Devotional

శంబలనగరి చైతన్య క్షేత్రంలో ఆకాశ దీపోత్సవం

శంబలనగరి చైతన్య క్షేత్రంలో ఆకాశ దీపోత్సవం

భారతీయ తపస్విల చైతన్య రూపం గాయత్రి మాత. రుషి తండ్రి ఆరు సంవత్సరాల నుంచి అజ్ఞాతంగా, ఏకాంతంగా మౌన గాయిత్రి తపస్సులో ఉండి శక్తి అనుభవం, చైతన్య అనుభూతి అందిస్తున్న శంబలనగరి లో కార్తీక మహోత్సవం మొదలైంది. ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం జిల్లా ఎస్ కోట లోని రాజీపేటలో ఉన్న శంబలనగరిలో 9 అడుగుల పంచలోహ గాయత్రి మాత సృష్టి ఆధారాల దైవ చైతన్యముల ప్రత్రిరూపం. రుషి తండ్రి, 8 లక్షల 23 వేల 543 గాయత్రి తపస్సుల తప్పశ్శక్తి తో నిండిన గాయత్రి మాతను దర్శించి, తాకి వెళ్ళేందుకు వీలుగా ఆధ్యాత్మిక బిడ్డలు ఏర్పాట్లు చేశారు. ఒట్టి చేతులతో వెళ్ళి తపశ్శక్తి స్వీకరించి వెళ్ళవచ్చు. పైగా 27వ తేదీ…సోమవారం కార్తీక భోజనాలూ ఉన్నాయి. 10 వేల మందికి భోజన, ప్రసాద వితరణ చేయడానికి ఆధ్యాత్మిక బిడ్డలు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం చీకట్లను చీల్చి వెలుగులు అందించే ఆకాశ దీపం.
శంబలనగరిలో 40 అడుగుల ఎత్తులో ఆకాశ దీపం వెలగనుంది. 300 కిలోల ఆవు నెయ్యి, 300 మీటర్ల ఒత్తి. 9 కిలోల కర్పూరం తో ఆకశా దీపం వెలుగులు ప్రసరించనుంది. ఆకాశ దీపం వెలుగు పక్షం రోజుల వరకూ ఉండే అవకాశముంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z