలు చెరువులో జారిపోయాడు. తమ్ముడ్ని కాపాడే ప్రయత్నంలో 12 ఏళ్ల బన్నీ కూడా చెరువులో జారిపడిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
* నెల్లూరుజిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి బస్టాండ్ లో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం బస్టాండ్ లో నడిచి వెళుతున్న యువతిని చెయ్యిపట్టుకొని లాగి పరారైన యువకులు.వెంబడించి ఒక యువకుడిని పట్టుకున్న గ్రామస్తులు,దేహశుధ్ధి చేసి పోలీసులకు అప్పగింత.విజయనగరం మీ సేవా వద్ద భారీ తోపులాట..
* విశాఖజిల్లా లోని అరకులోయ లో దారుణం. అరకువేలి మండలం శరభగూడ గ్రామ సమీపంలో సి.ఏ.హెచ్ స్కూల్ దారిలో చినలబుడు గ్రామానికి చెందిన పుష్ప అనే బాలికపై అత్యాచారం, అనంతరం బాలిక తలపై బండారాయితో కొట్టి హత్య.ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
* ప్రకాశం జిల్లా దోర్నాల నల్లమల అటవీ పరిధిలో 9 మంది అరెస్ట్‌ అయ్యారు. ఇటీవల పంగోలిన్‌ జంతువు వేట కేసులో 9 మందిని అటవీ అధికారులు అరెస్ట్‌ చేశారు. నిందితులను అటవీ దికారులు కోర్టులో హాజరుపరిచి రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు.
*ఓ చోరీ కేసులో నిందితురాలిని విచారిస్తే రెండు దశాబ్దాల కిందట ఓ బాలుడిని అపహరించిన ఉదంతం బయటపడిన సంఘటన ఇది. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస పోలీసు స్టేషన్లో ఓ హెడ్కానిస్టేబుల్ చాకచక్యంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
*నగలు మూటకట్టి గంగలో ముంచితే రెట్టింపు అవుతాయంటూ అదేదో సినిమాలో కామెడీ పండించినట్లు.. పూజలు చేసి డబ్బును మూడింతలు చేస్తామని చెప్పి ముగ్గురు వ్యక్తులు ఓ అమాయకుడికి టోకరా వేసి రూ. 12.60 లక్షల మేర మోసం చేశారు.
*ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మహేందర్రెడ్డి, మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులకు కలుషిత జలాలను పార్శిల్ చేసి పంపేందుకు యత్నించిన నిందితుడిని సికింద్రాబాద్ కుమ్మరిగూడవాసి వెంకటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు.
*శౌచాలయ నిర్మాణానికి తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్లో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది.
*లండన్లో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యారు. ఖమ్మం నగరానికి చెందిన సన్నే శ్రీహర్ష లండన్లో ఉంటూ పీజీ విద్యనభ్యసిస్తున్నారు. ఈయన తండ్రి పేరు ఉదయ్ప్రతాప్ ఖమ్మం జిల్లా భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లండన్లో చదువుకుంటున్న శ్రీహర్ష రెండు రోజుల క్రితం నుంచి కనిపించకుండాపోయారు.
*తాము సాగు చేసుకుంటున్న భూములకు కొత్త పట్టాపాసు పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన చెందిన అన్నదాతలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.
*అనుమానిత ఉగ్రవాదులుగా అరెస్టయిన ముగ్గురు యువకుల నుంచి పాక్ ఫోన్ నంబర్లకు సమాచారం వెళ్లినట్టు మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు.
*దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్ వ్యాగన్ కేసు వ్యవహారంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి.
*శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని గగన్పహాడ్లో అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. బాలిక సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారిని అపహరించిన రంజిత్సింగ్ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు.
*మద్యం మత్తులో మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
*మద్దిలపాలెంలోని సీఎంఆర్ సెంట్రల్ సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పెట్రోల్ బంక్ సమీపంలోని సెల్ఫోన్ టవర్ కాలి బూడిదయింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చోటు చేసుకుంది.
* ఆరుగురు ఉగ్రవాదులు కోయంబత్తూరులో ప్రవేశించారని నిఘావర్గాలు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. తమిళనాడు కేరళ రాష్ట్రాలలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు ఖాదర్ రహీం అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు.
* ప్రముఖ రచయిత్రి, అనువాదకులు జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖలోని వెంకోజిపాలెంలో తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఎంవీపీ కాలనీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.