Devotional

నరక చతుర్దశి ప్రాశస్త్యం ఇదే

The importance of naraka chaturdasi-నరక చతుర్దశి ప్రాశస్త్యం ఇదే

దీపావళి సంబంధ కథల్లో నరకాసుర వధ ఇతివృత్తం ప్రముఖమైనది. ఇతడు వరాహావతార కాలంలో విష్ణుమూర్తికి, భూదేవికి జన్మించాడు. ఆ కాలంలో భూదేవి జనక మహారాజుకు తన కుమారుని పెంపకం బాధ్యతను అప్పగించి వెళ్లిపోయింది. అపుడతడి పేరు భౌముడు. ఇతడి అకృత్యాలకు విసిగి వేసారిన జనకుడు భౌముడిని తీసుకెళ్లమని భూదేవికి చెప్పాడు. ఆమె విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఆయన భారతదేశపుఈశాన్య ప్రాంతంలో అసమ (అస్సాం) ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఏర్పరచి, భౌముణ్ణి పట్ట్భాషిక్తుడిని చేశాడు. బలగర్వితుడైన భౌముడు నరులను హింసిస్తూ పాలన చేయడంవల్ల నరకాసురుడు అని పేరు పొందాడు. అతని రాజధాని పేరు ప్రాగ్జోతిషపురం. అంటే తూర్పున వెలిగే నరకమని అర్థము. ప్రజల ప్రార్థన మేరకు ధర్మసంస్థాపనకై సత్యభామను తీసుకుని శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చతుర్దశి రోజున చేశాడు.
చతుర్దశ్యాం తు యేదీవాన్ నరకాయ దదంతిచ
తేషాం పితృగణాస్సత్వా నరకాన్ స్వర్గ మాప్నుయః
నరక చతుర్దశి రోజున చేయాల్సింది- మరణించి పితృలోకాలకు వెళ్లిన మన పెద్దలను తలచుకొని, ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క దీపాన్ని మనింట్లో వెలిగించడం. నూనె పోసి వెలగించినదానినే దీపం అంటారు. పెట్టిన దీపాలను పై శ్లోకం పఠిస్తూదానం చేయాలి. ‘పితృలోకాల్లో వున్న మా పూర్వీకులందరికీ (ఈ ఒక దీపం) ఒక్కొక్కరికి ఈ దీపాలు వెలుగు చూపుతూ వారందర్నీ స్వర్గం చేరుకునేలా చేయుగాక!’ అని ఆకాంక్షించడం, ఇలా ఇవ్వడంలోని భావం.నరక శబ్దానికి దుర్గతి అని కూడా అర్థం వుంది. అనగా జీవులు తాము చేసిన పాపాలకు తగిన శిక్ష పొందే చోటు. యమలోకంలో 84 లక్షల నరకాలు ఉన్నాయట. వాటిలో మిక్కిలి భయంకరములైన నరకాలు 27 ఉన్నట్లు పురాణాల్లో చెప్పబడింది. అవే రౌరవాది నరకాలు. నరకానికి అధిపతి యముడు. కనుక నరక చతుర్దశినాడు యమప్రీతికై పూజాదులు నిర్వహించి దీపాలను వెలిగించాలట. ఇలా చేస్తే పితృదేవతలు నరక విముక్తులై స్వర్గానికి పోతారట.
నరక చతుర్దశి నాడు తలంటుకోవడంలో ఒక విశిష్టత ఉంది.‘తైతే లక్ష్మీర్జతే గంగా దీపారళ్వాశ్చతుర్దశీమ్’ అని-కావేరీ మహత్మ్యంలో చెప్పినట్లుగా నరకచతుర్దశినాడు అభ్యంగన స్నానం సమస్త మంగళములను ఆహ్వానించడమే అని చెప్పబడింది. ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే పవిత్ర స్నానాన్ని ఆచరిస్తే శరీరానికి దివ్యశక్తి కలుగుతుందంటారు. నరక చతుర్దశి రోజు, లోకాన్ని పాలించే లక్ష్మీదేవి తైలంలోనూ, గంగ నీటిలోనూ ఆవేశించి ఉంటాయని పద్మపురాణం చెబుతోంది.భారత స్ర్తి సంప్రదాయం ఎంత గొప్పదంటే లోక కంటకుడైతే తన పుత్రుడని లెక్కచేయకుండా వధించవలసిందే అని చెప్పేటంత. అందుకే పుత్రుని బాధను భరించలేని భూదేవి తనభర్తతో మొరపెట్టుకుని నరకుణ్ణి వధించేసింది. నరకచతుర్దశి నాటి సాయంత్రం కనీసం ఐదు ప్రదేశాల్లో దీపాలు ఉంచాలి. ఇంటి దీపం, ధాన్యపుకొట్టు, రావిచెట్టు మొదట, వంటిల్లు, బావి దగ్గర దీపాలు వెలగించాలి. ఉత్తరాదిన కొందరు నాలుగు వీధుల కూడళ్లలో కూడా దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాల దర్శనంవల్ల నరక తిమిరం ఉండదు.క్షుతిపా సామలాం జ్యేష్ఠామ లక్ష్మీం, నాశయామ్యహమ్అభూతిమ సమృద్ధించ సర్వాం నిర్గుదమే గృహాత్ఆకలి దప్పులతో కృశించే దైవ జ్యేష్ఠాదేవిని నేను నాశనం చేస్తాను. నా గృహం నుండి అభాగ్యాన్ని తొలగించి అనుగ్రహించు అని లక్ష్మీదేవిని నరకచతుర్దశినాడు ప్రార్థించాలి. గుజరాతీలు నరక చతుర్దశిని కాలచేదశ్ అంటారు. చివరగా దుష్ట్భావనలను, దుష్ట ఆలోచనలను కృష్ణ్భక్తి అనే ఆయుధంతో ఖండింపజేసి, జీవుడు భగవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది నరకచతుర్దశిలోని అంతరార్థం.
1. యుగయుగాల వెలుగుల వేడుక!
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి జ్ఞానాన్ని వెలిగించడమే విశ్వశ్రేయస్సుకు మార్గం. అదే ‘దీపావళి’ అర్థం… పరమార్థం!
దీపారాధనతో… ముగ్గురమ్మల పూదీప శిఖలో నీలం, పసుపు, తెల్ల రంగులు కనిపిస్తాయి.ఈ మూడు రంగులూ త్రిజగన్మాతలైన శ్రీమహాకాళి, శ్రీమహాలక్ష్మి, శ్రీమహాసరస్వతి దేవతలకు ప్రతిరూపాలని పురాణోక్తి. అంటే దీపారాధన చేయడం అంటే ఆ త్రిశక్తులనూ, వారితో కూడిన త్రిమూర్తులనూ పూజించినట్టేనని పెద్దల మాట.
**రోజుకో విశేషం!
దీపావళి అయిదు రోజుల పర్వం. ప్రతి రోజుకూ ఒక విశిష్టత ఉంది.
**ధన త్రయోదశి:
ఆశ్వయుజ బహుళ త్రయోదశితో దీపావళి సంరంభం మొదలవుతుంది. ఆ రోజును ‘ధనత్రయోదశి’ అంటారు. క్షీరసాగరం నుంచి మహాలక్ష్మి ఆవిర్భవించిన దినం.
**నరక చతుర్దశి: ప్రజాపీడకుడైన నరకాసురుడి వధ జరిగిన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘నరక చతుర్దశి’ అని పిలుస్తారు.
**దీపావళి:
ఆశ్వయుజ అమావాస్యను దీపావళిగా జరుపుకొంటారు. ఈ రోజు ఇల్లంతా దీపాలతో అలంకరిస్తే, ఆ ఇంట లక్ష్మి కొలువుంటుందని నమ్మకం.
బలి పాడ్యమి: వామనావతారి అయిన విష్ణువు పదఘట్టనకు పాతాళానికి వెళ్ళిన బలి చక్రవర్తి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి రోజున భూలోకానికి వస్తాడట! అందుకే ఈ రోజును ‘బలి పాడ్యమి’ అంటారు. శ్రీకృష్ణుడు గోవర్ధ గిరిని ఎత్తిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి.
**యమ విదియ:
కార్తీక శుద్ధ విదియకు ‘యమ విదియ’, ‘యమ ద్వితీయ’, ‘భాతృ విదియ’ అనే పేర్లున్నాయి. యమధర్మరాజును ఆయన సోదరి యమునా దేవి ఈ రోజున ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చిందట. దానికి సంతృప్తుడైన యముడు ఈ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి అపమృత్యుభయం, నరక బాధ ఉండవని వరం ఇచ్చాడట! దీన్నే ‘భగినీ హస్త భోజనం’ అనీ, ఉత్తరాదిన ‘భాయ్ దూజ్’ అనీ, అంటారు. లోకుల పాపపుణ్యాల చిట్టా రాసే చిత్రగుప్తుడి జయంతి కూడా ఈ రోజే!
ఆర్ష సాంప్రదాయంలో దీపమే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టే-
‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో స్తుతే’’ అని ఆర్యోక్తి.
**‘‘అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సకలాభీష్ట పరమార్థాలనూ సిద్ధింపజేసే పరబ్రహ్మ స్వరూపమైన ఆ దివ్య పరంజ్యోతికి ప్రణామం’’ అని దీని భావం. మన హృదయాల్లో ‘అజ్ఞానం’ అనే నరకాసురుణ్ణి అంతమొందించి, జ్ఞానపూర్ణ పరమార్థ జ్యోతి అయిన ‘శ్రీసత్యా-కృష్ణ పరంజ్యోతి’లో లీనమయ్యే ఆధ్యాత్మిక వికాసాన్నీ, మోక్ష పథాన్నీ పొందడం, తద్వారా విశ్వకల్యాణానికి దోహదపడడం దివ్య జ్ఞాన దీపావళిలోని పరమార్థం. యుగయుగాలుగా దీపావళి పర్వం భారతీయ ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిందని చాటి చెప్పే పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక గాథలెన్నో! వాటిలో కొన్ని:
**శ్రీకృష్ణ సత్య- ధర్మరక్షణ దీపావళి
కృతయుగంలో శ్రీ వరాహస్వామి ద్వారా భూదేవికి జన్మించిన నరకాసురుడు లోకకంటకుడయ్యాడు. ధర్మసంస్థాపన కోసం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మహా విష్ణువు అవతరించగా, సత్యభామగా భూదేవిగా జన్మించింది. వారి ద్వారా ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరకాసుర వధ జరిగింది. నరక పీడను తొలగించిన సత్యభామా శ్రీకృష్ణులపై దివి నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. భువిలో మానవులంతా ఆనందోత్సాహాలతో ఆ మరునాడు ఇంటింటా తైల దీపాలను వెలిగించి చేసుకున్న పండుగే దీపావళి. పౌరాణికంగా ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది. ఈ విధంగా అధర్మంపై సాధించిన విజయానికి చిహ్నంగా, ప్రధానంగా వెలుగుల పండుగగా దీపావళిని నిర్వహించడం సంప్రదాయం అయింది.
**బలి చక్రవర్తికి స్వాగత దీపావళి
శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని మూడు అడుగుల నేలను దానంగా కోరాడు. ఒక అడుగుతో భూమినీ, రెండో అడుగుతో ఆకాశాన్నీ ఆక్రమించి, తుదిగా బలి ఆమోదంతో మూడో అడుగును అతని శిరస్సుపై ఉంచి పాతాళానికి అణిచేశాడు. బలి చక్రవర్తి తాత, తన భక్తుడు అయిన ప్రహ్లాదుడి కోరికపై ప్రతి సంవత్సరం ఒకసారి భూలోకానికి వచ్చి, భూలోక వాసుల సుఖ జీవనాన్ని చూసి ఆనందించే వరాన్ని బలికి శ్రీమహావిష్ణువు అనుగ్రహించాడు. దాన గుణానికి పేరుపొందిన బలి చక్రవర్తి భూమిపైకి రాగా, ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగించి స్వాగతం పలికారట! అదే దీపావళి అయింది. అప్పటి నుంచి- అంటే కృతయుగం నుంచే దీపావళి పండుగ జరుపుకొంటున్నారని భవిష్యోత్తర పురాణంలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పిన దీపావళి కథా విశేషం. దీపావళి మరుసటి రోజున బలిని పూజిస్తారు. కాబట్టి అది ‘బలి పాడ్యమి’గా ప్రసిద్ధి చెందింది.
**యమధర్మరాజు పూజ
‘నరకం’ అంటే ‘యమలోకం’ అని స్థూలార్థం. ‘నరకలోక విముక్తి కోసం యముణ్ణి భక్తి నిష్టలతో పూజించే విశేష పర్వం నరక చతుర్దశి’ అని వ్రత చూడామణిలో- యమధర్మరాజు అనుగ్రహం కోసం పేర్కొన్న పూజా విధానాన్ని బట్టి తెలుస్తోంది. యమధర్మరాజు పూజకు ప్రతీకగా దీపాలు వెలిగించే పండుగ దీపావళి అనీ, దీనివల్ల నరక భీతి పోతుందనీ, స్వర్గ ప్రాప్తి కలుగుతుందనీ పురాణాల్లో పేర్కొన్నారు.
చతుర్దశ్యాంతు యే దీపాన్ నరకాయ దదంతి చ
తేషాం పితృగణాః సర్వే నరకాత్స్వర్గ మాప్నుయుః
ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున ఎవరైతే దీపాలు వెలిగించి, యమధర్మరాజును పూజిస్తారో వారూ, వారి పితృదేవతలూ నరకలోక విముక్తులై, స్వర్గాన్ని పొందుతారని దీని అర్థం. కాబట్టి ‘నరక చతుర్దశి’ నాడు యముణ్ణి పూజించి, దీపాల బారులను వెలిగించాలి. ఆ దివ్య కాంతుల ద్వారా పితృ దేవతలకు స్వర్గ మార్గాన్ని చూపించడానికి అలా దీపాల వరుసను వెలిగించాలని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి.
**రామరాజ్య దీపావళి
త్రేతాయుగంలో రావణుణ్ణి వధించిన శ్రీరాముడు అయోధ్యకు సీత, లక్ష్మణ, హనుమాదులతో విచ్చేసి పట్టాభిషిక్తుడయ్యాడు. అయోధ్య ప్రజలతో పాటు అన్ని లోకాలవారూ సంతోషంగా దీపాలు వెలిగించి ఉత్సవాలు చేసుకున్నారు. ఆనాటి నుంచి రామరాజ్య దీపావళిని ప్రజలు జరుపుకొంటూ వచ్చారని మరో గాథ. ఉత్తర భారతదేశంలో రావణ వధకు చిహ్నంగా దీపావళిని జరుపుకొనే వాడుక ఉంది.విక్రమార్క విజయోత్సవం
కాళీమాత అనుగ్రహంతో దివ్యశక్తి సంపన్నుడైన విక్రమార్క చక్రవర్తి ఉజ్జయిని రాజధానిగా ఆర్యావర్తమంతటినీ మహోజ్జ్వలంగా, ఏకచ్ఛత్రాధిపత్యంగా సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన రాజ్యాభిషిక్తుడైన రోజు నుంచి విక్రమ శకం పరిగణనలోకి వచ్చిందనీ, ఆనాటి నుంచి భారతీయులందరూ సంతోషంగా దీపావళి చేసుకోవడం ప్రారంభించారనీ కొందరు పండితుల అభిప్రాయం.
వీటిలో శ్రీరామ పట్టాభిషేకం, విక్రమార్క విజయగాథలు ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. కాగా, నరకాసుర వధ కథ మాత్రం దేశమంతటా, ముఖ్యంగా ఉత్తరాదిలో ఎక్కువ ప్రసిద్ధి చెందింది.
**శ్రీ లక్ష్మీ పూజ
లక్ష్మీ దేవి సకలైశ్వర్యప్రదాయని. ‘దీప లక్ష్మీ నమోస్తుతే’ అంటూ దీపాన్ని మహాలక్ష్మీ స్వరూపంగా సంభావించి, భక్తితో దీపావళి రోజున ఆరాధిస్తారు. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాపారులు లక్ష్మీ పూజ చేసి, కొత్త ఖాతా పుస్తకాలను పూజామందిరంలో ఉంచుతారు. తమ వ్యాపారాలు జయప్రదంగా సాగేట్టు చూడాలని లక్ష్మీ దేవిని ప్రార్థిస్తారు. ఇలా దీపావళి పండుగ చుట్టూ ఎన్నో పురాణ కథలు, గాథలు ఉన్నాయి. వీటన్నిటినీ స్మరించుకొని, ఆనందంగా పండుగ జరుపుకొందాం.
‘కల్యాణశ్రీ’ జంధ్యాల వేంకట శాస్త్రి.

2. కాశీకాలుష్యభరితం-హైదరాబాద్కు 91వ ర్యాంకు: సీపీసీబీ
దేశంలోనే అత్యంత కాలుష్యభరిత నగరంగా కాశీ నిలిచింది. గాలి నాణ్యతా సూచీ(ఏక్యూఐ) ఆధారంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని 500 నగరాలకు ‘ఏక్యూఐ ర్యాంకింగ్’లు ఇచ్చారు. ఈ జాబితాలోని తొలి మూడు కాలుష్యభరిత నగరాలు ఉత్తరప్రదేశ్లోనివే. కాశీ 276వ స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో యూపీలోని లఖ్నవూ(269), ముజఫర్నగర్(266), మొరాదాబాద్(256) నిలిచాయి. ఇందులో హైదరాబాద్(91)విశాఖపట్నం(55), విజయవాడ(36)తిరుపతి(49), అమరావతి(32), రాజమండ్రి(46), ఢిల్లీ(196), ముంబై(109), బెంగళూరు(3స్థానాల్లో ఉన్నాయి

3. రేపుసాయంత్రందుర్గమ్మఆలయంమూసివేత
దీపావళి రోజు అమావాస్య సందర్భంగా ఆదివారం సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ ముగిసిన తర్వాత రాత్రి 7 గంటలకు కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. మర్నాడు ఉదయం తెల్లవారుజామున యథావిధిగా దేవస్థానాన్ని తెరుస్తారు

4. అన్యోన్య దాంపత్యానికి కేదారేశ్వర వ్రతం
దీపావళి పండుగ వేళ కేదారేశ్వర వ్రతం ఆచరిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమినాడు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. మంగళగౌరీ అనుగ్రహం కోసం, దాంపత్య సౌఖ్యం కోసం చేసే ఈ వ్రతాన్ని కేదారేశ్వర వ్రతం అని కూడా అంటారు. ఇది భార్యాభర్తలిద్దరూ కలిపి చేసుకునే వ్రతం. భర్తకు కుదరనప్పుడు భార్య మాత్రమే చేసుకోవచ్చు. భార్యకు వీలుకాక పోతే మాత్రం భర్త ఒక్కడే చేయకూడదు. వివాహంకాని ఆడపిల్లలు కూడా ఈ నోము నోచుకోవచ్చు. ముందుగా 21 పేటల పట్టు దారాన్ని కాని, నూలు దారాన్ని కాని తోరంగా కట్టుకోవాలి. కలశంలోకి, ప్రతిమలోకి కేదారేశ్వరుని ఆవాహన చేయాలి. 21 ఉపచారాలతో పూజ చేయాలి. గోధుమపిండితో 21 నేతి అరిసెలు వండాలి.పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసం, అన్ని రకాల కూరలు, పళ్లు నివేదన చేయాలి. కథ చెప్పుకున్నాక అక్షింతలు వేసుకోవటం మర్చిపోకూడదు.ఇలా 21 సంవత్సరాలు చేయాలి. ముగింపు విషయానికి వస్తే పార్వతీదేవి ఉద్యాపన చేసినట్టు ఉంది కాని ఏమి చేసిందో తెలియదు. నోచుకున్నవారు ఉద్యాపన సంకల్పం చెప్పుకుంటే చాలునని పెద్దలమాట. ఆసక్తి ఉన్నవారు తమ శక్తికొద్దీ చేసుకోవచ్చు. కేదారం అంటే మాగాణం. వరి పండే పొలం. దానికి అధిపతి కేదారే శ్వరుడు. పార్వతీదేవి ప్రకృతి స్వరూపిణి. పార్వతి లేకపోతే శివుడు శక్తి హీనుడయిన గాథను వ్రత కథగా చెప్పుకుంటారు. ఈ వ్రతకథ స్త్రీ పురుషుల సమానత్వాన్ని తెలియచేస్తుంది. గౌరీదేవి లేనిదే శివుడికి పూజలేదు. గౌరితో కూడిన సాంబశివుణ్ణి పూజించే అరుదైన వ్రతం ఇది.

5. పంచాంగం 26.10.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం: ఆశ్వయుజ
పక్షం: కృష్ణ బహుళ
తిథి: త్రయోదశి ప.02:22 వరకుతదుపరి చతుర్దశి వారం: శనివారం (మంద వాసరే) నక్షత్రం: ఉత్తర ఫల్గుణి ఉ.07:53 వరకుతదుపరి హస్త రా.తె.05:59 వరకు
యోగం: వైధృతి, వృషకుంభ కరణం: వణిజ
వర్జ్యం: ప.03:37 – 05:06
దుర్ముహూర్తం: 06:12 – 07:46
రాహు కాలం: 09:06 – 10:32
గుళిక కాలం: 06:12 – 07:39
యమ గండం: 01:26 – 02:53 అభిజిత్ : 11:36 – 12:22
సూర్యోదయం: 06:12
సూర్యాస్తమయం: 05:47
వైదిక సూర్యోదయం: 06:15
వైదిక సూర్యాస్తమయం: 05:44
చంద్రోదయం: రా.తె.04:08
చంద్రాస్తమయం: సా.04:40
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కన్య
దిశ శూల: తూర్పు
నక్షత్ర శూల: ఉత్తరం
చంద్ర నివాసం: దక్షిణం
ధనత్రయోదశి
☘ మాసశివరాత్రి ☘
జలపూర్ణ త్రయోదశి
యమదీప దానం
గోత్రిరాత్ర వ్రతం
శనిత్రయోదశి

6. రాశిఫలం – 26/10/2019
తిథి:
బహుళ త్రయోదశి మ.1.39
నక్షత్రం:
ఉత్తర ఉ.7.03 త. హస్త రా.తె.5.25
వర్జ్యం:
మ.2.52 నుండి 4.21 వరకు విశేషాలు: మాసశివరాత్రి, సామాన్య శనిత్రయోదశి
దుర్ముహూర్తం:
ఉ.06.00 నుండి 07.36 వరకు
రాహు కాలం:
ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) గౌరవ మర్యాదలకు లోపముండదు.వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. మానసికాందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్ర్తిలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి వుంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మనస్సు చంచలంగా వుంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగా నుండుటకు ప్రయత్నించాలి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటకు దూరంగా నుండుట మంచిది. ఔషధసేవ తప్పదు. స్థిరాస్తుల విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
కుంభం:
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

7. చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 26*
1947 : రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవికి చేపట్టిన బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ జననం.
1950: కలకత్తా లో మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరీసా స్థాపించింది.
1962: భారత్ పై చైనా దాడి పర్యవసానంగా, దేశంలో మొట్టమొదటిసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
1965 : ప్రముఖ నేపధ్య గాయకుడు నాగూర్ బాబు అలియాస్ మనో జననం.
1985 : కేరళ రాష్ట్రం నుండి వచ్చిన ఒక భారతీయ చిత్ర నటి ఆసిన్ జననం.
1990: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, వి.శాంతారాం మరణం. ☘ ?

8. ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
*_కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్_*
26.10.2019 వతేది, *శనివారము ఆలయ సమాచారం*
*_శ్రీ స్వామి వారి దర్శన వేళలు_* ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికాల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..
స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండును
అనంతరము ఉదయం 7.30 గం|| నుండి అర్జిత అభిషేక సేవ సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు…
అభిషేక సేవా అనంతరము శ్రీస్వామి వారి దర్శనము ఉ.10.00 గంటల నుండి మధ్యహ్న 1.00 గంటల వరకు వుండును
రెండవ మహాగంట నివేదనమ.1.00 నుండి 1.30 లోపు, బాలబోగ్యం త్రికాల నైవేద్యాము సమర్పణ
మ 1.30 నుండి 2.00 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..
తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును..
మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికాల నైవేద్యాదులు సమర్పణ మహ మంగళ హారతి, పరివార దేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ..
తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును..
రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు*
*26.10.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 46*
*26.10.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్ : 9

9. తిరుమల \|/ సమాచారం* *
_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈ రోజు శనివారం, *26.10.2019* ఉదయం 6 గంటల సమయానికి, _తిరుమల: *19C°-27℃°*_
• నిన్న *56,955* మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *01* గదిలో భక్తులు వేచి ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు *03* గంటలు పట్టవచ్చును,
• నిన్న *20,837* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹: 3.27* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును,
_*గమనిక:*_
# ₹:10,000/- విరాళంఇచ్చు శ్రీవారి భక్తునికిశ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒకవిఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి,
#ఈనెల 29న వృద్ధులు,దివ్యాంగులకు ప్రత్యేకఉచిత దర్శనం,_(భక్తులు రద్దీ సమయాల్లో__ఇబ్బంది పడకుండా ఈ__అవకాశం సద్వినియోగం__చేసుకోగలరు)_
#ఈనెల 30 న చంటిపిల్లలతల్లిదండ్రులకు శ్రీవారిప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30వ‌ర‌కు సుపథం మార్గంద్వారా దర్శనానికిఅనుమతిస్తారు,
*_వయోవృద్దులు / దివ్యాంగుల_*
• ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,
*_చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*
• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,
*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_
*తా:* _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది__కావున లెమ్ము స్వామి_

10. శ్రీరస్తు శుభమస్తు
*తేది : 26, అక్టోబర్ 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
♦ మాసం : ఆశ్వయుజమాసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : స్థిర (మంద) వాసరే (శనివారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : త్రయోదశి(నిన్న రాత్రి 7 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 47 ని॥ వరకు త్రయోదశి తిధి తదుపరి చతుర్దశి తిధి)
నక్షత్రం : ఉత్తర, హస్త(నిన్న ఉదయం 11 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 27 ని॥ వరకు ఉత్తరాఫల్గుణి నక్షత్రం మరియు ఈరోజు ఉదయం 8 గం ll 27 ని ll వరకు హస్త నక్షత్రం తదుపరి చిత్త నక్షత్రం)
యోగము : (ఐంద్రం ఈరోజు ఉదయం 6 గం ll 3 ని ll వరకు)(వైధృతి రేపు తెల్లవారుఝాము 2 గం ll 5 ని ll వరకు తదుపరి విష్కంభం రేపు రాత్రి 10 గం ll 10 ని ll వరకు)
కరణం : (వణిక్ ఈరోజు సాయంత్రం 3 గం ll 47 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మధ్యాహ్నం 12 గం ll 0 ని ll )
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 22 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 27 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 6 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 32 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 33 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 41 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 52 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 13 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 48 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : కన్య
శనిత్రయోదశి
యమ తర్పణం
మాసశివరాత్రి
* నేటి సుభాషితం *
*భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి.*

11. నేటి సామెత *
*నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు*
ఇక్కడ “నోటికి అదుపు” అన్న మాటకు రెండు అర్ధాలు తీసుకొనవచ్చును. ఒకటి నోటితో మనము ఏది మాట్లాడినా ఎంత పడితే అంత మాట మాట్లాడ రాదు ఐతే సందర్భానికి తగినట్లుగా ఆలోచించి మాట్లాడాలి.రెండవది నోటితో మనము తినేది తగినంత కన్నా ఎక్కువ తిన రాదు. అలా చేయకున్న అది మనిషికి చేటు తెచ్చును. అలాగే ఇంటిలోని వారికి కూడా పొదుపు వుండాలి. అది లేకపొయిన మొత్తం కుటంబానికే కాక వారి తరువాతి తరాల వారికి కూడా మంచిది కాదు.
* నేటి జాతీయం *
*కొంప కూల్చు*
మోసగించాడు
నా కొంప కూల్చాడు..
*కొంప మునిగింది*
ఏదో ఘోరం జరిగి పోయింది అని అర్థం
ఉదా: “అయ్యా…… కొంప మునిగిందయ్యా…. వాడు ఊరు విడిచి పారి పోయాడు” “కొంప ముంచావు గదయ్యా…. ఎదుటి వారికి ఏమి సమాదానము చెప్పను.”

12. నేటి ఆణిముత్యం
వేసరవు జాతి కానీవీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీదాసి కొడుకైన గానికాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
*తాత్పర్యం*నీచ జాతివాడైనా, నిష్ప్రయోజకుడైనా, దాసీ పుత్రుడైనా ధనం కలవాడే అధిపతి

13. మన ఇతిహాసాలు -గాంధారి*
గాంధారి : మహాభారత ఇతిహాసములో ధృతరాష్ట్రుడి భార్య, కౌరవులకు తల్లి. ఇప్పుడు ఆప్ఘనిస్తానులో ఉన్న కాంధహార్ (పాతపేరు “గాంధార”) నగరానికి చెందినది కావున ఈమెకు పేరు “గాంధారి” అని వచ్చింది. గాంధారి తండ్రి సుబలుడు, తమ్ముడు శకుని.ధృతరాష్ట్రుడుతో వివాహ సంబంధం వచ్చిన వేంటనే గాంధారి ధృతరాష్ట్రుడిని పతిగా భావించి, తన భర్త గ్రుడ్డి వాడు అవడం చేత తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకొంది. ఈమెకు దుర్యోధనుడితో మొదలయ్యే నూరుగురు కౌరవులుగా కుమారులు మరియు దుస్సల అనే కుమార్తె కలిగారు.