Politics

గ్రామ వాలంటీర్లపై SEC నిషేధం

గ్రామ వాలంటీర్లపై SEC నిషేధం

పంచాయతీ ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లను వినియోగించరాదని, వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనరు రమేశ్‌ కుమార్‌ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తహసీల్దార్లు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలసత్వం వహించినట్లు ఫిర్యాదులొస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఉద్యోగుల విజ్ఞప్తులను ఎన్నికల సంఘం పరిశీలించి సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. విజయవాడ నుంచి బుధవారం జిల్లాల్లోని ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో రమేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఆర్థిక, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌శాఖల ముఖ్య కార్యదర్శులు రావత్‌, సింఘాల్‌, ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనరు గిరిజా శంకర్‌ కూడా సమావేశంలో ఉన్నారు.