DailyDose

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌
రాష్ట్రంలో మరో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. పోలీసుల నియామక బోర్డు చైర్మన్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

కోఆర్డినేషన్‌ డీఐజీగా గజరావు భూపాల్‌, మహిళా భద్రతా విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్రనగర్‌ డీసీపీగా సీహెచ్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-3గా ఆర్‌ వెంకటేశ్వర్లు, రామగుండం పోలీస్‌ కమిషనర్‌గా ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఎల్బీనగర్‌ డీసీపీగా సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌, టీఎస్‌ ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌రెడ్డి, మాదాపూర్‌ డీసీపీగా జీ వినత్‌ను నియమించింది. జోగులాంబ డీఐజీగా జోయల్‌ డేవిస్‌, విష్ణు వారియర్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. పీవీ పద్మజను మల్కాజ్‌గిరి డీసీపీగా, నిర్మల్‌ ఎస్పీగా జీ జానకీ షర్మిల, జానకీ ధరావత్‌ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా, ఖమ్మం సీపీగా సునీల్‌దత్‌, సీఐడీ ఎస్పీగా ఎస్‌ రాజేంద్ర ప్రసాద్‌ బదిలీ అయ్యారు.

ఆదిలాబాద్‌ ఎస్పీగా గౌష్‌ ఆలం, ములుగు ఎస్పీగా శబరీష్‌, మేడ్చల్‌ డీసీపీగా నిఖితా పంత్‌, సిద్దిపేట సీపీగా బీ అనురాధ, ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీగా సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బిరుదురాజు రోహిత్‌ రాజు, మెదక్‌ ఎస్పీగా బీ బాలస్వామి, భయశంకర్‌భూపాలపల్లి ఎస్డీగా అశోక్‌కుమార్‌, రాజేంద్రనగర్‌ జోన్‌ డీసీపీగా ఆర్‌ వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం ఇవాళ 26 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్లతో పాటు పలుశాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z