Health

Superfetation: గర్భవతిగా ఉన్నప్పుడు మరోసారి గర్భం

Superfetation: గర్భవతిగా ఉన్నప్పుడు మరోసారి గర్భం

మహిళ ప్రెగ్నెంట్‌గా ఉండగానే మరోసారి ప్రెగ్నెంట్‌ కాగాలదా? అంటే ఔననే చెబుతోంది సైన్సు. ఇలాంటి అరుదైన కాసులు చాలనే జరిగాయని అంటున్నారు వైద్యులు. ఇలా గర్భవతిగా ఉండగానే మళ్లీ గర్భం దాల్చడాన్ని సూపర్‌ఫెటేషన్‌ అని పిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులో ఆ తల్లికి పుట్టిన పిల్లలు కవలలుగా పరిగణించినప్పటికీ వేర్వురు తేదిల్లో పుడతారట. అరుదైన కేసుల్లో ఒకేసారి పుట్టిన ఆ పిల్లల బరువు, పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయని అంటున్నారు. ఆ పిండాల పీరియాడిక్‌ టైం కూడా వేరుగా ఉంటుంది. ఇది ఒక ఋతుకాలంలోనే విడుదలైన రెండు గుడ్ల ఫలదీకరణాన్ని సూచిస్తుంది. నిజానికి ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడూ ఆమె అండాశయాలు గర్భాశయానికి గుడ్లు విడుదల చేయడం ఆపేస్తాయి. ఎందుకంటే హార్మోన్లు శిశువు పెరగడానికి సిద్ధంగా ఉండేలా శరీరానికి ఒక సంకేతాన్ని పంపుతాయి. అయినప్పటికీ సూపర్‌ఫెటేషన్‌ జరిగితే అండాశయాలు మరొక గుడ్డును విడుదల చేస్తాయి. అది కూడా ఫలదీకరణం చెందుతుంది. గతంలో ఇలాంటి ఘటన జరిగిన పలు కేసులు కూడా ఉన్నాయి.