Kids

పిల్లలూ…ఈ తెలుగు పదాలు నేర్చుకున్నారా?

New Telugu Words For Kids-TNILIVE Kids Useful Info

రోలు,రోకలికి అర్థం అవసరం లేదనుకొంటా.రోలును ఆంగ్లంలో Grinder అని రోకలిని Pestle అని అంటారు.
కవ్వం – పెరుగును మజ్జిగగా చిలకటానికి ఉపయోగిస్తారు.churning stick. కొడవలి – Sickle,

అటక – పూరిండ్లలోకాని మిద్దెలలోకాని సామానులు నిలువవుంచుకొనే Storage Cell. ఇప్పుడు మనం కhelf లని పిలుచుకొంటున్నాం కదా ! అటక పెద్దది. ఇంటిలోపల భూమికి పైకప్పుకు మధ్యన అటువైపు గోడకు ఇటువైపు గోడకు అడ్డంగా వాసాలు అమర్చి ఒక పెద్దగూడులాగా తయారు చేస్తారు.వ్యవసాయ పనిముట్లు అందులో వుంచుకొంటారు.

చూరు – – చూరును పట్టుకొని వేలాడుతూవున్నాడు అనే పద ప్రయోగం మీకు తెలుసు కదా ! ఈత, తాటి, ఆకులతోనూ, బోదగడ్డితోనూ ఇల్లు కడతారు. గడ్డి మీద నుండి వర్షపునీరు జారిపోవటానికి నిర్మాణం ఏటవాలుగా వుంటుంది. ఆ ఏటవాలునే చూరు అంటారు.

పొంత — నీరు కాచుకోటానికి ఉపయోగించే పెద్దకుండ. కట్టెల పోయ్యికి మూడు రాళ్ళు ఉంటాయి కదా! ఒక రాయి బదులుగా పొంతను వుంచుతారు. పోయ్యి వెలిగించినపుడు పొంతలోని నీరు కాగుతుంది.

మూకుడు – వంటపాత్ర పై మూయటానికి ఉపయోగించే మట్టి పళ్లెం.

కాడి — రెండు ఎడ్లను కాడి అంటారు.అంతేకాదు కాడి కట్టడమంటే నాగలిని సిద్ధం చేయటమని.కాడి అంటే Yolk అనే అర్థం కూడా వుంది.

పగ్గం – తాడు. పశువులను కట్టివేయటానికి ఉపయోగించవచ్చు.పరువానికి పగ్గం వేయాలని కవి ప్రయోగం వుంది.

పడ్డ – – లేగదూడను పడ్డ అంటారు., అది ఆవుదూడలేదా గేదె దూడ కావచ్చు.

చల్ల — మజ్జిగ

ముంత – చిన్న మట్టిపాత్ర. కల్లు ముంత. పూర్వం ధాన్యం కొలవటానికి వుపయోగించే పాత్రను ముంత అనేవారు. ముంతలో 3 కేజీల పరిమాణంతో ధాన్యం పట్టుతుంది.

లిక్కి- చిన్న కొడవలిని లిక్ అంటారు.

అంజనం — నేటి ఆయింట్మెంట్

గొత్తు, గూటం – పెద్దమేకు. షామియానా బిగించేటపుడు భూమిలో పాతే ఇనుప చీల. కర్రను కూడా భూమిలో పాతితే గొత్తు, గూటం అవుతుంది. గొత్తుకు గూటానికి పశువులను కట్టేస్తారు.

పశువుల గాడి.. దీర్ఘచతురశ్రాకార కట్టడం. రెండడుగుల వెడల్పు రెండడుగుల ఎత్తుగా వుంటుంది. పశువులను కట్టేసిన తరువాత ముందరి గాడి/గాటిలో గడ్డి వేస్తారు.

తునక అంటే ముక్క. చిన్నచిన్న ముక్కలుగా చేయడం. మాంసాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేస్తారు.ఇలాంటి చిన్న ముక్కలను తునకలనడం కద్దు.

సారె – – పుట్టింటివారు ఆడబిడ్డకు పెట్టే చీర, మిఠాయిలు, బియ్యం వగైరాలను సారెలంటారు.

నిట్రాయి –నిలువుగా పొడుగ్గా వున్న రాయి. కంచె నిర్మాణానికి వాడుతారు.

మోకు – – పెద్దది మందమైన తాడు.ఉదా॥ లారీలలో సరుకును వేసిన తరువాత బిగించే పెద్ద తాడునే మోకు అంటారు.

కపిల, మోట – – పశువుల సాయంతో బావినుండి నీటిని తోడేసాధనం.

ఇడ్డెన– అన్నం వడ్డించటానికి ఉపయోగించే పళ్లెం.పట్టుకోటానికి కాడ/handle.

చేద — బావినుండి కుండల,బిందెలతో చెంతాడు (తాడు ) సాయంతో నీటిని తోడటం.