కోలీవుడ్ స్టార్ హీరోలకు తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. ధనుష్, విశాల్, అథర్వ, శింబులకు రెడ్ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం జరిగిన సర్వసభ్య సమావేశంలో తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొడ్యూసర్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో అసోసియేషన్ నిధులను విశాల్ (విషల్) దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనకు రెడ్ కార్డు ఇవ్వనున్నారు. తెనందాల్ నిర్మాణ సంస్థలో ధనుష్ (ఢనుష్) ఓ చిత్రానికి అంగీకరించారని.. 80 శాతం షూట్ పూర్తయ్యాక.. చిత్రీకరణ విషయంలో ఆయన ఆసక్తి కనబరచలేదని.. దాని వల్ల నిర్మాతకు నష్టాలు ఏర్పడినట్లు మండలి తెలిపింది.
నిర్మాతల మండలి నిధుల దుర్వినియోగంలో విశాల్

Related tags :