Uncategorized

TNI నేటి నేర వార్తలు … సబ్ రిజిస్టార్ అరెస్ట్

TNI  నేటి నేర వార్తలు … సబ్ రిజిస్టార్ అరెస్ట్

అమరావతి :

సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్

ఇటీవల సస్పెండైన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ ఎం.జీవన్‌బాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నరసాపురం రూరల్‌ సీఐ ఎం.సురేష్‌బాబు కథనం ప్రకారం.. నిషేధిత ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములను రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయడంపై ఇటీవల నరసాపురం సబ్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజ విచారణ చేపట్టారు.

రికార్డులు పరిశీలించగా మొగల్తూరు, నరసాపురం, భీమవరం మండలాలకు చెందిన 48 భూములు రిజిస్ట్రేషన్‌ చేసినట్టుగా విచారణలో తెలింది.

దీనిపై సబ్‌ కలెక్టర్‌ ఉన్నతాధికారులకు నివేదించారు.

ఈ క్రమంలో ఆయా మండలాల తహసీల్దార్ల ఫిర్యాదుతో సబ్‌ రిజిస్ట్రార్‌ జీవన్‌ బాబును అరెస్ట్‌ చేసినట్టు సీఐ తెలిపారు.

అల్లూరి జిల్లా: ఏజెన్సీలో హై అలర్ట్ ఈ ఈనెల 2 నుంచి 8 వరకు.పి ఎల్ జి ఏ మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో హై అలెర్ట్ విధించారు

అల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏజెన్సీలో తమ తమ పరిధి పోలీస్ స్టేషన్లో అన్ని ప్రాంతాలు సిఆర్పిఎఫ్ బలగాలతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

తనిఖీలో భాగంగా ప్రతి వ్యక్తిని సోదా చేస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన పోలీసు బలగాలతో మారుమూల ప్రాంతాల సైతం తనిఖీలు చేపట్టారు. వాహనాల రికార్డులు తనిఖీ చేస్తున్నారు.

డ్రోన్ కెమెరాలతో డేగ కన్నుతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పరిశీలిస్తున్నారు.

బ్రేకింగ్ న్యూస్…

గజరాజు మృతి

బంగారు పాలెం మండలం మొగలివారిపల్లి వద్ద మగ ఏనుగు మృతి.

కుంటబెల్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద
విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన ఏనుగు.

కానిస్టేబుల్ ఆత్మహత్య పై నంద్యాల డిఎస్పీ మహేశ్వర రెడ్డి గారి వివరణ… క్రమశిక్షణగా విధులు నిర్వహించే కానిస్టేబుల్ రామకృష్ణ ఆత్మహత్య బాధాకరమని, ఆత్మహత్య కు గల కారణాలను విచారిస్తున్నమని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి కారణాలను తెలియపరుస్తామని ప్రస్తుతానికి ఎలాంటి పని ఒత్తిడి గాని ఇబ్బందులకు గురి చేయడం కానీ వంటివి జరగలేదని రాష్ట్ర డిజిపి గారి ఆదేశాల మేరకు సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆత్మహత్యకు గల కారణం ఏమయింటుందని విచారించి అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపిన నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి.

కృష్ణాజిల్లా, మచిలీపట్నం :

ప్రేమ పేరుతో మోసగించిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఓ బాధిత యువతి కృష్ణాజిల్లా ఎస్పీ పి జాషువాని ఆశ్రయించింది.

నిమ్మకూరు గురుకుల పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న యడ్ల దిలీప్ కుమార్, వరుసకు మరదలైన జి కనక దుర్గా భవాని గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

పెళ్లి చేసుకుంటానన్న దిలీప్ ఆ యువతిని శారీరకంగా అనుభవించాడు.

తీరా ఇంట్లో పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా బాధిత యువతి పామర్రు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

పామర్రు పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోకపోవటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మచిలీపట్నంలో జిల్లా ఎస్పీని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది.

On 01.12.2022, the EOW Team, CCS, DD Hyderabad arrested realtor Boodati Laxminarayana Managing Director of Sahiti Infratec Ventures India Pvt., Ltd involved in Cr No. 158/2022 U/s 406,420,120(B) r/w 34 IPC & Sec. 3 & 5 of TSPDFE Act of CCS, DD, Hyderabad
M/s Sahiti Infratec Ventures India Pvt., Ltd., lured the customers with prelaunch offer schemes of double/triple bedrooms varying from 1200 Sft to 1700 Sft of High Rise apartments of 38 Floors in their project Sahiti’s Sarvani Elite at Ameenpur Village in an extent of land admeasuring Ac. 23.00 Gts without any proper permissions from HMDA/GHMC and collected about Rs 539 Crores from over more than 1700 victims/customers.

The project failed to materialize and the victims insisted to return the amounts, he promised to return the amounts collected with interest @ 15% to 18 % per annum and also issued cheques for the said calculated amount and failed to honour their promise.

Apart from this project of Sahiti’s Sarvani Elite, Ms/ Sahiti Infratech Ventures Pvt., Ltd., also started different projects in the vicinity of Hyderabad and so far Sahiti Infratech defrauded over more than 2500 customers to the tune of Rs 900 Crores in various projects put together.

On behalf of Hyderabad City Police, Public are requested not to fall prey for such pre-launch offers offered by Real Estate companies. Public are hereby advised to check for all types of permissions required for construction of High rise buildings before purchasing any Flats/Plots and shall not fall prey to any fraudsters.