Business

విజయవాడ రైల్వే స్టేషన్‌కు ఐజీబీసీ నుంచి ప్లాటినం రేటింగ్

విజయవాడ రైల్వే స్టేషన్‌కు ఐజీబీసీ నుంచి ప్లాటినం రేటింగ్

బెజవాడ ఏ1 స్టేషన్‌ సత్తా చాటి దేశస్థాయిలోనే అత్యుత్తమ ప్లాటినం రేటింగ్‌ సాధించింది. గోల్డ్‌ రేటింగ్‌ నుంచి ప్లాటినంకు ఎగబాకి దేశంలో అగ్రస్టేషన్ల సరసన నిలిచింది. దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిసారి ప్లాటినం రేటింగ్‌ సాధిస్తున్న సికింద్రాబాద్‌తో పోటీపడుతూ ఈసారి ఎనర్జీ ఎఫిషియన్సీ-గ్రీన్‌ ఇనిషేటియేటివ్స్‌లో భాగంగా ప్లాటినం అవార్డును సాధించింది. ప్రతి మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) అవార్డులను 2023లో సెప్టెంబరు 5వ తేదీన ప్రకటించారు. ఉత్తమమైన ప్లాటినంగ్‌ రేటింగ్‌ కోసం కృషి చేస్తున్న విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారుల కల ఎట్టకేలకు ఫలించింది. కేంద్ర పర్యావరణ డైరెక్టరేట్‌ పర్యవేక్షణలో ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ద్వారా దేశ వ్యాప్తంగా గ్రీన్‌ రైల్వేస్టేషన్లను ప్రోత్సహించేందుకు, అలాంటి విధానాలను ఆవలంబించేందుకు ఈ అవార్డులను తీసుకురావటం జరిగింది. మొత్తం ఆరు అంశాలలో ప్రధానంగా ఐజీబీసీ దృష్టి సారిస్తుంది. సమర్థవంతమైనస్టేషన్‌, పరిశుభ్రత, ఆరోగ్యం, ఇంధన సామర్థ్యం, వాటర్‌ ఎఫిషియన్సీ, స్మార్ట్‌ అండ్‌ గ్రీన్‌ ఇనిషియేటివ్స్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అంశాలపై ఐజీబీసీ దృష్టి సారిస్తుంది. ఈ ఆరు ఆంశాల్లోనూ విజయవాడ స్టేషన్‌ నూరుశాతం మెరుగైన ఫలితాలను సాధించి ప్లాటినం అవార్డుకు ఎంపికైంది.

విజయవాడ స్టేషన్‌ 130 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను తొలిసారిగా ఏర్పాటు చేసింది. స్టేషన్‌లో ఇంధన సామర్థ్యం కోసం ఫైవ్‌స్టార్‌ ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించటం జరిగింది. స్టేషన్‌లో వేస్ట్‌ వాటర్‌ను రీ సైక్లింగ్‌ చేసేందుకు 750 కేఎల్‌డీ సామర్థ్యం కలిగిన సీవేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ) ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఎస్‌టీపీ ద్వారా వ్యర్థ జలాల సద్వినియోగం పెద్ద ఎత్తున జరుగుతోంది. స్టేషన్‌లో పొగరహిత విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ధ్వని కాలుష్యం రాకుండా చర్యలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు స్టేషన్‌లో పొగశాతం గురించి తెలుసుకునేందుకు పరిశీలన జరుపుతోంది. స్టేషన్‌ పరిసర ప్రాంతాలలో పచ్చదనం కనిపించేలా చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు సీటింగ్‌ సదుపాయాలు కల్పించటం, బుకింగ్‌ ఆఫీసులు ఏర్పాటు, క్లోక్‌ రూమ్స్‌, లిఫ్ట్‌, ఎస్కలేటర్స్‌, వెయిటింగ్‌ హాల్స్‌, స్నాక్స్‌ కియో్‌స్కలు, డ్రింకింగ్‌ వాటర్‌ పాయింట్స్‌, రిటైరింగ్‌ రూమ్స్‌, లైటింగ్‌ వంటి సదుపాయాల కల్పనలో మెరుగైన ప్రమాణాలను స్టేషన్‌ నెలకొల్పింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో అత్యున్నత ప్రమాణాలతో ఎమర్జన్సీ మెడికల్‌ ఫెసిలిటీ్‌సను కల్పించింది. రైల్వేస్టేషన్‌కు అత్యంత సమీపంలో బస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సదుపాయాలు ఉండటం, మెకనైజ్డ్‌ క్లీనింగ్‌, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవటం, స్మార్ట్‌ అండ్‌ గ్రీన్‌ ఇనిషియేటివ్స్‌లో భాగంగా వైఫై సదుపాయం, స్మార్ట్‌ కార్డ్‌ టికెటింగ్‌, ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెచీన్స్‌ (ఏటీవీఎం), ఫుడ్‌ కోర్డు, ఫార్మసీ, సీసీటీవీలు, టచ్‌ స్ర్కీన్‌ ఇన్ఫర్మేషన్‌ కియో్‌స్కలు వంటివి ఏర్పాటు చేయటం కూడా రేటింగ్‌కు దోహదపడింది. ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించి తీసుకున్న చర్యలు ఈసారి అదనంగా జత కలిశాయి. లిఫ్టులు, ఎస్కలేటర్లు, లగేజి అసిస్టెంట్స్‌, వెహికల్‌ పికప్‌ డ్రాప్‌ పాయింట్స్‌, స్నాక్‌ కియో్‌స్కలు, చైల్డ్‌ హెల్ప్‌డె్‌స్కలు వంటివి ఏర్పాటు చేయటం కూడా కలిసి వచ్చింది