DailyDose

బ్యూటిషియన్ కు కానిస్టేబుల్ వేధింపులు- నేర వార్తలు

బ్యూటిషియన్ కు కానిస్టేబుల్ వేధింపులు- నేర వార్తలు

బ్యూటిషియన్ కు కానిస్టేబుల్ వేధింపులు

విశాఖలో ఓ క్రైమ్ కానిస్టేబుల్ పై వేటు పడింది. సస్పెన్షన్ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. బ్యూటిషియన్ నడుపుకుంటున్న ఓ యువతిని ట్రాప్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు అన్న అభియోగంపై అంతర్గత విచారణకు ఆదేశించారు సిపి. విచారణలో క్రైమ్ కానిస్టేబుల్ పాత్ర వెలుగులోకి వచ్చింది.  పోలీసు వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం.. వై రాము అనే కానిస్టేబుల్.. న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఫేస్ బుక్ లో ఓ యువతితో పరిచయమైంది. తాను కానిస్టేబుల్ అని, తనకు పెళ్లి కాలేదని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. అది కాస్తా ఇద్దరి సన్నిహితనికి దారి తీసింది. గత ఏడాది ఏప్రిల్ లో ఫేస్ బుక్  ద్వారా పరిచయమైన ఆ యువతి.. కానిస్టేబుల్ మాటలు తన వలలో పడింది. ఫోన్ లో చిట్ చాట్ తో దగ్గర అయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. అప్పటికే క్రైమ్ కానిస్టేబుల్ రాముకు వివాహమైంది. కుటుంబం కూడా ఉంది. ఈ విషయం ఆ యువతకి ఆలస్యంగా తెలిసింది. అవాక్కయిన ఆ యువతి.. తనతో అబద్ధం చెప్పినట్టు తెలుసుకొని కానిస్టేబుల్ ను దూరం పెట్టింది.అప్పటి నుంచి ఆమెకు టార్చర్ మొదలైంది. మానసికంగా శారీరకంగా తీవ్ర వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా.. యువతి పేరెంట్స్ కు కాల్ చేసి హరాస్మెంట్ చేసేవాడు. ఇంటికి వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు కానిస్టేబుల్ రాము. బయటకు చెబితే తన కుటుంబం పరువు బయటపడుతుందని, కానిస్టేబుల్ కావడంతో న్యాయం జరుగుతుందో లేదో అన్న భయం ఆమెను వెంటాడింది. దీంతో కొన్ని రోజులపాటు తీవ్ర మానసిక వేదనకు గురైంది బాధితురాలు. వాడి ప్రవర్తనలో మార్పు రాకపోవడం, వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. ఇక టార్చర్ తట్టుకోలేని ఆ యువతి .. ధైర్యం చేసి పోలీసులకు సమాచారం అందించింది.

* ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహిస్తోన్న కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. మూడు వేర్వేరు విమానాల్లో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ప్రయాణికుల వద్ద రూ.2.90 కోట్లు విలువ చేసే బంగారం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ముగ్గురు ప్రయాణికుల్ని విచారించి.. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

న్యూ ఇయర్ వేళ ఎదురొచ్చిన మృత్యువు

న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి.. చిన్నా, పెద్దా.. అంతా కూడా సందడి చేస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.. అయితే.. కొన్ని చోట్ల విషాదం చోటుచేసుకుని.. పలు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ముగ్గురు యువకులు టీ తాగడానికి వెళుతుండగా.. మృత్యువు కబళించింది.. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ ముగ్గురు యువకులు కూడా టీ తాగేందుకు వెళుతూ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు, స్థానికులు తెలిపారు.ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని బెస్తవారి పేట మండలం, శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిందని పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. పాపాయిపల్లికి చెందిన పవన్ (20), రాహుల్ (21), శ్రీనివాస్ (21) అనే ముగ్గురు స్నేహితులు.. తెల్లవారుజామున టీ తాగేందుకు ద్విచక్రవాహనంపై పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలో గిద్దలూరు నుంచి బెస్తవారి పేట వైపు వస్తున్న బొలెరో వాహనం.. అదుపు తప్పి వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

విశాఖ గ్యాంగ్ రేప్ ఘటన

విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. విశాఖ జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ ఘటన కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. బాధిత బాలిక వివరాల గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలన్నారు.విశాఖలో 17 ఏళ్ల దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక వారి చేతిలో నరకం చూసింది. ఓ బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నగరంలోని పలు లాడ్జిలలో నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఒడిశా నుంచి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను ప్రేమపేరుతో వంచించి ప్రియుడు తొలుత కామవాంఛ తీర్చుకున్నాడు. తర్వాత మరో తొమ్మిది మంది బాలికు రెండు రోజుల పాటు లాడ్జిలో నిర్భంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ సంఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖలోని కంచరపాలెంలో నివసిస్తోంది. రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో ఆ బాలికకు కుక్కలకు ఆహారం పెట్టే పని కుదిరింది. భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 18న ఆమెను ప్రియుడు నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత తన స్నేహితుడిని పురమాయించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకొనేందుకు ఆరే బీచ్ కు వెళ్లింది. అక్కడ పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తి జగదాంబ కూడలి సమీపంలోకి ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ అతడితో సహా ఎనిమిది రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

799 చెల్లించి అమ్మాయికి ప్రెగ్నెంట్ చేయవచ్చు

 ఉద్యోగాల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. చిన్న జాబ్ అయినా.. తక్కువ శాలరీ ఇచ్చినా పర్వలేదు.. జాయిన్ అయిపోతాం అంటూ ఎగబడుతున్నారు. దీనిని క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. పురుష నిరుద్యోగులను ఆకర్షించడానికి ఓ భారీ ఆఫర్‌తో ప్రకటన ఇచ్చారు. అమ్మాయిలతో సెక్స్ చేస్తే సుఖంతోపాటు లక్షల రూపాయలు నజరానా ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు.. అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ చేస్తే రూ.13 లక్షలు ఇస్తామని భారీ ఆఫర్‌తో ఆకట్టుకున్నారు. ఇంకేముంది.. భారీగా క్యూ కట్టిన నిరుద్యోగులు నిలువునా మోసపోయారు. వాళ్లంతా ఎలా ఛీటింగ్‌కు గురయ్యారు.. ఏంటా కథ అనేది తెలుసుకుందాం.బిహార్‌కు చెందిన ఓ గ్యాంగ్ ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’ పేరుతో ఓ ఫేక్ ఉద్యోగ నియామకాల సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రతినిధులు వాట్సప్ గ్రూపుల్లో యువకులను సంప్రదించి అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ చేస్తే రూ.13 లక్షలు, ఒకవేళ చేయకపోతే స్పెషల్ గిఫ్ట్ పేరిట రూ.5 లక్షలు ఇస్తామని నమ్మిస్తారు. దీనికి కేవలం రూ.799 ఎంట్రీ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెబుతారు. అలా వారిని ముగ్గులోకి దింపి.. అందమైన అమ్మాయిలు, యువతుల ఫొటోలు చూపిస్తారు. వారిలో నచ్చిన వారిని ఎంచుకోని, వారితో శృంగారం చేయవచ్చని టెంప్ట్ చేస్తారు. ఇక అమ్మాయిల అందాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు రేటు ఫిక్స్ చేసి, వారితో శృంగారం చేయాలంటే ఆ డబ్బు చెల్లించాలంటారు. అలా వారి నుంచి డబ్బులు వసూలు చేసి.. ఫొటోలో ఉన్న అమ్మాయిల అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్లమంటారు. ఆ తర్వాత ఆ ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసేస్తారు. తీరా అక్కడికి వెళ్తే అక్కడ అమ్మాయి ఉంటదు.. ఇటు డబ్బులు రిటన్ ఉండవు.. ఇలా నిరుద్యోగులను మోసం చేస్తున్న ఈ సైబర్ నేరగాళ్ల గురించి బిహార్ పోలీసులకు ఉప్పందింది.నవాడా పోలీస్ సూపరింటెండెంట్ కళ్యాణ్ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’ నిర్వహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. ఈ ‘ప్రెగ్నెన్సీ’ మాఫియా కేవలం బిహార్ వరకే పరిమితం కాలేదని.. దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ ఉందని తేలింది. సైబర్ సిండికేట్‌గా ఏర్పడి ఈ దందా నడిపిస్తున్నట్లు కళ్యాణ్ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసుపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z