Devotional

బాలాత్రిపురసుందరిగా కనకదుర్గమ్మ

Vijayawada Kanakadurga Dressed As BalaTripura Sundari-09/30

1. బాలాత్రిపుర సుందరీగా దర్శనమిచ్చిన కనకదుర్గ-ఆద్యాత్మిక వార్తలు – 09/30
బాలా త్రిపుర సుందరి అవతారం లో భక్తులకు శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి అమ్మవారు సోమవారం దర్శనమిచ్చారు.రెండవ రోజు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మ ను అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. మనస్సు , బుద్ధి చిత్తం అమ్మవారి ఆధీనంలో ఉంటాయని భక్తుల విశ్వాసం.ఉదయం నుంచే భక్తులు పిల్లలతో కలసి వొచ్చి దర్శనం చేసుకున్నారు. రెండు నుంచి 10 ఏళ్ళు లోపు బాలికలను అమ్మవారి ప్రతి రూపంగా భావించి పూజలు చెయ్యడం ఈ రోజు ప్రాముఖ్యత. దేవస్థానం ఆధ్వర్యంలో బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి బాలార్చన ను ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బాలికలను అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి అమ్మవారికి పాయసం, గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.

2. వారికి సీఎం హోదాలో తొలిసారి పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవులతో పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవడంతో భక్తులు విపరీతంగా పెరిగారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి పట్టువస్త్రాలు సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహనంపై ఊరేగనున్న మలయప్పస్వామి.. రాత్రికి తిరుమలలోనే జగన్ బస చేయనున్నారు.

3. దుర్గమ్మ సంచులకూ.. రంగు పడింది!
విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ప్రత్యేక పూజ చేయించుకునే భక్తులకు దుర్గమ్మ చిత్రపటం, పసుపు, కుంకుమ, ఉత్తరీయం తదితరాలతో కూడిన ఓ సంచిని అందజేస్తారు. గత ఏడాది భక్తులకు అందజేసిన సంచులకు పసుపు రంగు.. ప్రస్తుతం ఇస్తున్న సంచులకు మూడు రంగులు ఉండటంతో.. రాష్ట్రంలో రాజకీయాలతోపాటే.. సంచుల రంగూ మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

4. శారదా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
చినముషిడివాడలోని శారదాపీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర ఆఽధ్వర్యంలో రాజశ్యామల శరన్నరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, పుణ్యహవచనం, గోపూజ, రక్షాబంధన్లతో వేద పండితులు పీఠం అధిష్ఠాన దేవత రాజశ్యామల శారదామాత అమ్మవారికి నవరాత్రి కలశ స్థాపన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. పీఠం స్వర్ణ మండపంలో రాజశ్యామల శారదామాతకు పీఠాధిపతి పంచామృతాభిషేకాలు నిర్వహించి, ఏకాదశ హారతులు ఇచ్చారు. రాజశ్యామల అమ్మవారు బాలాత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

5. శారదాపీఠంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
చినముసిరివాడ శారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండోరోజూ మహేశ్వరి అలంకరణలో రాజశ్యామల అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించి.. శారదా చంద్రమౌళీవ్వరులకు విశేష పంచామృతాభిషేకాలతోపాటు చక్రనవావరణార్చనను స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్వహించారు.

6. శుభమస్తు
తేది : 30, సెప్టెంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(నిన్న రాత్రి 8 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 54 ని॥ వరకు)
నక్షత్రం : చిత్త
(నిన్న రాత్రి 7 గం॥ 10 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 34 ని॥ వరకు)
యోగము : ఐంద్రము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 43 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 9 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 7 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 16 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 18 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 42 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 6 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 6 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 6 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 6 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 6 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : కన్య

7. చత్రలో ఈ రోజు/సెప్టెంబరు 30*
1207 : పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త మరియు సూఫీ జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి జననం (మ.1273).
1828 : భారత యోగీశ్వరుడు మరియు మహావతార్ బాబాజీ కి శిష్యుడు లాహిరి మహాశయులు జననం (మ.1895).
1955 : అమెరికాకు చెందిన నటుడు జేమ్స్ డీన్ మరణం (జ.1931).
1961 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు చంద్రకాంత్ పండిత్ జననం.
1964 : టలీ నటి మరియు ఫ్యాషన్ మోడల్ మోనికా బెల్లూచి జననం.
1971 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పి.వి.నరసింహారావు పదవీస్వీకారం చేశాడు.
1980 : మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జననం.
1990 : కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు. సుప్రసిద్ధ నవలా రచయిత శంకర్ నాగ్ మరణం (జ.1954).

8. తిరుమల \|/ సమాచారం* *
_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈ రోజు సోమవారం,
*30.09.2019*
ఉదయం 6 గంటల
సమయానికి,
_తిరుమల: *20C°-18℃°*_
• భక్తుల రద్దీ సాదారణం,
• నిన్న *86,477* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని *01*
గదులలో భక్తులు
చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*04* గంటలు పట్టవచ్చును
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
*గమనిక:*
• శ్రీవారి బ్రహ్మోత్సవం
నేపద్యంలో ప్రత్యేక
దర్శనాలు/విఐపి
సిఫార్సు రద్దు,
*_శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వివరాలు:_*
*30/09/19:*
_• మధ్యాహ్నం 3గంటల 5వరకు నుండి బంగారు తిరుచ్చి_
_• సాయంత్రం 5-23 నుండి ధ్వజారోహణం_
_• రాత్రి 7గంటల నుండి ప్రభుత్వం నుండి పట్టు వస్రాలను సమర్పించనున్న ఏపి సిఎం_
_• రాత్రి 8గంటల నుండి పెద్దశేష వాహనము_
*01/10/19:*
_• ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము_
_• రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము_
*02/10/19:*
_• ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము_
_• రాత్రి 8 గంటల నుండి 10 వరకు ముత్యపు పందిరి వాహనము_
*3/10/19:*
_• ఉదయం 9గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము_
_• రాత్రి 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము_
*04/10/19:*
_• ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం_
_• రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము_
*05/10/19:*
_• ఉదయం 9గంటల నుండి 11వరకు హనుమంత వాహనము_
_• రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము_
*06/10/19:*
_• ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనము_
_• రాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము_
*07/10/19:*
_• ఉదయం 7గంటల నుండి రధోత్సవము_
_• రాత్రి 8గంటలనుండి 10వరకు అశ్వవాహనము_
*08/10/19:*
_• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము_
_• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము_

9. జోగులాంబ ఆలయంలో వైభవంగా దసరా వేడుకలు
అలంపూర్‌ జోగులాంబ దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలంకరణతో వెలుగులు విరజిమ్ముతోంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా జోగులాంబ అమ్మవారు మొదటి రోజు శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.

10. దేవాదాయ శాఖ కమిషనర్ ఎమ్. పద్మ సోమవారం దసరా ఉత్సవాల రెండో రోజు వేడుకల ఏర్పాట్లు ను పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారుఈవో సురేష్ బాబు పాయింట్స్ఆదివారం లక్ష 50వేల మంది భక్తులు దర్శించుకున్నారుఆదివారం 36 లక్షల రూపాయలు ఆదాయం లభించిందిగత ఏడాది 26 లక్షలు ఆదాయం వచ్చింది53 వేల రూపాయలు లడ్డు ద్వారా ఆదాయం లభించింది35 వేలు పులిహోర ద్వారా ఆదాయం లభించింది2420 మంది తలనీలాలు సమర్పించారు152 మంది లో పాల్గొన్నారు2లక్షల50వేలు చెల్లించి ఉత్సవ కమిటీ 100 రూపాయల టికెట్స్ కొనుగోలు చేశారు15 వేల మంది భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు.