DailyDose

ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటనున్న ‘అసాని’ తుఫాను – TNI తాజా వార్తలు

ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటనున్న ‘అసాని’ తుఫాను – TNI తాజా వార్తలు

* బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అసాని’ మచిలీపట్నంపైపు దూసుకొస్తోంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ తుఫాను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వైపు దూసుకువస్తుందని తెలిపింది. బుధవారం సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండి అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.తుపాను ప్రభావం తెలంగాణపైనా పడే అవకాశముంది. రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. గంటకు 30 నుంచి 40కి.మీ.ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

*మంత్రివర్గ సమావేశం తేదీలో మార్పు.. ఎప్పుడంటే..?
మంత్రివర్గ సమావేశం తేదీని మారుస్తూ సీఎస్ కార్యాలయం నోట్ జారీ చేసింది. ఈనెల 13న జరగాల్సిన కేబినెట్ భేటీని 12వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ నెల 13 తేదీన అమరావతి సచివాలయంలో జరగాల్సిన మంత్రివర్గ సమావేశం తేదీని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు బదులుగా… 12 తేదీ మద్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు సీఎస్ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు నోట్ జారీ చేసింది*మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారులకు కడపలో బెదిరింపులు ఆరంభమయ్యాయి. సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించినట్లు పోలీస్ స్టేషన్లో డ్రైవర్ ఫిర్యాదు చేశారు. కడప నుంచి కేంద్ర కారాగారానికి వెళుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారు. కడప నుంచి వెళ్లిపోవాలంటూ వాహనంలో ఉన్న డ్రైవర్, అధికారులను కూడా బెదిరించారు. ఈ మేరకు సీబీఐ అధికారులు చిన్న చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన వెంటనే స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిని ఎవరు బెదిరించారనే విషయంపై సీసీ ఫుటేజ్ పరిశీలన చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

*చంద్రబాబు, నారాయణ సహా పలువురిపై ఏపీ సీఐడీ కేసులుఅమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదుపలువురిపై కేసులు నమోదు చేసిన ఏపీ సీఐడీ. ఇన్నర్‌ రింగ్ రోడ్డులో అవకతవకలు జరిగాయంటూ గత నెల 27న ఆర్కే ఫిర్యాదు. ఈ నెల 6న విచారణ చేపట్టిన పోలీసులు..అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారణ. ఆదివారం కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, LEPL ప్రాజెక్ట్స్‌. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ అంజనీ కుమార్‌పై సీఐడీ కేసు నమోదు. ఐపీసీ సెక్షన్ 120బి, 420,34,35,36,37,166,167, 217 సెక్షన్‌లతోపాటు . అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(2) రెడ్ విత్ 13 (1ఏ) కింద కేసు నమోదు.

*గుంటూరు,కృష్ణా, తూర్పు,పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలెర్ట్. తీర ప్రాంతాలు ఖాళీ చెయ్యాలని హెచ్చరిక.ఈ రాత్రి నుండి రేపు మధ్యాహ్నం వరకూ భారీ నుండి అతి భారీ వర్షాలు. 48 నుండి 63 కి.మీ వేగంతో గాలులు. తీవ్ర సైక్లోన్ గా మారిన అసాని. అనుకున్నదాని కంటే తీరానికి దగ్గరగా వచ్చిన తుఫాన్. తీరం వెంబడే ఉత్తర దిశగా ప్రయాణించి సముద్రంలోనే ఆగిపోనున్న అసాని.విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం.

*గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అసమ్మతి వర్గం ఛలో తాడేపల్లికి పిలుపిచ్చింది. బుధవారం గడపగడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన వంశీ..అనంతరం సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీకి మద్ధతుపలికారు. దీంతో వైసీపీకి దీర్ఘకాలిక సేవలందించిన నేతల్లో అసంతృప్తి మొదలైంది. ఇప్పటికే పలు ప్రభుత్వప్రైవేట్ కార్యక్రమాల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి.

*చంద్రబాబు, నారాయణ సహా పలువురిపై ఏపీ సీఐడీ కేసులు. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదు. పలువురిపై కేసులు నమోదు చేసిన ఏపీ సీఐడీ

ఇన్నర్‌ రింగ్ రోడ్డులో అవకతవకలు జరిగాయంటూ గత నెల 27న ఆర్కే ఫిర్యాదు. ఈ నెల 6న విచారణ చేపట్టిన పోలీసులు..అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారణ. ఆదివారం కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు
చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, LEPL ప్రాజెక్ట్స్‌. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ అంజనీ కుమార్‌పై సీఐడీ కేసు నమోదుఐపీసీ సెక్షన్ 120బి, 420,34,35,36,37,166,167, 217 సెక్షన్‌లతోపాటు ..అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(2) రెడ్ విత్ 13 (1ఏ) కింద కేసు నమోదు.

*అసని తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫానుకు తోడు తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్‌ కర్నాటక వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది.

*ఆశని తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలను రద్దయ్యాయి. రేపు పశ్చిమ గోదావరి జిల్లా, ఎల్లుండి అరకులో సీఎం జగన్ పర్యటించాల్సి ఉండగా.. ఈ పర్యటనలను తుఫాన్ కారణంగా రద్దు చేసుకున్నారు.

*గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతుంది. ప్రస్తుతం కాకినాడకు 330 కి.మీ., విశాఖపట్నంకు 350 కి.మీ., గోపాలపూర్ కు 510 కి.మీ., పూరీకు 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది ఈరోజు రాత్రికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి అనంతరం దిశమార్చుకుని ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు దూరంగా ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్ళే అవకాశం దుపరి 12గంటల్లో క్రమంగా తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం తుపాను ప్రభావంతో ఈరోజు కోస్తాంధ్రలో, రేపు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయిసహాయక చర్యలకు SDRF, NDRF బృందాలు సిద్ధం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.తుపాను నేపధ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాయాత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థసముద్రం అలజడిగా ఉండటంతో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదురైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

*కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అడ్డగోలు మట్టి తవ్వకాలను ఖండిస్తూ పురవీధుల్లో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. నందివాడ మండలం పుట్టగుంటలో ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు అడ్డుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ మట్టి మాఫియాఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులను కార్యాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.

*విజయనగరంపార్వతీపురం మన్యం జిల్లాలపై అసాని తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రాజాంలో భారీ వడగంట్ల వాన హోరెత్తించింది. విజయనగరం జిల్లాలో ఈదురు గాలుల ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడిపోతున్నాయి. విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పూసపాటిరేగడెంకాడ మండలాల్లోని సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎగిసిపడుతున్న కెరటాలతో తీర ప్రాంతంలో అలజడి నెలకొంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

*అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులు మరోసారి తమ గూడును కోల్పోయారు. రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలో గాలి భీభత్సం సృష్టించింది. తాత్కాలిక నివాస టెంట్లు గాలికి కొట్టుకుపోయాయి. కొందరు రేకులు కొట్టాల క్రింద నివాసం ఉండగా…బలమైన గాలులకు రేకులు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన రేకులు, మనుషులపై పడటంతో పలువురికి గాయాలయ్యాయి. నివాస టెంట్లు, రేకులు కొట్టుకుపోవడంతో పులపుత్తూరు గ్రామస్తులు నిరాశ్రయులయ్యారు.

*ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఓడిపోతుందని..అందువల్లే సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లరని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతమాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. తన వల్లే పార్టీ గెలుస్తుందని జగన్‌ చెబుతున్నారు. చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజలల్లో అసంతృప్తి ఉందనిఅందరి చరిత్ర తన వద్ద ఉందనిసర్వేలు చెబుతున్నాయని ఆయన అంటున్నారు. వాస్తవానికి అసంతృప్తి అంతా ఆయనపైనే ఉందిఅని స్పష్టం చేశారు. హర్షకుమార్‌ సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వైసీపీ సింహంలా ఒంటరిగా వస్తామనితాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పడమేటని ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని గుర్తుచేశారు. కొత్త కేబినెట్‌ సమయంలోనే వైసీపీ అయిపోయిందనే విషయం అందరికీ తెలిసిపోయింది.

*మాదక ద్రవ్యాల సరఫరా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్‌ కేంద్రంగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోన్‌ ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్‌సీబీ సబ్‌ జోన్‌ ఉంది. దీనిని జోన్‌ స్థాయికి పెంచాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ మాత్రమే కాక.. దేశవ్యాప్తంగా ఉన్న 12 సబ్‌ జోన్‌లను జోన్‌ స్థాయికి పెంచనున్నట్లు సమాచారం. అందులో భాగంగా 3 వేల పోస్టుల భర్తీకి ఎన్‌సీబీ కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్ర హోం, ఆర్థిక శాఖ చర్చల అనంతరం 1,800 పోస్టుల భర్తీని అనుమతి లభించింది. వీటికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. కాగా, సాంకేతికతను వినియోగించుకొని డ్రగ్స్‌ రవాణా చేస్తున్నారని, ఇది దేశానికి ముప్పుగా మరిందని, డ్రగ్స్‌ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం శాఖ గణాంకాల ప్రకారం పలు ప్రభుత్వ ఏజెన్సీలు 2011-14 మధ్య రూ.604 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేస్తే.. 2018-21 మధ్య ఏకంగా అంతకు మూడు రెట్లు (రూ.1881 కోట్లు) విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నాయి.

*రెవెన్యూశాఖలో కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల(కేఆర్‌ఆర్‌సీ) అమలు కోసం ఏర్పాటు చేసిన పోస్టులను మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వులు(జీవో 95) జారీ చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం గతంలో మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు అనేక సిఫారసులు చేశారు. ఆ సిఫారసుల అమలు కోసం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ల పరిధిలో కేఆర్‌ఆర్‌సీ విభాగాలు ఏర్పాటు చేశారు. ఈ పోస్టుల పదవీకాలం గత ఏడాది ఆగస్టు 21తోనే ముగిసింది. ఈ నేపథ్యంలో తిరిగి వాటిని మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు నిర్ణయం పట్ల రెవెన్యూ సర్వీసెస్‌ సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తి హర్షం వ్యక్తం చేశారు.

*రాష్ట్రంలోని ఆటోనగర్లలో ఏపీఐఐసీ కేటాయించిన భూము ల్లో పరిశ్రమలు నెలకొల్పకుండా ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న యజమానుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్ద ని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. భూ వినియోగ మార్పిడి నిమిత్తం ఇంపాక్ట్‌ ఫీజు కింద సంబంధిత భూమి మార్కెట్‌ విలువలో 50ు చెల్లించాలని ఉత్తర్వులివ్వడంపై ప్రాథమికంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంపాక్ట్‌ ఫీజు వసూలు విషయంలో ఆటోనగర్లలో, ఇతర ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొంది. ఆ విధంగా నిర్ణయించడం రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని అభిప్రాయపడింది. చట్టం ముందు అందరూ సమానులేనని.. ప్రభుత్వ నిర్ణయం అందుకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

*తన మూడెకరాల భూమిని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆక్రమించుకొని ఇంజనీరింగ్‌ కళాశాలలో కలిపేసుకున్నారని మార్కాపురం మండలం దరిమడుగుకి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ అనే వృద్ధురాలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె కలెక్టర్‌ దినే్‌షకుమార్‌కు ఈమేరకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు మంత్రులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, సీఎం వద్దకు వెళ్లేందుకు కూడా ప్రయత్నించామని చెప్పారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె బోరున విలపించారు. ఇంతలో పోలీసులు హుటాహుటిన వచ్చి ఆమెను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీనిపై రంగలక్ష్మమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న జనానికి తన గోడు చెప్పుకుని విలపించారు.

*మండుటెండల నుంచి పంటను రక్షించుకునేందుకు ఆ రైతు చేసిన ప్రయోగం అందరినీ ఆకర్షిస్తోంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన సిద్దారెడ్డి అర ఎకరం పొలంలో మల్చింగ్‌ పద్ధతిలో టమోటా మొక్కలు నాటాడు. వేసవిలో మల్చింగ్‌ పేపరు వేడికి టమాటా మొక్కలు చాలా వరకూ చనిపోయేవి. ఆ వేడి నుంచి మొక్కలను రక్షించుకునేందుకు అడుగు భాగం పూర్తిగా కత్తిరించిన పేపరు గ్లాసులను మల్చింగ్‌ పేపరు రంధ్రాలలో ప్రతి మొక్కకు పెట్టాడు. దీనివల్ల మొక్కకు వేడి తగలడం లేదని, ఒక్క మొక్క కూడా చనిపోలేదని రైతు చెప్పాడు.

*రేకుల షెడ్డులో.. ఒక ఫ్యాన్‌, టీవీ మాత్రమే ఉన్న ఓ ఇంటికి రూ.4088 కరెంట్‌ బిల్లు రావడంతో కర్నూలు జిల్లా మద్దికెర మండలం బురుజుల గ్రామానికి చెందిన గోసి శ్రీరాములు షాక్‌తిన్నాడు. గత నెల రూ.376 బిల్లు రాగా ఏప్రిల్‌ నెలకు ఏకంగా రూ.4,088 వచ్చిందని చెప్పాడు. విద్యుత్‌ తక్కువ వాడుతున్నా వేలకు వేలు ఎలా వేస్తారని శ్రీరాములు ప్రశ్నించాడు. దీనిపై విద్యుత్‌ ఏడీ నారాయణస్వామిని వివరణ కోరగా గ్రామానికి వెళ్లి పరిశీలిస్తామని చెప్పారు.

*రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని మల్లాపల్లికి చెందిన బీ-ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు బాబులాల్‌ అలియాస్‌ సాధిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో నమ్మించి, అత్యాచారం చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకునేలా సాధిక్‌ ప్రేరేపించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌, దిశ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మల్లాపల్లికి చెందిన విద్యార్థిని తిరుపతిలో బీ-ఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమెకు అదే గ్రామానికి చెందిన యువకుడు సాధిక్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి మధ్య మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 4న సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి గోరంట్లకు వచ్చిన విద్యార్థిని, సాధిక్‌తో కలిసి మల్లాపల్లిలోని అతడి గదికి వెళ్లింది.

*ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సీపీఐ చేపట్టిన చలో సచివాలయం నేపథ్యంలో సోమవారం పలుచోట్ల గృహనిర్బంధాలుముందస్తు అరెస్టులు చోటుచేసుకున్నాయి. విజయవాడ దాసరిభవన్‌ వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి సీపీఐ నాయకులుకార్యకర్తలు విజయవాడ దాసరి భవన్‌ చేరుకుని వెలగపూడిలోని సచివాలయానికి బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే అనుమతి నిరాకరించిన పోలీసులు ముందస్తుగా పలువురు నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసు ఆంక్షలు చేధించుకుని నాయకులుకార్యకర్తలు విజయవాడ వచ్చారు. దాసరి భవన్‌ నుంచి బయటకు వచ్చిన నాయకులుకార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.ఈ క్రమంలో పోలీసులకుఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. మంది పై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.కొంతమంది నాయకు లుకార్యకర్తలు పోలీసుల నుంచి తప్పించుకుని కృష్ణా నది ఒడ్డుకు వచ్చి నాటుపడవల్లో రాజధాని ప్రాంతాలకు చేరుకున్నారు. ప్రకా శం జిల్లావ్యాప్తంగా సీపీఐ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు నోటీసులు జారీ చేశారు.

*ఆ రైతుల గ్రూపునకు ప్రభుత్వం నుంచి హార్వెస్టర్‌ మంజూరయ్యింది. బ్యాంకు రుణం, ప్రభుత్వ సబ్సిడీ సకాలంలో రాకున్నా.. అప్పులు తెచ్చి మరీ యంత్రం కొనేశాడు. నెలలు గడిచినా అటు రుణం.. ఇటు సబ్సిడీ రాకపోవడం, అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి అధికం కావడంతో ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆవేదనతో అతడి భార్య కూడా ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. ఆ కుటుంబానికి న్యాయం కోసం గ్రామస్థులు రోడ్డెక్కిన ఘటన గుంటూ రు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురులో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుక్కా కోటేశ్వరరావు అనే రైతు తన భార్య వరలక్ష్మి మరికొందరి సభ్యులతో కస్టమ్‌ హైరింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూపునకు కంబైన్డ్‌ హార్వెస్టర్‌ మంజూరయింది. హార్వెస్టర్‌ విలువ రూ.24.28 లక్షలు కాగా ఇందులో సగం బ్యాంకు రుణంకాగా, మిగిలిన మొత్తంలో రూ.8.80 లక్షలు గ్రూపునకు సబ్సిడీగా రావాలి. మిగిలిన మొత్తాన్ని గ్రూపు సభ్యులు చెల్లించాలి.

* తెనాలి బార్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గా ప్రసాద్‌ తెలిపారు. సోమవారం తెనాలి వచ్చిన న్యాయమూర్తిని తెనాలి బార్‌ అసోసియేషన్‌ సభ్యులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి సహకరించవలసినదిగా న్యాయమూర్తిని కోరారు. కార్యక్రమంలో బార్‌ అధ్యక్షుడు మందలపు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

*రాష్ట్ర గోల్డ్‌ అప్రైజర్స్‌ నూతన కార్యవర్గం సోమవారం ఎన్నికైంది. సంఘ గౌరవాధ్యక్షుడిగా పడాల రమణ, అధ్యక్షుడిగా వైఎస్‌ ప్రకాశ్‌ ఆచారి ఎన్నికయ్యారు. ప్రధానకార్యదర్శిగా ఈదరాడ శ్రీనివాస్‌, కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా ఐనంపూడి నాగపద్మ, గౌరవ సలహాదారులుగా కె.రంగాచారి, ఎస్‌.కొండలరావు, వి.కోటేశ్వరరావు, కేవీ ప్రహ్లాదాచారి, వైఎస్‌ లోకబాబు, కోశాధికారులుగా కట్టోజు రమేష్‌, పి.బాలగంగాధరరావు, టి.కన్నయ్యచారి, కె.బుచ్చిరాజు, రాష్ట్ర కార్యదర్శులుగా కె.మెహన్‌, కె.నాగరాజు ను ఎన్నుకున్నారు. గోల్డ్‌ అప్రైజర్లకు ఈస్‌ఐ, పీఎ్‌ఫతోపాటు ఉద్యోగభద్రత కల్పించాలని కార్యవర్గం డిమాండ్‌ చేసింది.

*నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో కావ్య అనే యువతిపై యువకుడు సురేష్ రెడ్డి తుపాకితో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో యువతి మృతి చెందింది. తర్వాత తనను కాల్చుకుని సురేష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. సురేష్‌రెడ్డికావ్య మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని ఎస్పీ విజయరావు తెలిపారు. సురేష్‌రెడ్డి తరచూ కావ్యను వేధించేవాడని పేర్కొన్నారు. గతనెలలో పెళ్లి సంబంధం కోసం బంధువులను పంపాడనిసురేష్‌రెడ్డితో పెళ్లికి కావ్య నిరాకరించిందన్నారు. కోపంతో కావ్యపై సురేష్ రెండు రౌండ్ల కాల్పులు జరిపాడని ఎస్పీ వెల్లడించారు. తొలిరౌండ్ కాల్పుల నుంచి కావ్య తప్పించుకుందనిరెండో రౌండ్‌లో కావ్య తలలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని వివరించారు. అడ్డొచ్చిన కావ్య సోదరిని తోసి కాల్పులు జరిపాడని తెలిపారు. తుపాకీపై మేడ్ ఇన్ యూఎస్ఏ అని ఉందని వెల్లడించారు. సురేష్‌కు తుపాకీ ఎలా వచ్చిందని ఆరా తీస్తున్నామని ఎస్పీ విజయరావు తెలిపారు.

*మాదక ద్రవ్యాల సరఫరా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్‌ కేంద్రంగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోన్‌ ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్‌సీబీ సబ్‌ జోన్‌ ఉంది. దీనిని జోన్‌ స్థాయికి పెంచాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ మాత్రమే కాక.. దేశవ్యాప్తంగా ఉన్న 12 సబ్‌ జోన్‌లను జోన్‌ స్థాయికి పెంచనున్నట్లు సమాచారం. అందులో భాగంగా 3 వేల పోస్టుల భర్తీకి ఎన్‌సీబీ కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్ర హోం, ఆర్థిక శాఖ చర్చల అనంతరం 1,800 పోస్టుల భర్తీని అనుమతి లభించింది. వీటికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. కాగా, సాంకేతికతను వినియోగించుకొని డ్రగ్స్‌ రవాణా చేస్తున్నారని, ఇది దేశానికి ముప్పుగా మరిందని, డ్రగ్స్‌ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం శాఖ గణాంకాల ప్రకారం పలు ప్రభుత్వ ఏజెన్సీలు 2011-14 మధ్య రూ.604 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేస్తే.. 2018-21 మధ్య ఏకంగా అంతకు మూడు రెట్లు (రూ.1881 కోట్లు) విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నాయి.

*ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు ఓ చల్లని వార్త. రాగల మూడు రోజుల్లో తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అయితే, కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నదని ఆ శాఖ అధికారులు తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో నిజామాబాద్‌లో అత్యధికంగా 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 40.7 డిగ్రీలు, నల్లగొండలో 40.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

*యాసంగి సీజన్‌(2021- 22)లో ధాన్యం ప్రొక్యూర్మెంట్‌, ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)లో బియ్యం ఔట్‌ టర్న్‌ లెక్కించడానికి, నూకలశాతాన్ని నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ దీనికి చైర్మన్‌గా ఉంటారు. ఆర్థికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సభ్యులుగా వ్యవహరిస్తారు. కాగా.. ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణ నుంచి 40.20 లక్షల మెట్రిక్‌ టన్ను ల బియ్యం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే.. ఇందులో 37.60 లక్షల మెట్రిక్‌ టన్నుల రా రైస్‌, 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐకి రాష్ట్రం నుంచి వెళ్లాల్సి ఉంది.

* మే నెల ప్రారంభమై పది రోజులవుతోంది. కానీ, రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్‌ వేతనాలు ఇంకా అందలేదు. ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగులు ఇలాగే నిరీక్షించాల్సి వస్తోంది. ఏ జిల్లా ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయోనని తాము చర్చించుకునేలా పరిస్థితి తయారైందని ఉద్యోగులే అంటున్నారు. జీతాలు సకాలంలో రాకపోవడంతో బ్యాంకుల నుంచి తాము పొందిన రుణాలకు గడువులోగా ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని అంటున్నారు. ఈ పరిస్థితి ఆసరాగా చేసుకుని బ్యాంకులు పెనాల్టీ రూపంలో సొమ్ము చేసుకుంటున్నాయని వాపోతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 25 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే ఏప్రిల్‌ వేతనాలు చెల్లించారు. ఇంకా ఎనిమిది జిల్లాలవారికి చెలించాల్సి ఉంది. మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, సూర్యాపేట, కరీంనగర్‌, కొత్తగూడెం జిల్లాల ఉద్యోగులకు వేతనాలు, సర్వీసు పెన్షనర్లకు పెన్షన్ల సొమ్ము సోమవారం వరకు కూడా అందలేదు. వరంగల్‌ జిల్లాలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించినా.. పెన్షనర్లకు పెన్షన్‌ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. కాగా, సాగునీటి పారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల(డీఈఈ) నుంచి ఈఎన్‌సీ వరకు కూడా ఇంకా వేతనాలు అందలేదు. కింది స్థాయి ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు మాత్రం చెల్లించారు. మార్చి జీతాల చెల్లింపు విషయంలోనూ ఇలాగే జరిగింది. అన్ని కేటగిరీల వారికీ ఏప్రిల్‌ 16 వరకూ చెల్లిస్తూ పోయారు.

*ప్రభుత్వాస్పత్రుల్లో జరిగే ప్రతి సాధారణ ప్రసవానికి ప్రోత్సాహకంగా రూ.3 వేలు చెల్లించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన హనుమకొండ, వరంగల్‌ జిల్లాల వైద్యాధికారుల సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య 2014లో 30 శాతం ఉంటే, ఇపుడు 56 శాతానికి పెరిగినట్లు తెలిపారు. దీన్ని 70 శాతానికి పెంచేవిధంగా పనిచేయాలని కోరారు. వైద్యఆరోగ్యశాఖలోని 13 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా నియమితులయ్యే డాక్టర్లకు ప్రైవేటు ప్రాక్టీసు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిబంధన కొత్త డాక్టర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య పరికరాలకు ఇక నుంచి 24 గంటల్లో మరమ్మతులు జరుగుతాయని, ఇందుకు రూ.25 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. సంతాన సాఫల్య సేవలను వరంగల్‌కు కూడా విస్తరింప చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండు సుధారాణి, జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

*గ్రూపు-1 పోస్టులకు సోమవారం సాయంత్రానికి.. 8 రోజుల్లో 56,282 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎ్‌సపీఎ్‌ససీ) అధికారులు తెలిపారు. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నెల 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. నెలాఖరు వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు 2,85,741 మంది అభ్యర్థులు ఓటీఆర్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఇందులో 91,366 మంది కొత్తవారున్నారు. కాగా.. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోలీసు కొలువులకు 2.38లక్షల దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. 17,291 పోస్టుల భర్తీకి పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే

*ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జారీ చేసే బీటెక్‌ డిగ్రీలతో పాటు డిప్లొమాలు పొందిన ఉద్యోగులు సర్వీసు ప్రయోజనాలు (పదోన్నతులు, చిన్న పోస్టులో ఉండి పెద్ద పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత) పొందడానికి అర్హులని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. 2009-10, 2010-11, 2011-12 విద్యాసంవత్సరానికి గాను ఇగ్నో కోర్సులు పూర్తి చేసిన వారు సర్వీసు ప్రయోజనాలు పొందడానికి వీలు కల్పిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. జేఎన్‌టీయూ లేదా స్టేట్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనింగ్‌ (ఎస్‌బీటీఈటీ), ఇగ్నో నుంచి డిగ్రీ లేదా డిప్లొమాల్లో ప్రవేశాలు పొందడానికి ముందే సంస్థ నుంచి కచ్చితంగా నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇప్పటిదాకా 2019 జూలై 5వ తేదీలోపే డిగ్రీలు పొందిన వారు అర్హులు కాగా, తాజాగా దీన్ని పొడిగించారు.

*దక్షిణ డిస్కమ్‌ (హైదరాబాద్‌)లో ఉద్యోగాల భ ర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌), 201 సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌), 1000 జూనియర్‌ లైన్‌మ్యాన్‌ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీ కోసం ఎస్పీడీసీఎల్‌ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ చేసిన వారు ఏఈ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు అర్హులు కాగా… సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్‌ డిప్లొమా చేసిన వారు అర్హులు. ఇక జూనియర్‌ లైన్‌మ్యాన్‌(జేఎల్‌ఎం) ఉద్యోగాలకు ఐటీఐ (ఎలక్ట్రికల్‌) చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. సమగ్ర వివరాల కోసం ఈనెల 11వ తేదీ తర్వాత వెబ్‌సైట్‌లను సంప్రదించవచ్చు.

* అమెరికా కేంద్రంగా ఉన్న ప్రముఖ డిజిటల్‌ కన్సల్టింగ్‌ కంపెనీ గ్రిడ్‌ డైనమిక్స్‌.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా భారత్‌లో తన కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఖరునాటికి ఇక్కడి నుంచి దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు కంపెనీ కోసం పని చేయనున్నట్లు పేర్కొంది. కంపెనీ సీనియర్‌ ప్రతినిధుల బృందం సోమవారం మంత్రి కేటీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశమైంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలతోపాటు అద్భుతమైన ఏ-గ్రేడ్‌ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలు, నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఇక్కడ అందుబాటులో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలకు భారత్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నామని తెలిపారు. కంపెనీ తన కార్యకలాపాలకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సహాయసహకారాలను అందిస్తామని కేటీఆర్‌ వారికి హామీ ఇచ్చారు.

*రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విధంగా రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని రెడ్డి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఈ నెల న సాయంత్రం రెడ్ల మహాసంగ్రామ సభనిర్వహిస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద లక్షలాదిమంది రెడ్డి సామాజిక వర్గాల వారితో ఈ మహాసంగ్రామం నిర్వహస్తున్నట్లు రెడ్డి జేఏసీ జాతీయ వ్యవస్థాపకుడు నవల్గా సత్యనారాయణ రెడ్డిరాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు.రెడ్డి జేఏసీరెడ్డి ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహాసంగ్రామానికి అన్ని పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డివైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిలచవెళ్ల ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాలు అందజేసినట్లు వారు తెలిపారు.

*మాదక ద్రవ్యాల సరఫరా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్‌ కేంద్రంగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోన్‌ ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎన్‌సీబీ సబ్‌ జోన్‌ ఉంది. దీనిని జోన్‌ స్థాయికి పెంచాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ మాత్రమే కాక.. దేశవ్యాప్తంగా ఉన్న 12 సబ్‌ జోన్‌లను జోన్‌ స్థాయికి పెంచనున్నట్లు సమాచారం. అందులో భాగంగా 3 వేల పోస్టుల భర్తీకి ఎన్‌సీబీ కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్ర హోం, ఆర్థిక శాఖ చర్చల అనంతరం 1,800 పోస్టుల భర్తీని అనుమతి లభించింది. వీటికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. కాగా, సాంకేతికతను వినియోగించుకొని డ్రగ్స్‌ రవాణా చేస్తున్నారని, ఇది దేశానికి ముప్పుగా మరిందని, డ్రగ్స్‌ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం శాఖ గణాంకాల ప్రకారం పలు ప్రభుత్వ ఏజెన్సీలు 2011-14 మధ్య రూ.604 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేస్తే.. 2018-21 మధ్య ఏకంగా అంతకు మూడు రెట్లు (రూ.1881 కోట్లు) విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నాయి.

*మహారాష్ట్ర పోలీసులు తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంపీ నవనీత్‌ రాణా (స్వతంత్ర) సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఒక కేసులో తనతో పాటు, ఎమ్మెల్యే అయిన భర్త రవి రాణాను అరెస్టు చేసిన పోలీసులు లాక్‌పలోనూ, జైలులోనూ అమర్యాదకరంగా వ్యవహరించారని తెలిపారు. క్రిమినల్స్‌ కన్నా హీనంగా చూశారని అంతకుముందు ముంబైలో జరిగిన మీడియా సమావేశంలోనూ ఆరోపించారు. నవనీత్‌ రాణా మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా, ఆమె భర్త రవి అమరావతి జిల్లా బడ్నేరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆ దంపతులిద్దరూ స్పీకరుతో 45 నిమిషాలు సమావేశమై జరిగిన సంఘటనలను వివరించారు. ఈ నెల 23న తన ఫిర్యాదును లోక్‌సభ హక్కుల కమిటీ పరిశీలిస్తుందని, తాను లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ సమర్పిస్తానని ఆమె చెప్పారు. ఆమె అరెస్టుపై వాస్తవాలు పంపించాలని ఇప్పటికే లోక్‌సభ కార్యాలయం కేంద్ర హోం శాఖ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.

*పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ దాడిలో భవనం మూడో అంతస్తులో ఉన్న ఓ కిటికీ, గోడలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పేలుడు పదార్థం క్యాడ్రిడ్జ్‌ ఫొటోలను పోలీసులు విడుదల చేశా రు. అది రాకెట్‌-ప్రొపెల్డ్‌ గ్రనేడ్‌(ఆర్పీజీ)గా స్పష్టమవుతోంది. ఆర్పీజీలను గ్రనేడ్‌ లాంచర్ల ద్వారా ప్రయోగిస్తారు. ఇటీవల పంజాబ్‌లోని కర్నాల్‌, తరణ్‌తరణ్‌ ప్రాంతాల్లో ఖలిస్థానీ ఉగ్రవాదులను అరెస్టు చేసి, పేలుడు పదార్థాల స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్‌ భవనంపై దాడి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. పోలీసులు మాత్రం ఉగ్రవాదుల నుంచి సీజ్‌ చేసిన పేలుడు పదార్థాలను ఇంటెలిజెన్స్‌ కార్యాలయ భవనంలోని మూడో అంతస్తులో భద్రపరుస్తామని, వాటిల్లో ఒకటి పేలి ఉంటుందని చెబుతున్నారు.

* అమెరికా, చైనాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మరోస్థాయికి చేరింది. దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ రెండేళ్లలో విదేశీ కంప్యూటర్లను తొలగించి, దేశీయంగా తయారు చేసిన కంప్యూటర్లను అమర్చాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. కంప్యూటర్లలోని భాగాలతో పాటు సాఫ్ట్‌వేర్‌ కూడా చైనాకు చెందినదే అయి ఉండాలని జిన్‌పింగ్‌ సర్కారు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. తొలుత కనీసం 5 కోట్ల విదేశీ తయారీ కంప్యూటర్లను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో చైనా తయారీదారులైన లెనొవో, హువాయీ, ఇన్‌స్పర్‌ సంస్థలు లాభపడనున్నాయి.

*బీర్‌పూర్ మండలం తుంగర్‌లో అధికారులపై ఓ వ్యక్తి పెట్రోల్‌తో దాడి చేశాడు. పంటకు స్ప్రే చేసే డబ్బాతో అధికారులపై పెట్రోల్ చల్లాడు. అధికారులపై గంగాధర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ తృటిలో తప్పించుకున్నారు.