NRI-NRT

సిడ్నీలో బతుకమ్మ సంబరాలు

సిడ్నీలో బతుకమ్మ సంబరాలు

ప్రతి సంవత్సరం జనాదరణ పెరుగుతూ
సందడిగా బతుకమ్మ వేడుకలు.. ఆటపాటలతో ఆకట్టుకున్న సిడ్నీలో బతుకమ్మ సంబరాలు…!!!

సిడ్నీ బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF)మరియు ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయ స్థానిక బౌమాన్ హాల్ బ్లాక్‌టౌన్ సెంటర్‌లో నిర్వయించిన బ‌తుక‌మ్మ 1500 మందికి పైగా తెలంగాణా వాసులు పాల్గొని బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.

మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆటా…పాటతో, సిడ్నీ నగరం పుల‌కించింది..!! ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో మార్మోగాయి. బతుకమ్మ అచ్చతెలుగు మాట, తెలంగాణ ప్రజల సాంప్రదాయం శతాబ్ధాల సంస్క్రుతి తంగేడు పూల సాహిత్యమాల ఆడబడచుల ఆత్మీయ ఆటల కేళి, కొత్త జీవన స్ఫూర్తిని నింపే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు గొప్ప ఊరట. ఇటువంటి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మను సిడ్నీ నగరంలో ప్రవాస తెలంగాణవాసులు కన్నుల పండుగగా జరుపుకున్నారు.

వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులు స‌ప్త‌వ‌ర్ణాల శోభిత‌మైన పూల‌దొంత‌ర‌ల బ‌తుక‌మ్మ‌లు చూడ‌ముచ్చ‌టేశాయి. వాటి త‌యారీకి ఉద‌యం నుంచే క‌ష్ట‌ప‌డ్డారు, రంగు రంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో సందడి చేశారు. తర్వాత బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. ఉత్త‌మ బ‌తుక‌మ్మ‌ల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేశారు. వాటిని త‌యారు చేసిన మ‌హిళ‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ప్రధానం చేశారు.

ఈ వేడుకల్లో కోలాటం, ప్రత్యేక శివ గర్జన డ్రమ్ షో, జమ్మి పూజతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరు..!

ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావటానికి కారణమైన కార్య నిర్వాహక కమిటీ సబ్యులు శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్, డేవిడ్ రాజు, – కవిత తోతుకుర్, లత కడపరతి కావ్య గుమ్మడవల్లి, వాణి ఏలేటి, శ్వేత యమ, శ్వేత తెడ్ల, హారిక మన్నెం, వత్సల ముద్దం, విద్యా సేరి, చేసిన కృషి కారణమన్న (SBDF) బతుకమ్మ చైర్మన్ – అనిల్ మునగాల తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే పలు నృత్య ప్రదర్శనలు కార్యక్రమాలు జరిగాయి. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇటు వంటి కార్యక్రమాలు దానికి ఎంతో సహకరిస్తాయి అని శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్ కొనియాడారు తరువత సిడ్నీ బతుకమ్మ ఇంత విజయవంతం కావటానికి కారణమైన – స్పాన్సర్స్, కమూనిటీ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్, వాలంటీర్స్ కు – — కార్యవర్గ సభ్యులకు శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్ ధన్యవాదాలు తెలియచేసారు.!!

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z