Movies

మరోసారి స్పెషల్‌ సాంగ్‌లో అంజలి

మరోసారి స్పెషల్‌ సాంగ్‌లో అంజలి

యంగ్‌ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్‌ థ్రెసా కథానాయికలు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం..టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ కు కూడా ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆగస్ట్‌ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేశారు మేకర్స్‌. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ మూవీలో హీరోయిన్‌ అంజలి స్పెషల్‌ సాంగ్ చేయబోతుందట. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. అందులో అంజలి హాట్‌ ఫోజుతో కుర్రాళ్ల మతి పోగొట్టేలా ఉంది. ఈ స్పెషల్‌ సాంగ్‌కి సంబంధించిన మరో అప్‌డేట్‌ని సోమవారం ప్రకటించనున్నారు. అంజలికి ఇది రెండో స్పెషల్‌ సాంగ్‌. గతంలో స‌రైనోడులో అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసింది.