Politics

కోడి కత్తి కేసులో సీఎం జగన్ కీలక పిటిషన్

కోడి కత్తి కేసులో సీఎం జగన్ కీలక పిటిషన్

2018లో వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ వీఐపీ లాంజ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే.అప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు.ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.దాడి అనంతరం జగన్ హైదరాబాద్ వెళ్లి కొద్దిరోజులు చికిత్స తీసుకున్నారు.
దీనిపై తొలుత ఏపీ పోలీసులు విచారణ చేపట్టారు. విమానాశ్రయం లోపల దాడి జరగడంతోపాటు విమానాశ్రయాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి కాబట్టి కేసు దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి వెళ్లింది.అప్పటి నుంచి ఎన్‌ఐఏ కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది.
ఈ కేసులో బాధితుడు వైఎస్‌ జగన్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు నోటీసులు జారీ చేసింది.గత విచారణలో కోర్టుకు హాజరు కావాలని మేజిస్ట్రేట్ జగన్‌ను కోరారు.ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కోర్టులో సంచలన పిటిషన్ వేశారు.అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యాధారాలను నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ పిటిషన్‌లో కోరారు.
రాష్ట్రానికి సీఎంగా తన సేవలు అందించాలని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.అలాగే పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు.తనకు రక్షణగా వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు వస్తాయని జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.అడ్వకేట్ కమీషనర్‌ను నియమించాలని,అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో తన సాక్షిని నమోదు చేయాలని కోర్టును అభ్యర్థించారు.
సీఎం జగన్ కూడా సమగ్ర దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన పిటిషన్లను ఏప్రిల్ 13న విచారిస్తామని ఎన్‌ఐఏ కోర్టు తెలిపింది.
మరోవైపు జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు ఇంకా జైల్లోనే ఉన్నాడు.బెయిల్‌ కోసం జగన్‌ను కలిసేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.