Politics

అడుగడుగునా ‘వైఎస్సార్‌ రోడ్డు’ బోర్డులు

అడుగడుగునా ‘వైఎస్సార్‌ రోడ్డు’ బోర్డులు

పై చిత్రంలో గ్రానైట్‌ రాళ్ల బోర్డులను చూశారా! తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏ పల్లెకు, ఏ మండల కేంద్రానికి వెళ్లినా ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. వీధివీధినా.. అడుగడుగునా ‘వైఎస్సార్‌ రోడ్డు’ పేరిట ఉన్న బోర్డులే కనిపిస్తున్నాయి. అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారటీ(తుడా) నిధులతో వేసిన యాభై, వంద మీటర్లలోపు సీసీ రోడ్లకు కూడా ఈ పేరుతోనే బోర్డులు ఏర్పాటుచేస్తున్నారు. సాధారణంగా ఒక వీధికి పేరు పెట్టాలంటే పంచాయతీ తీర్మానం తప్పనిసరి. ఒకే ఊర్లో పదుల సంఖ్యలో రోడ్లకు వైఎస్సార్‌ రోడ్డు అని పేర్లు పెట్టినా ఈ విషయాన్ని పట్టించుకున్నవారే కరవయ్యారు. ఒకటికి మించి వీధులకు ఒకే పేరు పెట్టడంతో ఎవరికైనా చిరునామా చెప్పాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పాకాలలో 20కిపైగా వీధులకు ఈ బోర్డే కన్పించడం గమనార్హం

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z