DailyDose

ఆర్కే అంత్యక్రియలు పూర్తి-నేరవార్తలు

ఆర్కే అంత్యక్రియలు పూర్తి-నేరవార్తలు

* ఛత్తీస్గఢ్ రాజధాని రాయిపూర్ నుండి ట్రైన్ లో తరలిస్తున్న డిటోనేటర్లు ప్రమాదవశాత్తు పేలడంతో ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు..

* ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు. నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి. అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు. మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించిన మావోయిస్టులు.

* ప‌ర్వ‌తాపూర్ గ్రామానికి చెందిన శంక‌ర్ నాయ‌క్(40) కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది తెలిసిన వారి దగ్గర వెతికినా ఫలితం లేకపోయింది దీంతో నిన్న కరణ్ కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో. శ‌నివారం అదే మండంలోని చింతామ‌ణిప‌ట్నం గ్రామ ప‌రిధిలో ని వాగులో శంకర్ శవం మై కనిపించాడు . ఇదిలా ఉండ‌గా చింతామ‌ణిప‌ట్నంలో శంక‌ర్ నాయ‌క్ కొందరితో క‌లిసి పేకాట ఆడార‌ని, వాళ్లే శంక‌ర్ నాయ‌క్‌ను హ‌త్య చేసి ఉంటార‌ని కుటుంభీకులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న సిఐ జలంధర్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యులు శంకర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నా మని సిఐ తెలిపారు.

* సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న చింతలబస్తీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌ దంపతులే ఈ దోపిడీకి పాల్పడ్డారు. యజమాని ఇంట్లో లేని సమయంలో రూ.30 లక్షల విలువైన బంగారం కాజేశారు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేపాల్‌ దంపతులు.. వయసులో పెద్దవాళ్లైన ఇంటి యజమాని తల్లిదండ్రులను తాళ్లతో కట్టేసి ఇంట్లోని బంగారం ఎత్తుకెళ్లారు. యజ్ఞ అగర్వాల్‌ టెక్స్‌టైల్స్‌ యజమాని అగర్వాల్‌ ఇంట్లో ఈ దొంగతనం జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

* హైదరాబాద్‌లో తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నిధుల దుర్వినియోగం, మళ్లింపు కేసు దర్యాప్తు మరిన్ని కుంభకోణాల డొంకను కదిలిస్తోంది. విజయవాడలోని రెండు కార్పొరేషన్ల పరిధిలో సుమారు రూ.14.60 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మాయమైనట్టు ఆయా సంస్థల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సంస్థ పరిధిలో మాయమైన మొత్తాన్ని నిధులు డిపాజిట్‌ చేసిన బ్యాంకు తిరిగి వెంటనే చెల్లించడం చర్చనీయాంశమైంది. నిధులు మాయం కావడం? మళ్లీ డిపాజిట్‌ చేయడం వెనుక సూత్రధారులు, పాత్రదారులు ఎవరనేది త్వరలోనే నిగ్గు తేలుస్తామని పోలీసు ఉన్నాతాధికారులు చెబుతున్నారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన రెండు కేసుల్లో ఒకే తరహా మోసాలు జరగడంతో సమగ్ర దర్యాప్తు కోసం తూర్పు మండల డీసీపీ హర్షవర్దన్‌రాజు పర్యవేక్షణలో సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌కు దర్యాప్తు బాధ్యతను అప్పగించినట్టు విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.