NRI-NRT

USIDFC డిప్యూటీ సిఇఓగా నిషా దేశాయ్

USIDFC డిప్యూటీ  సిఇఓగా నిషా దేశాయ్

భారతీయ సంతతికి చెందిన నిషా దేశాయ్ బిస్వాల్ యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కి డిప్యూటీ సీఈఓగా పనిచేస్తారని US సెనేట్ వాయిస్ ఓటు ద్వారా ధృవీకరించింది. కాగా ఈ వార్త తెలియగానే తాను చాలా సంతోషించానని వ్యాపారవేత్త అయిన నిషా అన్నారు.అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మార్చిలో ఈ పదవికి తన నామినేషన్‌ను ప్రకటించారు. వైట్ హౌస్ ప్రకారం, నిషాకు US విదేశాంగ విధానంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది.