Sports

ధోని బర్త్ డే స్పెషల్.. భారీ కటౌట్ ను రెడీ చేసిన ఫ్యాన్స్

ధోని బర్త్ డే స్పెషల్.. భారీ కటౌట్ ను రెడీ చేసిన  ఫ్యాన్స్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ MS ధోనీ 42వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అది కూడా మన తెలంగాణలో హైదరాబాద్ లో కావడం విశేషం. ఈ ఒక్క కటౌట్‌తో హైదరాబాద్‌లో మాజీ కెప్టెన్ ధోనికి ఉన్న క్రేజ్ ఎంటో స్పష్టం అవుతుంది. కాగా ధోని కటౌట్‌కు సంబంధించిన ఫొటోను నిర్వహాకులు ట్విట్టర్ చేర్ చేస్తు.. అతిపెద్ద వేడుక ప్రారంభమవుతుంది అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అలాగే ఈ భారీ కటౌట్ ఏర్పాటు పై స్పందిస్తున్న ధోని అభిమానులు.. భారీ కటౌట్ కచ్చితంగా భారతీయ ప్రజలలో “ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్”ని హైలైట్ చేస్తుందన్నారు. అలాగే మరో అభిమాని.. “తలా – ది డాన్” అని రాసుకొచ్చాడు. MS ధోని జూలై 7 1981 జన్మించారు. రేపు ఆయన పుట్టిన రోజు కావడంతో సెలబ్రేషన్స్ ఇరగదీశేందుకు అభిమానులు సిద్దం అవుతున్నారు.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 52 అడుగుల ధోని భారీ కటౌట్‌ను సిద్ధం చేశారు. ఈ కటౌట్‌ను ధోని పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారంనాడు ఆవిష్కరించనున్నారు. అలాగే భారీ కేక్‌ను కట్ చేయనున్నారు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోని బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వస్తున్న ఫోజ్‌తో కటౌట్‌ను తయారు చేశారు. ఈ కటౌట్‌పై తెలుగు ఎంఎస్ఆడియన్స్ అనే స్టిక్కర్ కూడా వేశారు. సాధారణంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సినిమా హిరోల కటౌట్లను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో క్రికెటర్ల కటౌట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పుట్టిన రోజుల సందర్భంగా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వారి కటౌట్లను ఏర్పాటు చేశారు.ఇక ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామలో కూడా ధోని భారీ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. ఏకంగా 77 అడుగుల భారీ కటౌట్‌ను సిద్ధం చేశారు. ఓ క్రీడాకారుడికి ఏర్పాటు చేసిన అతిపెద్ద కటౌట్‌గా ఇది నిలవనుంది. దీనిని కూడా ధోని పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ధోని భారీ కటౌట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.