DailyDose

TNI – తాజా వార్తలు

TNI – తాజా వార్తలు

*జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద రోడ్డుపై మెట్రో రైల్‌ ఆధ్వర్యంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దాదాపు 300 వందల చదరపు గజాల్లో నిర్మిస్తున్నారని.. దీనివల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ఽధర్మాసనం.. వివరణ ఇవ్వాలని మెట్రో రైల్‌ సహా ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. విచారణ నాలుగువారాలకు వాయిదా పడింది.

*కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మరోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన అధిష్టానం వివరణ ఇవ్వాలని కోరుతూ గతంలో క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 22న నోటీసులు జారీ చేసింది. ఈనెల 1వ తేదీతో పది రోజుల గడువు ముగిసింది.

*మొయినాబాద్ పామ్‌హౌస్ (Moinabad farmhouse case) కేసు విచారణను హైకోర్టు (telangana high court) సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రిప్లై ఇచ్చేందుకు ప్రతివాదులు హైకోర్టును గడువు కోరారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టుకు సమర్పించిన వీడియో క్లిప్పింగ్స్‌ను అనుమతించాలని హైకోర్టు రిజిస్ట్రీకి న్యాయస్థానం ఆదేశించింది.

*అహ్మదాబాద్: మోర్బీ బ్రిడ్జి కూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించి మోర్బీ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలా (Sandipsinh Zala)ను శుక్రవారంనాడు సస్పెండ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ సస్పెండైన సందీప్ సిన్హ్ జలా స్థానంలో అడిషనల్ చీఫ్ ఆఫీసర్‌గా మోర్బీ రెసిడెంట్ అడిషనల్ కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తారని అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నారు

*పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శుక్రవారం పట్టపగలే దారుణం జరిగింది. శివనేత (Shiva sena) నేత సుధీర్ సూరి (Sudhir suri) హత్యకు గురయ్యారు.

*వాన రావడం, ఉద్యోగులకు జీతాలు పడటం అంతా దైవాదీనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షన్లర్ల (Employees and pensioners)కు ఒకటిన జీతాలు, పెన్షన్లు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం (Jagan Govt) చుక్కలు చూపిస్తోంది. 5వ తేదీ దాటినా ఇప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లలో సగం మందికి చెల్లింపులు జరపలేదు. ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు పడలేదు. 60 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్‌లు పడలేదని ఆందోళన చెందుతున్నారు.

*టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అయ్యన్న ఏమైనా టెర్రరిస్టా?.. గోడ దూకి అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించిన అయ్యన్న పాత్రుడు, టీడీపీ నేతలపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని విమర్శించారు. ఏపీ అరాచకాలపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు.

*వై నాట్ 175 స్లోగన్ వెనక ధీమా ఇదేనా ముఖ్యమంత్రి గారు? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) ప్రశ్నించారు. ఓటుకు రూ.5 వేలు సెప”రేటు” పెట్టి కుప్పం మున్సిపాలిటీని గెలిచినట్టే రాష్ట్రం అంతా అక్రమాల రూటు పట్టారని విమర్శించారు. చివరికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దొంగ ఓట్లనే నమ్ముకున్న దొంగ ముఖ్యమంత్రి గుట్టు మరోసారి రట్టు అయ్యిందన్నారు.

* ఉత్తర చెన్నై(Chennai) ప్రాంతంలో పలు చోట్ల వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు రోజులపాటు కురిసిన వర్షం గురువారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాస్త తెరపిచ్చింది. ఆ తర్వాత చల్లగాలులతో మళ్ళీ వర్షం ప్రారంభమైంది. ఇక గత రెండు రోజులుగా ఉత్తర చెన్నైలోని ప్రధాన రహదారుల్లోనూ వర్షపునీరు నిలిచేవుంది. పురుషవాక్కం, చూళై, ఓట్టేరి, పట్టాలం, కన్నదాసన్‌ నగర్‌, పెరంబూరు జమాలియా, తిరువిక నగర్‌, కొళత్తూరు, తిరువొత్తియూరు, మనలి సహా పలుచోట్ల పల్లపు ప్రాంతాలన్నీ వర్షపునీటితో దీవులుగానే వున్నాయి. చూళై తట్టాన్‌కుళం ప్రాంతంలోని మునుసామి నాయుడు వీధి, రుద్రప్ప వీధుల్లో అడుగు మేర నీరు వ్రహిస్తోంది. పులియంతోపు, పట్టాలం గడియార స్తంభం కూడలి ప్రాంతాల్లో క్రమంగా వర్షపునీటి ప్రవాహం తగ్గుతోంది. వ్యాసార్పాడి గణేశపురం సబ్‌వే నీట మునగడంతో రెండు రోజులుగా వాహనాల రాకపోకలు నిలిపివేవారు.

*ఏపీలో అరాచకపాలన సాగుతోందని, దీనికి పరాకాష్ట మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్ట్ అని… టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

*జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ గురువారం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తాను నేరం చేసి ఉంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. అంతేకానీ తనను ప్రశ్నించేలా ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ ను ప్రోత్సహించవద్దని చెప్పారు. చట్టవిరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ ఆయనకు సమన్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం హాజరుకావాలని సమన్లలో ఆదేశించినప్పటికీ ఆయన ఈడీ అధికారుల సమక్షంలో హాజరు కాలేదు.

*టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు రాజేష్‌ను పోలీసులు సింహాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సింహాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 20 నిమిషాల పాటు ఉన్నారు. ఇరువురికి ప్రభుత్వ వైద్య అధికారి భాస్కరరావు వైద్య పరీక్షలు చేశారు. రాత్రి నుంచి తీవ్ర ఒత్తిడికు లోనవుతున్నటువంటి అయ్యన్నపాత్రుడు హైపర్ టెన్షన్‌తో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. అయ్యన్నపాత్రుడికి బిపి లెవెల్స్ 100/70 గా ఉండగా… షుగర్ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

*2000వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఎర్రకోటపై దాడికి పాల్పడినందుకు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌కు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు ) గురువారం ధృవీకరించింది. ఆరిఫ్ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం, దోషి రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది. నేరం రుజువైనందున దోషి పిటిషన్ ను జస్టిస్ బేల ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఎర్రకోట దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా ముగ్గురు మరణించారు. ఎర్రకోట దాడిలో అరెస్టయిన ఎల్‌ఈటి ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్‌కు వేసిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు ధృవీకరించింది. 2011 ఆగస్టులో ఆయన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. అయితే 2016లో ఆయన రివ్యూ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 2005నవంబర్ నెలలో ట్రయల్ కోర్టు ఆరిఫ్‌కు మరణశిక్ష విధించింది. ఇద్దరు రాజ్‌పుతానా రైఫిల్స్ జవాన్లు, ఒక పౌరుడిని చంపినందుకు ట్రయల్ కోర్టు ఆరిఫ్‌కు రూ.4.35 లక్షల జరిమానా విధించింది. 2007లో ఢిల్లీ హైకోర్టు ఆరిఫ్‌కు మరణశిక్షను సమర్థించింది.

* జగన్ అరాచకపాలనకు పరాకాష్ఠ మాజీ మంత్రి అయ్యన్నను అరెస్టు చెయ్యడమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చినప్పుడు తప్పుడు కేసులు పెట్టి జనం దృష్టి మరల్చడం జగన్‌ (YS Jagan)కు పరిపాటిగా మారిందన్నారు. వివేకానంద రెడ్డి ని ఎవరు చంపారో షర్మిల సీబీఐకి స్టేట్మెంట్ ఇవ్వడం, విశాఖలో భూ కబ్జాల వ్యవహరాలపై టీడీపీ పోరాడుతుండడంతో ఈ రెండు అంశాలపై నుంచి జనం దృష్టిని మరల్చేందుకే అయ్యన్నపై తప్పుడు కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారు జామున 3 గంటలకు అయ్యన్న ఇంట్లోకి పోలీసులు దొంగల్లా రావడం ఏమిటని ప్రశ్నించారు.

*గుర్‌గావ్‌లోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ కార్యాలయంలో ఒప్పంద/అడ్‌హక్‌ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ దరఖాస్తులు కోరుతోంది.

*ఈ నెల 20న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లుకానుండ‌డంతోప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవ‌ర్ మొద‌లైంది. కేర‌ళ‌లో కొంద‌రు అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్స్ మీద త‌మ అభిమానాన్నిప్ర‌పంచానికి తెలియ‌జేసేందుకు వెరైటీగా ఆలోచించారు. 30 అడుగుల ఎత్తైన లియొనెల్ మెస్సీ క‌ట‌వుట్ ఏర్పాటు చేశారు. కోజికోడ్ జిల్లాలోని పుల్ల‌వూర్ ఊరికి చెందిన కొంద‌రు యువ‌కులు అర్జెంటీనా ఫ్యాన్స్ అసోసియేష‌న్‌గా ఏర్ప‌డ్డారు.