Politics

చంద్రబాబు వద్దంటే తీసేస్తా-తాజావార్తలు

చంద్రబాబు వద్దంటే తీసేస్తా-తాజావార్తలు

* చంద్రబాబు వద్దంటే శ్వేత నామినేషన్ కూడా తీసేస్తా..పార్టీ ఎవరికి మేయర్ సీటు,ఇఛేనా నాకు సంబందం లేదు?బెజవాడలో 64 డివిజన్లు తిరుగుతా నేను ఎక్కడికైనా వెళతా..పార్టీ జెండా బెజవాడ కార్పొరేషన్ మీద ఎగరవేయాలి!! -కేశినేని నాని

* బ్రిటన్‌ సుప్రీంకోర్టులో ఉబర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్లను కార్మికులుగా పరిగణించాల్సిందేనని స్పష్టంచేస్తూ ఒక కేసులో లండన్‌ లోని కోర్టు తీర్పునిచ్చింది. దీనితో ట్యాక్సీ రైడ్‌ దిగ్గజ సంస్థ ఉబర్‌ కింద పనిచేస్తున్న డ్రైవర్లకు బ్రిటన్‌లో కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి సిక్‌ పే హక్కులు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఉబర్‌ తన డ్రైవర్లను ‘స్వయం ఉపాధి’ పొందుతున్న స్వతంత్ర థర్డ్‌ పార్టీ కాంట్రాక్టర్లుగా వీరిని సంస్థ వర్గీకరించింది. అంటే చట్టం ప్రకారం వారికి కనీస రక్షణలు మాత్రమే లభిస్తాయి. దీనిపై డ్రైవర్ల పోరాటంతో దీర్ఘంకాలంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వారిని స్వయం ఉపాధి కార్మికులుగానే గుర్తించాలన్న ఉబర్‌ విజ్ఞప్తిని న్యాయమూర్తి జార్జ్ లెగ్గట్ తోసిపుచ్చారు.

* కేసీఆర్ సర్కార్‌పై షర్మిల సలహాదారుడు కొండా రాఘవ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ప్రగతి భవన్‌ను తమ కుటుంబ ప్రయోజనల కోసం కేసీఆర్ కట్టుకుంటే.. క్యాంప్ ఆఫీస్‌ను ప్రజల కోసం వైఎస్ కట్టారన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తప్పక తెస్తామని పునరుద్ఘాటించారు.శనివారం లోటస్‌పాండ్‌లో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ‘‘రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఆత్మీయ సమేళనంలో ఊహించిన దాని కంటే అధికంగా రెస్పాన్స్ వచ్చింది.టీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తోంది. రూ.1250 కోట్లతో 2008లో డ్రైన్ వాటర్ సిస్టమ్‌ను మెరుగు పరచడానికి వైఎస్ఆర్ అనుమతులు ఇస్తే వాటిని ఖర్చు చేయకుండా దారి మళ్లించారు. కేసీఆర్ డబుల బెడ్ రూమ్ హామీతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.

* విలువలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ గురించి చర్చించేందుకు సిద్ధమైన రోజున ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉండాలని దిగుతున్న అభ్యర్ధులకు సూచించారు.

* దేశంలో గతకొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కరోనా మహమ్మారి తాజాగా మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 22 రోజుల తర్వాత కొత్త కేసులు మళ్లీ దాదాపు 14వేలకు చేరాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 75శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 13,993 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387కి చేరింది.

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర‌దాయినిగా పిలిచే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం 2020 నాటికి పూర్తి అవుతుంద‌ని డ్యాం డిజైన్ రివ్యూ క‌మిటీ(డిడిఆర్‌పి) చైర్మ‌న్ ఏబీ పాండ్యా తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టులోని ప‌లు విభాగాల్లో చేప‌ట్టిన ప‌నుల‌ను ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్ర‌శేఖ‌ర్ అయ్య‌ర్ ఇత‌ర స‌భ్యుల‌తో క‌లిసి పాండ్యా శుక్ర‌వారం ప‌రిశీలించారు.పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

* 2023లో తెలంగాణలో హిందూ రాజ్య స్థాపనే.. గోల్కొండ కోటపై ఎగిరేది కాషాయ జెండానే-బండి సంజయ్

* తెలంగాణలో పార్టీని స్థాపించేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. అందులోభాగంలో రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్‌ అభిమానులతో షర్మిల శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. లోటస్‌పాండ్‌లో జరిగిన ఈ సమావేశానికి దాదాపు 500 మంది దాకా కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. షర్మిల నోటి నుంచి ‘జై తెలంగాణ’ అనే మాట వినిపించినట్లు సమాచారం. షర్మిల ఒక్కసారి ఈ నినాదం ఇవ్వడంతో అభిమానులు ఉబ్బితబ్బిబయ్యారు. తెలంగాణలో బలమైన ముద్ర వేయాలనే షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఇటీవల షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్,‌ ఉమ్మడి ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

* గుంటూరు మేయర్ అభ్యర్థులు…టీడీపీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర ( నాని).వైసీపీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు.డిక్లేర్ చేసిన పార్టీలు.వీళ్ళు ఇరువురి మధ్య మేయర్ గా నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు.

* నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు. ఓట్ల లెక్కింపు వేళ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. జనరేటర్లు, ఇన్వెర్టర్లు వంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇతరులను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. పది లోపు ఓట్ల తేడా ఉన్న చోటే రీ కౌంటింగ్‌కు ఆదేశించాలన్న ఎస్‌ఈసీ.. ఓట్ల లెక్కింపు వేళ సమాచారం లీక్‌ కాకుండా చూడాలన్నారు. లెక్కింపు కేంద్రాల్లో వీడియో ఫుటేజీ భద్రపరచాలని ఎస్‌ఈసీ ఆదేశాల్లో పేర్కొన్నారు.