Sports

భారత మహిళల హాకీ జట్టుకు షాక్

భారత మహిళల హాకీ జట్టుకు షాక్

ఈ ఏడాది జ‌రిగే ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్తుపై క‌న్నేసిన భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టుకు పెద్ద షాక్ త‌గిలింది. ప్ర‌తిష్ఠాత్మ‌క ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్(Olympics Qualifier) పోటీల‌కు వైస్ కెప్టెన్ వంద‌న కటారియా(Vandana Kataria) దూర‌మైంది. చెంప‌ల భాగంలోని(Cheek Bone) ఎముక విర‌గ‌డంతో వంద‌న టోర్నీ నుంచి త‌ప్పుకుంది. ఆమె చికిత్స తీసుకోనుంది. దాంతో ఆమె స్థానాన్ని యంగ్‌స్ట‌ర్ బ‌ల్జీత్ కౌర్‌(Baljit Kaur) భ‌ర్తీ చేయ‌నుంది.

‘వంద‌న టోర్నీకి దూరం కావ‌డం దుర‌దృష్ట‌క‌రం. ప్రాక్టీస్ సెష‌న్‌లో ఆమె చెంప ఎముక విరిగింది. అందుక‌ని వైద్యులు వంద‌న‌ను విశ్రాంతి తీసుకోవాల‌ని చెప్పారు. ఫార్వ‌ర్డ్ ప్లేయ‌ర్ అయిన ఆమె జ‌ట్టులో లేక‌పోవ‌డం పెద్ద లోటు’ అని చీఫ్ కోచ్ జ‌న్నెకె స్కాప్‌మ‌న్(Janneke Scopman) తెలిపింది.

రాంచీ వేదిక‌గా జ‌న‌వ‌రి 13 న ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ మొద‌ల‌వ్వ‌నుంది. గ్రూప్ బిలో ఉన్న టీమిండియా టోర్నీ ప్రారంభం రోజే అమెరికాతో త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం స‌వితా పూనియా(Savita Punia) బృందం జ‌న‌వ‌రి 14న న్యూజిలాండ్‌తో, 16వ తేదీన ఇట‌లీని ఢీ కొట్ట‌నుంది. ఈ టోర్నీలో ఫైన‌ల్‌కు చేరితే భార‌త్‌కు ఒలింపిక్ పెర్త్ ద‌క్క‌నుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z