Movies

భక్త కన్నప్పలో మోహన్‌లాల్

భక్త కన్నప్పలో మోహన్‌లాల్

మలయాళ మెగాస్టార్‌ మోహన్‌లాల్‌ భక్త కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్‌గా మంచు విష్ణు, మోహన్‌లాల్‌ను కలిసాడని.. ఈ మేరకు వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లోకి మోహన్‌లాల్‌ కూడా యాడ్ కావడంతో ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా చర్చలు నడుస్తున్నాయి. మహాభారతం టెలివిజన్‌ షోకు దర్శకత్వం వహించిన ముకేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. పాన్‌ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.