Movies

బీరు బాటిల్‌తో తల పగలగొట్టింది

Actress Sanjjana Breaks Beer Bottle On Producers Head

తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు నటి సంజనా గల్రానీ. ఇటీవల ఆమె ఓ కన్నడ నిర్మాతను బీర్‌ బాటిల్‌తో కొట్టిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత వందనా జైన్‌తో కలిసి డిసెంబర్‌ 24వ తేదీ రాత్రి సంజన ఓ పార్టీలో పాల్గొన్నారు. దీనిలో ఆమె మద్యం తాగి సంజన-వందన మాటల మధ్యలో ఓ విషయంపై బేధాభిప్రాయాలు వచ్చాయి. అనంతరం ఆగ్రహించిన సంజన అక్కడే ఉన్న బీర్‌ బాటిల్‌తో వందనా జైన్‌ తలపై గాయపరిచారు. ఈ మేరకు వందన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంజనపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సంజన తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. సోషల్‌మీడియా వేదికగా ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు. పార్టీలో తనకి, వందనకి మధ్య గొడవ జరిగిన మాట వాస్తవమేనని, కానీ, ఆమెను మాత్రం తాను గాయపరచలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు వందన ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.