Politics

ఎన్నికల్లో జనసేన తో పొత్తు –  రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడి

ఎన్నికల్లో జనసేన తో పొత్తు –  రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడి

 కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు తో పోటీ చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంచేశారు. బుధవారం బనగానపల్లె పట్టణంలో చక్రవర్తి ఫంక్షన్ హాల్ లో సోము వీర్రాజు పార్టీ నేతల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బనగానపల్లె, డోన్,ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను అడ్డగోలుగా వాడుకుంటోందని,కేంద్ర పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. ఎన్.ఆర్.జి. ఎస్. పథకం, రైతు సంక్షేమ నిధులు, పంచాయతీ నిధులు కేంద్రం నుండి కేటాయింపు జరుగుతుందని గుర్తు చేశారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగపరిచిందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు టిడిపి వైసిపి పాలనకు ప్రజలు విసుగెత్తి పోయారని రానున్న ఎన్నికల్లో బిజెపి కూటమిని ప్రజలు గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో  తమ పార్టీ అధికారంలోకి వస్తే  కేంద్రం సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో రైలు మార్గాల విస్తరణ చర్యలు తీసుకుంటామని, విద్య, అభివృద్ధి, ఇతర సంక్షేమ పథకాల తగినన్ని నిధులు కేటాయిస్తామన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి భవంతి కే పరిమితమయ్యారని విమర్శించారు ప్రభుత్వ డబ్బులతో రాష్ట్రంలో చర్చిలు మసీదుల కు నిధులు కేటాయింపు ఫాస్టర్ లకు వేతనాలు ఇవ్వడం ద్వారా మతతత్వం ప్రోత్సహించినట్లు కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని కేంద్ర నిధుల ఖర్చు చేస్తూ తమవి గా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని వాలెంటరీ లతో ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో అమరావతి పేరుతో ప్రజలను మోసం చేయగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో మూడు సంవత్సరాలు కాలయాపన చేశారని విమర్శించారు. బిజెపి రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే మూడు సంవత్సరాలలో అమరావతి రాజధానిని నిర్మించి తీరుతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

నంద్యాల బి జె పి పార్లమెంటరీ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై జరిగిన దాడి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాము రాష్ట్రం అంతటా పర్యటిస్తానని అన్ని నియోజకవర్గాల్లో బిజెపి పార్టీని బలోపేతం చేసేందుకు పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగానే బనగానపల్లె పర్యటనకు వచ్చినట్లు ఆయన తెలిపారు. పార్టీ ముఖ్య నేత నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో లో బీజేపీని బలోపేతం చేస్తామని తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.టిడిపి,వైసిపి పార్టీలు  ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. తమ ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు  తీసుకెళ్తామని తెలిపారు. దేశంలో పార్టీ నాయకులు జిల్లా నాయకులతోపాటు బనగానపల్లె కు చెందిన ముత్తుకూరు శ్రీనివాసులు, లింగన్న, శివ కృష్ణ యాదవ్, ఆర్మీ రామయ్య కేసి మద్దిలేటి హేమ సుందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రామ మోహన్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, యాదగిరి, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు