DailyDose

కెనడాలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు – TNI నేటి తాజా వార్తలు

కెనడాలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు – TNI  నేటి  తాజా వార్తలు

* కెనడాలో ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతున్నాయని ఆ దేశ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. 2022 మేతో పోలిస్తే మరో 3 లక్షల ఖాళీలు పెరిగి మొత్తం 10 లక్షలను దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. కెనడాలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది రిటైర్మెంట్ వయస్సుకు దగ్గర పడటంతో విదేశీ కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది కెనడాలో అత్యధికంగా 4.3 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ లక్ష్యం 2024 నాటికి 4.5 లక్షలకు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉండటం వలసదారులకు సానుకూలంగా మారింది.వృత్తి నిపుణులు, సైంటిఫిక్– టెక్నికల్ సేవలు అందించేవారు, రవాణా, వేర్ హౌసింగ్, ఫైనాన్స్, బీమా, వినోదం, రియల్ ఎస్టేట్ రంగాల్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు నిర్మాణ రంగంలో సుమారు 90 వేల ఉద్యోగావకాశాలున్నాయి. విద్యారంగంలో 9,700 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆహార సేవల రంగంలో ఖాళీలు ఫిబ్రవరి నుంచి 10% మేర పెరిగాయి. రానున్న పదేళ్లలో సుమారు 90 లక్షల మంది రిటైర్మెంట్కు దగ్గర కానున్నారు.వాస్తవానికి కెనడాలో చాలా చిన్న వయస్సులోనే రిటైర్మెంట్లు తీసుకుంటారు. ప్రతి 10 రిటైర్మెంట్లలో మూడు ముందుగానే తీసుకునేవే ఉంటాయి.

* ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో సీఎల్పీ(CLP) అత్యవసరంగా సమావేశమైంది. ఎమ్మేల్యేలుఅందుబాటులో లేని కారణంగా జూమ్‌లో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి సీఎల్పీకి వచ్చారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

* జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 14, 15 తేదీల్లో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి రానున్నారు. 14వ తేదీ జరిగే ఐటీ విభాగం రాష్ట్ర కమిటీ సభలో ఆయన పాల్గొంటారు. 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేస్తారు.

* మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఏక్‌నాథ్ షిండే మంగళవారం మంత్రివర్గాన్ని విస్తరించునున్నారు. 14 మంది మంత్రులు రేపు (మంగళవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని కేబినెట్‌లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, షిండే వర్గం నుంచి గులాబ్ రఘునాథ్ పాటిల్, సదా సర్వాంకర్, దీపక్ వసంత్ కేశార్కర్‌ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.

* రోజు రోజుకూ వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. భూకబ్జాలకు పాల్పడుతున్న సంఘటనలు అధికమవుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో.. అమ్మిన భూములకు వారసులమంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇరు వర్గాల్లోనూ వైసీపీ నేతలు చేరి వివాదాలకు తెరతీస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మేజర్ పంచాయతీ గ్రామం, కొత్తపల్లి క్రాస్ వద్ద సర్వే నెంబర్ 104, 71లో రెండెకరాల భూమిని 1988లో ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసి.. 40 ప్లాట్లు వేసి విక్రయించారు. ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసినవారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మరి కొన్ని నిర్మాణాలకు పూనుకుంటుండగా.. ఆ భూమిపై తమకు హక్కు ఉందంటూ 2014లో మరో వర్గం కోర్టును ఆశ్రయించడంతో అప్పటి నుంచి ఈ స్థలంలో నిర్మాణాలు నిలిచిపోయాయి.

* ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ఆదివారం నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి జిల్లా విద్యాశాఖ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు.. భరతమాత, జాతీయనాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. చిన్నారుల రింగులవిన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలాజీకాలనీ సర్కిల్‌లోని ఎస్వీయూ క్యాంపస్‌ స్కూల్‌ వద్ద ప్రారంభమైన ఈర్యాలీని డీఈవో శేఖర్‌ ప్రారంభించి, ప్రసంగించారు. విద్యార్థులు చదువుతోపాటు దేశభక్తిని పెంచుకోవాలని సూచించారు. ర్యాలీ టౌన్‌క్లబ్‌ సర్కిల్‌, కృష్ణాపురంఠాణా, గాంధీరోడ్డు మీదుగా నగరపాలకసంస్థ కార్యాలయం వరకు కొనసాగింది. ఎంఈవోలు, హెచ్‌ఎంలు, టీచర్లు, హెచ్‌ఎంల సంఘ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

* పట్రా చావల్ ల్యాండ్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశించింది. ఈడీ కస్టడీ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ఆయనను అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈడీ ఈసారి ఆయన కస్టడీని పొడిగించాలని కోరలేదు.

* విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగుల నిరసనకు దిగారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు సీపీఎం తమ్మినేని వీరభద్రం మద్దుతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రం తెస్తున్న విద్యుత్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ రంగంపై రాష్ట్రాలకు హక్కు లేకుండా చేస్తోందని అన్నారు. కేంద్ర బిల్లుతో దేశ ప్రజలందరికీ నష్టం చేకూరుతుందని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులను చీకట్లు చేసేదే కేంద్ర విద్యుత్ చట్టమన్నారు. కేంద్ర విద్యుత్ చట్ట సవరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

* సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడ పోతున్నారని బీజేపీ నేత మురళీధర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధరల పెరుగుదలపై కేసీఆర్ చేస్తున్న అసత్య ప్రచారాలపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని స్పష్టం చేశారు. పక్క దేశాలతో పోల్చుకుంటే మన దేశం సంక్షోభంలోకి వెళ్లే అవకాశం లేదన్నారు. టీఆర్ఎస్ (TRS) వైఫల్యాలను దాచేందుకే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కేసీఆర్.. ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదని మురళీధర్‌రావు హెచ్చరించారు.

* టమోటాల కు గిట్టుబాటు ధర లేదంటూ జిల్లాలోని టవర్ క్లాక్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రోడ్లపై టమోటాలను పడేసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకు దిగిన రైతులు, రైతు సంఘం నేతల ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. టమోటా కిలో ఒక్క రూపాయి కూడా పోవడం లేదని…దీనిపై జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు స్పందించాలన్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు టమోటాలను పోసి ఆందోళనకు దిగుతామని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

* యూపీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రి రాకేష్ స‌చ‌న్‌కు కాన్పూర్ కోర్టు 1991 ఆర్మ్స్ యాక్ట్ కేసులో ఏడాది జైలు శిక్ష‌, రూ 1500 జ‌రిమానా విధించింది. రాకేష్ స‌చ‌న్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. మంత్రి రాకేష్‌ను అక్ర‌మ ఆయుధాల కేసులో కోర్టు శ‌నివారం దోషిగా నిర్ధారించింది.

* హైద‌రాబాదీ ష‌ట్ల‌ర్ పీవీ సింధు ఖాతాలో గోల్డ్ మెడ‌ల్ ప‌డింది. బ‌ర్మింగ్‌హామ్‌లో జ‌రుగుతున్న కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల బ్యాడ్మింట‌న్ మ‌హిళ‌ల సింగిల్స్‌ ఫైన‌ల్లో సింధు విక్ట‌రీ కొట్టింది. కెన‌డా క్రీడాకారిణి మిచ్చెల్ లీతో జ‌రిగిన మ్యాచ్‌లో 21-15, 21-13 స్కోర్‌తో విజ‌యం సాధించి ప‌సిడి ప‌త‌కాన్ని ప‌ట్టేసుకున్న‌ది. దీంతో ఇండియా ఖాతాలో గోల్డ్ మెడ‌ల్స్ సంఖ్య‌ 19కు చేరుకున్న‌ది. తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. అన్ని ర‌కాల షాట్ల‌ను ఆడింది. ప్ర‌త్య‌ర్థిని ముప్పుతిప్పులు పెట్టింది. మిచ్చెలి లీ ప్ర‌పంచ నెంబ‌ర్ 14వ‌ ర్యాంక్ కాగా, సింధు వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.

* విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగుల నిరసనకు దిగారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు సీపీఎం తమ్మినేని వీరభద్రం మద్దుతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రం తెస్తున్న విద్యుత్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ రంగంపై రాష్ట్రాలకు హక్కు లేకుండా చేస్తోందని అన్నారు. కేంద్ర బిల్లుతో దేశ ప్రజలందరికీ నష్టం చేకూరుతుందని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులను చీకట్లు చేసేదే కేంద్ర విద్యుత్ చట్టమన్నారు. కేంద్ర విద్యుత్ చట్ట సవరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

* భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా దేశ భక్తి ఉట్టిపడేలా, అత్యంత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున‍్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల స్ఫూర్తిని చాటేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవంలో 75 మంది వీణ కళాకారులతో వాయిద్య ప్రదర్శన చేశారు. హైదరాబాద్‌లోని అన్ని జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

*ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. ఎమ్మేల్యేలు అందుబాటులో లేని కారణంగా జూమ్‌లో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క జీవన్ రెడ్డి సీఎల్పీకి వచ్చారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

*బంగాళాఖాతం లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింతగా బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మిగతా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల్లో కూడా చెదురుమొదురు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.

*కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి నుంచి ఆగకుండా వానపడుతున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి చింతలమానేపల్లి మండలంలోని దింద వాగు ఉప్పొంగింది. దీంతో దింద, రన్‌వెల్లి, నాయకపుగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూరు మండలం సలుగుపల్లిలో తీగలఒర్రె వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బెజ్జూరు, పెంచికలపేట మండలాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

*రాజ్య‌స‌భ చైర్మెన్ వెంక‌య్య‌నాయుడు ప‌ద‌వీకాలం ముగిసింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ వీడ్కోల సందేశం వినిపించారు. స‌భ‌లో చాలా భావోద్వేగ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఎన్నో చ‌రిత్రాత్మ‌క సంద‌ర్భాల‌తో వెంక‌య్య‌కు అనుబంధం ఉంద‌ని ప్ర‌ధాని అన్నారు. రాజ‌కీయాల నుంచి రిటైర్ అయ్యాను, కానీ ప్ర‌జాజీవితం నుంచి కాదు అని మీరు ప‌లుమార్లు చెప్పార‌ని, ఈ స‌భ‌లో మీ బాధ్య‌త‌, నాయ‌క‌త్వం ముగిసిపోవ‌చ్చు కానీ, దేశ ప్ర‌జ‌లు మీపై ఆధార‌ప‌డి ఉన్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని, ఎందుకంటే ఈ దేశ రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి, స్పీక‌ర్, ప్ర‌ధాని కూడా స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత పుట్టిన‌వారే అని మోదీ అన్నారు. అంద‌రూ సాధార‌ణ స్థితిగ‌తుల నుంచి వ‌చ్చిన‌వారే అని తెలిపారు.

*మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాజీనామాను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్‌ కార్యాలయం పేర్కొంది. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన రాజగోపాల్‌రెడ్డి.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

*స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెచ్‌ఐసీసీలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి.. జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం 75 మంది వీణ కళాకారులచే వీణా వాయిద్య ప్రదర్శన చేపట్టగా.. సీఎం కేసీఆర్‌ వీక్షించారు.

*పాలకొల్లులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడ్కో ఇళ్లను అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేస్తున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల వద్దకు వెళ్లడం ప్రజా ప్రతినిధిగా తన హక్కని రామానాయుడు వాదించారు. పోలీసులు కావాలనే ఎమ్మెల్యే పాదయాత్రను అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

*శ్రీకాకుళం: జిల్లాలోని మరోసారి ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. పట్టపగలు గ్రామాల్లో సంచరిస్తూ ఎలుగుబంట్లు స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం చినవంకలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి 3 ఎలుగుబంట్లు చొరబడ్డాయి. ఇటీవల వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు దాడిలో ముగ్గురు మృతి చెందారు. మళ్ళీ ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో అక్కడ ప్రజలు హడలిపోతున్నారు. అటవీశాఖ అధికారులు త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని గ్రాస్థులతో పాటు స్థానికులు వాపోతున్నారు.

*రాజకీయాల్లోకి వచ్చే విషయంపై సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా ప్రకటన చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో చెన్నై రాజ్‌భవన్‌లో సమావేశమై బయటకు వచ్చాక ఆయన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. గవర్నర్‌తో జరిగిన చర్చల్లో రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని రజినీ చెప్పారు. అయితే తాను రాజకీయాల్లోకి రాబోనని తేల్చి చెప్పేశారు. తమిళనాడులో కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, అంతకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని బాగా ప్రచారం జరిగింది. నిజానికి కొన్నేళ్లుగా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు కూడా. అయితే తాను రాజకీయాలకు రాబోనని సూపర్ స్టార్ మరోమారు స్పష్టం చేశారు.

*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొగడ్తలతో ముంచెత్తారు. కామన్‌వెల్త్ క్రీడా పోటీల్లో మహిళా కుస్తీ పోటీలో బంగారం చేజారినందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పూజ గెహ్లట్‌‌ ను ప్రధాని ఓదార్చిన తీరు అమోఘమన్నారు. క్రీడాకారుల లో ప్రధాని నింపుతున్న స్ఫూర్తి ప్రతీ ఒక్కరిలో కలగాలని ఆకాంక్షించారు. అలాగే చంద్రయాన్-2 ప్రాజెక్ట్వి ఫలమైన సందర్భాల్లోనూ శాస్త్రవేత్తలకు గుండెధైర్యాన్ని నింపారని తెలిపారు.

*వచ్చే ఎన్నికలు హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈద ఫా ఎన్నికల బరిలో ఎనిమిది మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులు పోటీ చేయనుండడం ఆసక్తిగా మారింది. తమ కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని నిలుపుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. వీరిలో అత్యధికంగా 4 కుటుంబాలకు చెందిన వా రు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఉండటం విశేషం. మూడు కుటుంబాలకు చెందిన వారు అధికార పక్షం వైసీపీలో ఉన్నారు. మరో కుటుంబానికి చెందిన వారు జనసేనలో ఉన్నారు. ఇంకో కుటుంబం బీజేపీలో ఉన్నా ఎన్నికల బరిలోకి వస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి. ఆయన రాజకీయంగా క్రియాశీలంగా ఉండి పార్టీని నడిపిస్తున్నారు. ఆయన కుమారుడు లోకేశ్‌ రాజకీయాల్లోకి చురుగ్గా పనిచేస్తున్నారు.

*ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సమన్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య కాంగ్రెస్‌ను కించపరిచే ప్రయత్నమని విమర్శించారు. రాజ్యసభ స్పీకర్‌, ప్రిసైడింగ్‌ అధికారిని అవమానించడం ఆపాలన్నారు. ఈ కేసులో ఖర్గే నిందితుడు కాదని, అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని ఈడీకి హామీ ఇచ్చారని జైరాం రమేశ్‌ గుర్తు చేశారు.

*ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సమన్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య కాంగ్రెస్‌ను కించపరిచే ప్రయత్నమని విమర్శించారు. రాజ్యసభ స్పీకర్‌, ప్రిసైడింగ్‌ అధికారిని అవమానించడం ఆపాలన్నారు. ఈ కేసులో ఖర్గే నిందితుడు కాదని, అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని ఈడీకి హామీ ఇచ్చారని జైరాం రమేశ్‌ గుర్తు చేశారు.

*కడప: జిల్లాలోని బద్వేల్ మండలం రాజుపాలెంలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. భూవివాదాలతో టీడీపీకి చెందిన చంద్రశేఖర్రెడ్డి కుటుంబసభ్యులపై వైసీపీ నేత నరసింహారెడ్డి, అనుచరులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్రెడ్డి కోర్టు నుంచి స్టే తెచ్చుకుని పొలంలో మొక్కలు నాటుతుండగా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. కొత్తగూడ మండలం, వేలుబెల్లి గ్రామ శివారులోని వరద నీటితో కత్తెర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువనున్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అత్యవసరంగా బయటకు వెళ్లే వారిని గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో సిబ్బంది వాగు దాటిస్తున్నారు.

*మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరమని టీపీసీసీ సామాజిక న్యాయ బృందం (సోషల్ జస్టిస్ టీమ్) పేర్కొంది. ఉప ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశాలపై చర్చించేందుకు ఆదివారం టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి నేతృత్వంలో బృందం సభ్యులు సమావేశమయ్యారు. అద్దంకి దయాకర్, బండి సుధాకర్ గౌడ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. దేశంలో సామాజిక న్యాయాన్ని, లౌకికత్వాన్ని సామ్యవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ మాత్రమే కాపాడిందని బృందం సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని స్వార్థశక్తులు కాంగ్రె్సకు నష్టం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

*భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ1) ప్రయోగం విఫలమయ్యింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ను ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు.మైక్రోశాట్–2ఏ (ఈఓఎస్శాట్)తోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు రూపొందించిన ఆజాదీశాట్ను నిర్దేశిత సమయంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ప్రయోగం సఫలం కాలేదు. మొదటి మూడు దశలు ముందస్తు ప్రణాళిక ప్రకారం సక్రమంగానే పూర్తయ్యాయి. నాలుగో దశ నుంచి మిషన్ కంట్రోల్ సెంటర్కు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. రెండు ఉపగ్రహాల నుంచి కూడా గ్రౌండ్స్టేషన్కు సంకేతాలు అందకపోవడం ఉత్కంఠకు గురిచేసింది.

*దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధనలు చేసే 38 సంస్థలతో కూడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు తొలిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్ అయ్యారు. సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కలైసెల్విను సీఎస్ఐఆర్కు డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు.

*మలయాళీ సీమలో ఆంధ్రా చేనేత వస్త్రాల విక్రయానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆప్కోతో కేరళ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హ్యాండ్ వీవ్) ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ చైర్మన్ గోవిందన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణాచలం సుకుమార్, మార్కెటింగ్ మేనేజర్ సందీప్ రెండు రోజుల క్రితం ఏపీలో పర్యటించి చేనేత వస్త్రాల తయారీ, ఆప్కో ద్వారా విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, వీసీ అండ్ ఎండీ చదలవాడ నాగరాణితో చర్చించారు.

*కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో రవాణా ఆదాయం క్రమంగా పెరుగుతోంది. 2021–22 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో రవాణా ఆదాయంలో 58.70 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్కు ముందు అంటే 2019–20తో పోల్చితే 37.95 శాతం వృద్ధి నమోదైంది. వాహన విక్రయాలు పెరగడంతో జీవిత పన్ను, త్రైమాసిక పన్ను, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత వృద్ధి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో నమోదు కావడం గమనార్హం. ద్విచక్రవాహనాలు మినహా మిగతా అన్ని రకాల వాహనాల విక్రయాల్లో వృద్ధి నమోదైంది.

*ఇటు మెయిన్ తుది ఫలితాలు రాలేదు కానీ.. అటు అడ్వాన్స్డ్ పరీక్షల రిజిస్ట్రేషన్లు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. జేఈఈ మెయిన్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఎన్టీఏ విద్యార్ధులను గందరగోళానికి గురి చేస్తోంది. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్ 2022 తుది ఫలితాల వెల్లడిలో చోటు చేసుకుంటున్న జాప్యంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం నాటికే మెయిన్ రెండో సెషన్ ఫలితాలు వెలువడాల్సినా ఆదివారం రాత్రి వరకు కూడా విడుదల కాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
*చేనేత దినోత్సవం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీ రామా రావు విసిరిన చేనేత చాలెంజ్ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వీకరించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ స్పందిస్తూ ’రామ్ భాయ్ చాలెంజ్ను స్వీకరించా. ఎందుకంటే చేనేత వర్గాలంటే నాకు ప్రేమ, అభిమానం’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు.

*రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ త్వరలో 46 పెట్రోల్ బంకులు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి మూడు ప్రధాన చమురు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో కలిపి ఆరు బంకులు ఏర్పాటు చేయనుండగా ఇతర పట్టణాల్లో మిగతావి ఏర్పాటు చేస్తోంది.నాలుగైదేళ్ల క్రితమే పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఆర్టీసీ… అప్పట్లో 73 ప్రాంతాల్లో బంకుల ఏర్పాటుకు నిర్ణయించింది. అయితే అనువైన ప్రాంతాల్లో లేకపోవడం, కోర్టు కేసులు, నిరభ్యంతర పత్రాలు రాకపోవడంతో కేవలం 23 బంకులే ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాటి సంఖ్య 69కి చేరుకోనుంది. ఈ కొత్త బంకులు 6 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

* టెన్త్ తర్వాత డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పాలిసెట్–2022 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 118 పాలిటెక్నిక్ కాలేజీల్లోని దాదాపు 25 బ్రాంచీల్లో 28,562 సీట్ల భర్తీకి చేపట్టిన కౌన్సెలింగ్లో 20,709 సీట్లు (72.51%) నిండాయని సెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 21 ప్రభుత్వ కాలేజీలు, 3 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు.

*అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, జన గణనలో కుల గణన చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశాకు చెందిన ముఖ్య బీసీ నాయకుల సమావేశం ఆదివారం హైదరాబాద్లోని బీసీ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ కృష్ణ, తెలంగాణ బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు లాల్కృష్ణ అధ్యక్షతన జరిగింది.

*గాంధీ భవన్లో ఆదివారం టీపీసీసీ -చేనేత విభాగం ఆఽధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత సహకార ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కాంగ్రెస్ చేనేత విభాగం వర్కింగ్ ఛైర్మన్ రమేశ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యోద్యమంలో చేనేత ప్రధాన భూమిక పోషించిందని, కాంగ్రెస్ పార్టీలో నేత కార్మికులకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం చేనేత వస్త్రాల మీద 12 శాతం జీఎస్టీ వేసిందని విమర్శించారు.

*నేతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేశామని, ఇప్పుడు తాజాగా ‘నేతన్న బీమా’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. నేతన్నల కోసం దేశంలోనే ఇలాంటి పథకం లేదన్నారు. దాదాపు 80 వేల మంది నేత కార్మికుల కుటుంబాలకు ఈ బీమా పథకం ద్వారా లబ్ది కలగనుందని తెలిపారు. దురదృష్టవశాత్తు ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే.. ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందుతుందని, ఇది చేనేత, మరమగ్గాల కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని సీఎం పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్థిని ఈ పథకం మరోసారి నిరూపించిందని కేసీఆర్ తెలిపారు. కానీ, కేంద్రం మాత్రం పన్నుల పెంపుతో చేనేత, పవర్ లూం రంగాన్ని కుదేలు చేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు.

*ఏపీ లాసెట్లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించిన హరితశ్రీ, ఇతర విజేతలను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అభినందించారు. ఈ మేరకు ఎన్టీఆర్ విద్యా సంస్థల డీన్ డాక్టర్ ఎన్టీ రామారావు ఆదివారం ప్రకటన చేశారు. ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్… ఇటీవల జరిగిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్లో జాతీయ స్థాయిలో 20 ర్యాంకులకు పైగా సాధించిందని ఆయన తెలిపారు. అలాగే ఇంటర్ పరీక్షల్లో తెలంగాణాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొదటి పది ర్యాంకులు సాధించిందని పేర్కొన్నారు.

* వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వికృత చేష్టలు, నగ్న వీడియోకాల్స్, రాష్ట్రంలో మహిళలకు కరువవుతున్న రక్షణ, రోజురోజుకూ పెరుగుతున్న పోలీసుల నిర్బంధాలు, అక్రమ కేసులు, రాజకీయ వేధింపులు తదితర అంశాలపై జగన్రెడ్డి నిర్లక్ష్య ధోరణిపై గర్జించేందుకు తెలుగుదేశం పార్టీ ఈనెల 9న రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. విజయవాడలోని స్వర్ణ హోటల్ వేదికగా ఈ సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వ అక్రమాలు, ఎంపీ మాధవ్పై ఇప్పటి వరకు స్పందించని జగన్రెడ్డి వైఖరిపై గళం విప్పడానికి తప్పక హాజరు కావాలని ఆమె పార్టీ శ్రేణులను కోరారు.

*ఏలూరు జిల్లా నూజివీడులోని కోటమహిషాసుర మర్దిని అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఊటుకూరి శ్రీనివాసరావు దంపతులు ఆదివారం దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు ఇటీవల హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి రావడంతో అమ్మవారిని దర్శించుకున్నారు.

*శ్రీశైల జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మూడు గేట్లు పది అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం జూరాల నుంచి 41,389, సుంకేశుల నుంచి 50,904.. మొత్తం 92,293 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి వస్తోంది. శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.60 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా నమోదైంది. విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ విద్యుత్ కేంద్రం నుంచి 31,658 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కులు, డ్యామ్ స్పిల్వే మూడు గేట్ల ద్వారా 83,673 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు.

* నేతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేశామని, ఇప్పుడు తాజాగా ‘నేతన్న బీమా’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. నేతన్నల కోసం దేశంలోనే ఇలాంటి పథకం లేదన్నారు. దాదాపు 80 వేల మంది నేత కార్మికుల కుటుంబాలకు ఈ బీమా పథకం ద్వారా లబ్ది కలగనుందని తెలిపారు. దురదృష్టవశాత్తు ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే.. ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందుతుందని, ఇది చేనేత, మరమగ్గాల కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని సీఎం పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్థిని ఈ పథకం మరోసారి నిరూపించిందని కేసీఆర్ తెలిపారు. కానీ, కేంద్రం మాత్రం పన్నుల పెంపుతో చేనేత, పవర్ లూం రంగాన్ని కుదేలు చేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు.

*ఈ ఏడాది బీటెక్ ఫస్టియర్ క్లాసులు నవంబరు 1 నుంచి ప్రారంభించాలని సాంకేతిక విద్యా అధికారులు భావిస్తున్నారు. తరగతులను అక్టోబరు 10 నుంచి ప్రారంభించాల్సి ఉన్నా… ఐఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్ ఆలస్యంగా జరిగే అవకాశం ఉండటంతో ఎంసెట్ కౌన్సెలింగ్తో సీట్ల భర్తీ సైతం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే నవంబరు 1 నుంచి ఫస్టియర్ క్లాసులను ప్రారంభించే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.

*తెలంగాణలో జాతీయ యూత్‌ గేమ్స్‌ నిర్వహించాలంటూ భారత ఒలింపిక్‌ సమాఖ్య(ఐవోఏ) అధ్యక్షుడు అనిల్‌ ఖన్నాను రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. వచ్చే నెలలో ఐవోఏ ప్రతినిధుల బృందం తెలంగాణలో పర్యటిస్తుందని మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం. క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మిస్తున్నాం. రాష్ర్టాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు అత్యుత్తమ పాలసీని తీసుకురాబోతున్నాం’ అని అన్నారు. వివిధ జాతీయ క్రీడా అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటులో కీలక భూమిక పోషించిన హెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావును మంత్రి అభినందించారు. జాతీయ క్రీడలు జరిపితే జాతీయ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ తరఫున పూర్తి సహకారం అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

*ఉస్మానియా యూనివర్సిటీ‌ 82వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గవర్నర్ తమిళి సై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గవర్నర్, ఓయూ వైస్ చాన్స్‌లర్ రవీందర్ ఎన్వీ రమణకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీజేఐ ప్రసంగిస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది మేథావులు విద్యనభ్యసించారని, మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు, సీఎం కేసీఆర్ ఈ యూనివర్సిటీలో చదువుకున్నవారేనని గుర్తుచేశారు. తాను కూడా ఇదే యూనివర్సిటీలో లా చేయాలనుకున్నా.. తనకు అవకాశం దక్కలేదని చెప్పారు. మీ తల్లిని, మాతృభాషని, మీ ప్రాంతాన్ని ఎక్కడున్నా మరువకూడదని సూచించారు. తెలంగాణ‌పై దాశరథి, కాళోజి రాసిన కవితలను ఎన్వీ రమణ చదివి వినిపించారు.చివరగా తమిళం‌లో గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

*ప్రజాప్రస్థానం పాదయాత్రను 8న వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నుంచి పునఃప్రారంభించేందుకు వైఎస్టార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. కొడంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రను పునఃప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. షర్మిల ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల పాదయాత్ర ముగించారు. ఈసారి ఉమ్మడి పాలమూరు జిలాల్లోని 14 శాసనసభ నియోజవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ కో-ఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్‌ తెలిపారు.

*మిర్చి, మామిడి పంటలను నాశనం చేస్తున్న నల్లపురుగు తెగులుకు పరిష్కారం చూపేందుకు ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థులు రూపొందించిన బయోటెక్నాలజీ ఇన్నోవేషన్‌ ప్రతిష్ఠాత్మక గ్రాంట్‌ స్కీమ్‌కు ఎంపికైంది. ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థులు డాక్టర్‌ పాపతోటి నరేంద్ర కుమార్‌, డాక్టర్‌ గాజుల ప్రభాకర్‌ నల్లపురుగు తెగులుపై సంయుక్తంగా పరిశోధనలు చేశారు. ప్రాథమికంగా చేసిన పరీక్షల్లో తెగులుకు కారణమైన నల్లపురుగును సమర్థంగా నిరోధించగలిగారు. ఈ ప్రాజెక్ట్‌ వివరాలను న్యూఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ)కి సమర్పించారు. మరిన్ని పరిశోధనలు చేసేందుకు కౌన్సిల్‌ వారికి రూ.50 లక్షల గ్రాంట్‌ను మంజూరుచేసింది.

*భారత్‌కు చెందిన అథ్లెట్‌ రూపాలి చౌధరి వరల్డ్‌ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యం సాధించింది. గురువారం జరిగిన మహిళల 400మీ. పరుగులో తను 51.85సె. టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుత టోర్నీలో రూపాల్‌ ఇదివరకే 4్ఠ400 మిక్స్‌డ్‌ రిలే టీమ్‌ ఈవెంట్‌లో రజతం అందుకోవడం విశేషం. పట్టికలో భారత్‌ ఓ రజతం, కాంస్యంతో 17వ స్థానంలో కొనసాగుతోంది. యూపీలోని మీరట్‌ ప్రాంతానికి చెందిన రూపాల్‌ తండ్రి ఓ రైతు. చిన్నప్పుడు తన ఊరి నుంచి మీరట్‌లోని స్టేడియానికి తీసుకెళ్లేందుకు మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేసి తండ్రి దగ్గర పంతం నెగ్గించుకుంది.

* భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అధ్యక్షుడు అర్కడి వొర్కోవిచ్‌ రెండోసారి అధ్యక్షుడయ్యారు. విఖ్యాత చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఆనంద్‌ ‘ఫిడే’ కార్యవర్గంలోకి రావడం పట్ల వొర్కోవిచ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆనంద్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ వుంది. ఇకపై ‘ఫిడే’ భవిష్యత్తుకు అతని సేవలు కీలకమవుతాయి’ అని అన్నారు.

*మిర్చి, మామిడి పంటలను నాశనం చేస్తున్న నల్లపురుగు తెగులుకు పరిష్కారం చూపేందుకు ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థులు రూపొందించిన బయోటెక్నాలజీ ఇన్నోవేషన్‌ ప్రతిష్ఠాత్మక గ్రాంట్‌ స్కీమ్‌కు ఎంపికైంది. ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థులు డాక్టర్‌ పాపతోటి నరేంద్ర కుమార్‌, డాక్టర్‌ గాజుల ప్రభాకర్‌ నల్లపురుగు తెగులుపై సంయుక్తంగా పరిశోధనలు చేశారు. ప్రాథమికంగా చేసిన పరీక్షల్లో తెగులుకు కారణమైన నల్లపురుగును సమర్థంగా నిరోధించగలిగారు. ఈ ప్రాజెక్ట్‌ వివరాలను న్యూఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ)కి సమర్పించారు. మరిన్ని పరిశోధనలు చేసేందుకు కౌన్సిల్‌ వారికి రూ.50 లక్షల గ్రాంట్‌ను మంజూరుచేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తమ పరిశోధనలతో నల్లపురుగు తెగులును సమూలంగా నిర్మూలించి, రైతులకు మంచి రోజులు తీసుకొస్తామన్నారు.

*కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఎ్‌సఆర్‌)-2023 ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా శుక్రవారం ప్రకటించారు. 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్నవారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీరితోపాటు 2023 ఏప్రిల్‌ 1, మే 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపులకు సంబంధించి ఆగస్టు 4 నుంచి అక్టోబరు 24 వరకు అవకాశం ఉందని తెలిపారు. డిసెంబరు 3,4 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరు నమోదు కోసం బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారన్నారు. 2023 జనవరి 5న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

*రాష్ట్రంలో పంటల నమోదు(ఈ-క్రాపింగ్‌) సెప్టెంబరు మొదటి వారంలోగా నూరు శాతం పూర్తి చేయాలని సీఎం జగన్‌ నిర్దేశించారు.
ఆర్బీకేల్లోని వ్యవసాయ, రెవెన్యూ సహాయకులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలో వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష జరిపారు. ఈ క్రాపింగ్‌ తర్వాత భౌతిక రశీదు, డిజిటల్‌ రశీదు కూడా ఇవ్వాలని చెప్పారు. ఈ క్రాపింగ్‌ చేసినప్పుడే జియో ట్యాగింగ్‌, వెబ్‌ల్యాండ్‌తోనూ అనుసంధానం చేస్తున్నామని అధికారులు చెప్పగా, వెబ్‌ల్యాండ్‌లో పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దాలని చెప్పారు.

*అధిక దిగుబడిని ఇస్తూ… మిషన్‌ కోతకు అనుకూలమైన కొత్త రకం శనగ వంగడాన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కొత్త వంగడం ఎన్‌బీఈజీ-776… ఈ వ్యవసాయ సీజన్‌లోనే రైతులకు అందుబాటులోకి రానున్నది. ఆర్‌ఏఆర్‌ఎ్‌సలో శనగ ప్రధాన శాస్త్రవేత్త వి.జయలక్ష్మి నేతృత్వంలో పప్పుధాన్యాల పరిశోధన శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో ఈ దేశవాలీ రకం ఎన్‌బీఈజీ-776కి రూపకల్పన జరిగింది. వర్షాధారంలో ఈ కొత్త వంగడాన్ని సాగు చేస్తే 90-105 రోజుల్లో దిగుబడి వస్తుంది. ఒకటి, రెండు తడులు పెడితే చాలు.. ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. మిషన్‌ కోతకు అనుకూలంగా ఉండటంతోపాటు ఎండు తెగులును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ ఎన్‌బీఈజీ-776 కొత్త వంగడాన్ని ఈ సీజన్‌లోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే రైతులకు విత్తనాన్ని అందిస్తారు.

*మవరంలో 82 ఎకరాల్లో టిడ్కో ఇళ్ళ పంపిణీలో ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది. జ్యోతి ప్రజ్వలన సమయంలో మంత్రులను పిలిచి, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజును విస్మరించారు. దీనిపై ఆయన ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మోషేన్‌రాజు చేతిని పట్టుకుని జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రాంతానికి స్వయంగా తీసుకువెళ్లారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

*లాసెట్‌ పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా చల్లపల్లి విద్యార్థిని కీర్తి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. స్థానిక విజయక్రాంతి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసుకున్న బి.కీర్తి లా సెట్‌ పరీక్షలు రాసింది. ఐదేళ్ల లాసెట్‌ కోర్సుకు ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది.

*ఆదర్శ పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ)లను తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 282 మందిని కాంట్రాక్టుపై తీసుకోనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 211 పీజీటీ, 71 టీజీటీ పోస్టులు ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 17 వరకు దరఖాస్తులకు గడువుందని పేర్కొంది. 18 నుంచి 44ఏళ్ల మధ్య ఉన్నవారు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌.. ఠీఠీఠీ.ఛిట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 49ఏళ్ల వరకు అవకాశం ఉందని తెలిపింది. ఈ భర్తీలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుందని, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మినిమం టైమ్‌ స్కేలు ప్రకారం వీరికి వేతనాలు ఇస్తారని వివరించింది.

*సాధారణ ప్రజా ప్రయోజన ఉపయోగ కేంద్రాలుగా అంగన్‌వాడీలను గుర్తించి బిల్లులు వసూలు చేయాలని విద్యుత్తు పంపిణీ సంస్థలను ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) ఆదేశించింది. ఈ మేరకు మాత్రమే కరెంటు బిల్లులు వసూలు చేయాలని డిస్కంలకు శుక్రవారం సూచించింది.

*అధిక దిగుబడిని ఇస్తూ… మిషన్‌ కోతకు అనుకూలమైన కొత్త రకం శనగ వంగడాన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కొత్త వంగడం ఎన్‌బీఈజీ-776… ఈ వ్యవసాయ సీజన్‌లోనే రైతులకు అందుబాటులోకి రానున్నది. ఆర్‌ఏఆర్‌ఎ్‌సలో శనగ ప్రధాన శాస్త్రవేత్త వి.జయలక్ష్మి నేతృత్వంలో పప్పుధాన్యాల పరిశోధన శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో ఈ దేశవాలీ రకం ఎన్‌బీఈజీ-776కి రూపకల్పన జరిగింది. వర్షాధారంలో ఈ కొత్త వంగడాన్ని సాగు చేస్తే 90-105 రోజుల్లో దిగుబడి వస్తుంది. ఒకటి, రెండు తడులు పెడితే చాలు.. ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. మిషన్‌ కోతకు అనుకూలంగా ఉండటంతోపాటు ఎండు తెగులును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ ఎన్‌బీఈజీ-776 కొత్త వంగడాన్ని ఈ సీజన్‌లోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే రైతులకు విత్తనాన్ని అందిస్తారు.

*లాసెట్‌ పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా చల్లపల్లి విద్యార్థిని కీర్తి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. స్థానిక విజయక్రాంతి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసుకున్న బి.కీర్తి లా సెట్‌ పరీక్షలు రాసింది. ఐదేళ్ల లాసెట్‌ కోర్సుకు ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది.

*నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం-ఊకొండి శివారులో గురువారం రాత్రి కలకలం రేపిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితుడు లింగస్వామికి నార్కట్‌పల్లి కామినేని వైద్యవిద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుడిని, అతడి కుటుంబసభ్యులను నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి శుక్రవారం విచారించారు. కేసులో న లుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధమే కాల్పుల ఘటనకు దారి తీసి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లింగస్వామి కుటుంబ నేపథ్యం, వ్యాపార లా వాదేవీలు, సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లిం గస్వామిని హతమార్చేందుకు పక్కా పథకం ప్రకారమే కా ల్పులు జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడే ఈ ఘటనకు సూత్రధారి అని ప్ర చారం జరుగుతోంది. రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని అధికారులు ధీమాగా ఉన్నారు. బాధితుడి శరీరం నుంచి రెండు తూటాలను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

*పీజీఈ సెట్‌కు 84.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పీజీఈ సెట్‌ను ఈ నెల 2 నుంచి 5 వరకు హైదరాబాద్‌, వరంగల్‌లో మొత్తం 7 కేం ద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 14,921 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 12,592 మంది పరీక్ష రాశారు.

*కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ పార్టీ కుటుంబ సభ్యుడని, రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ ద్రోహి అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఢిల్లీలో మల్లికార్జున్‌ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతోపాటు తన పార్టీని విలీనం చేసిన సందర్భంగా రేవంత్‌ విలేకరులతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావించే కోమటిరెడ్డి బ్రాండ్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందన్నారు. లేదంటే ఆయన బ్రాండీ షాపులో పనిచేయడానికి కూడా పనిరారని అన్నారు. తాను గతంలో చేసిన ఇదే వ్యాఖ్యకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సంబంధంలేదని, ఆయన తన కంటే సీనియర్‌ నాయకుడని చెప్పారు. వెంకట్‌రెడ్డితో తనకు ఎటువంటి మనస్పర్థలు లేవన్నారు. రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌తో పేగు బంధం తెగిపోయిందని, ఆయన టెండర్లు, కాంట్రాక్టులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వచ్చిన కాంట్రాక్టులను కమీషన్లు తీసుకొని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అమ్ముకున్నదానిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.

*సోమవారం(8వ తేదీ) నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ షెడ్యూలును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వి.శేషాద్రి శుక్రవారం షెడ్యూలు జీవోను జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ షెడ్యూలును కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. 22న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవాల ముగింపు సమావేశాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 15 వరకు రాష్ట్రంలోని వివిధ చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించవచ్చని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌సఐ) ప్రకటించింది. హైదరాబాద్‌లోని చార్మినార్‌, గోల్కొండ కోటతో పాటు హన్మకొండలోని వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట, రామప్ప ఆలయం, పిల్లలమర్రి ప్రాంతాలను ఉచితంగా తిలకించవచ్చని, ఎలాంటి టికెట్లు ఉండవని పేర్కొంది

*జాతీయ రహదారులను 2024 నాటికి అమెరికా తరహాలో తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. బస్‌ అండ్‌ కార్‌ ఆపరేటర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీవోసీఐ) ఆధ్వర్యంలో మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రవాస్‌ 3.0 పేరుతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌పోను శుక్రవారం ఆయన ప్రారంభించారు. 2014కు ముందు దేశంలో 90 వేల కిలో మీటర్ల జాతీయ రహదారులుంటే బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలోనే 70 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎనిమిదేళ్ల క్రితం దేశంలో 64 విమానాశ్రయాలుండగా.. మోదీ ప్రభుత్వం మరో 54 విమానాశ్రయాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. 2024 నాటికి మరో 100 ఎయిర్‌పోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

*కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని నేరుగా కలిసి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ పరిణామంతో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక ఎప్పుడు ఉండబోతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే మునుగోడులో నిలబెట్టే అభ్యర్థిపై కసరత్తు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందిన సమాచారం ఏంటంటే.. నవంబర్‌లో హిమాచల్ ప్రదేశ్, డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికలు జరగనుండటంతో మునుగోడు ఉప ఎన్నిక కూడా నవంబర్‌లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు తెలిసింది.

* వీఆర్‌ఓల బదిలీపై హైకోర్టు (High Court) స్టే విధించింది. 56 మంది వీఆర్‌ఓ (VRO)ల బదిలీచేస్తూ జీవో 121 ప్రభుత్వం జారీచేసింది. జీవో 121ను సవాలుచేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణకు స్వీకరించింది. ఇప్పటికి వీఆర్‌ఓలు అందరూ జాయిన్ అయ్యారని పీపీ కోర్టుకు తెలిపారు. 56 మంది మాత్రమే ఇంకా పోస్టింగ్‌లో జాయిన్ కాలేదని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. 56 మందిని రెవిన్యూ శాఖలో కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న వీఆర్‌ఓలను ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5485 మంది వీఆర్‌ఓలు ఉండగా.. అందరినీ ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు గత నెల 23న జీవో-121ను విడుదల చేసినప్పటికీ దాన్ని బహిర్గతపరచలేదు.