Devotional

అక్టోబరు నెలలో మీ రాశి ఫలితాలు–ఆద్యాత్మిక-10/01

Astrology In Telugu For The Month Of October 2019

1. గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
2. వైభవంగా శ్రీవారికి చిన్న శేషవాహన సేవ
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం ఆ దేవదేవుడు చిన్నశేష వాహనంపై విహరించారు. తిరుమాడ వీధుల్లో ఐదు తలల శేష వాహనంపై మలయప్పస్వామి వైభవాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు. చిన్నచేష వాహనంపై మలయప్పస్వామి వైభవాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి స్వామివారు హంసవాహనం పై విహరించారు.
3. తిరుమలలో కన్నులపండువగా ధ్వజారోహణం..
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అందరూ రారండంటూ సకల సురగణాలకు గరుడుడి ఆహ్వానంతో తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో సోమవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం కన్నులపండువగా నిర్వహించి ఉత్సవాలకు శుభారంభం చేశారు. మధ్యాహ్నం 3-5 గంటల మధ్య మలయప్పస్వామిని బంగారు తిరుచ్చిలో మాడవీధుల్లో ఊరేగించారు. వేర్వేరు పల్లకీల్లో అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి విష్వక్సేనులను, మరో వాహనంపై ధ్వజపటాన్ని ఊరేగించారు. అనంతరం, ధ్వజస్తంభంపై ప్రతిష్టితుడైన గరుడుడికి అభిషేకం, వస్త్ర సమర్పణ, నివేదన శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి పెద్దశేష వాహనంలో చతుర్మాడ వీధుల్లో ఊరేగారు.
4. టీటీడీ బోర్డు సభ్యుడిగా డీపీ అనంత ప్రమాణం
టీటీడీ బోర్డు సభ్యుడిగా డీపీ అనంత సోమవారం ఉదయం ప్రమాణం చేశారు. కుటుంబ సమేతంగా ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న అనంత సోమవారం ఉదయం శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బంగారు వాకిలి వద్ద ఆయనతో అదనపు ఈవో ధర్మారెడ్డి బోర్డు సభ్యుడిగా ప్రమాణం చేయించారు. అనంతరం అనంత.. మూలవర్లను దర్శించుకున్నారు.
5. పెద్ద ఆలయాలకు ట్రస్టు బోర్డులు
రాష్ట్రంలోని అనేక పెద్ద ఆలయాల్లో నూతన ట్రస్టుబోర్డుల నియామకానికి దేవదాయశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ట్రస్టుబోర్డులను ఎప్పుడైనా రద్దు చేసే అధికారం ఇటీవల ప్రభుత్వానికి సంక్రమించిన దరిమిలా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రూ.5కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య, రూ.కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం కలిగిన మొత్తం 25 ఆలయాల బోర్డులకు దరఖాస్తులు ఆహ్వానించారు.
6. అరసవల్లి ఆలయ ‘ట్రస్ట్’ బోర్డుకు గ్రీన్ సిగ్నల్!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి మంచి రోజులు రానున్నాయి. వార్షికాదాయం రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకున్న ఆలయాల ధర్మకర్తల సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2011లో అరసవల్లి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. నాటి రెవెన్యూ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చొరవతో ట్రస్ట్ బోర్డు దిగ్విజయంగా పనిచేసింది. స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హయాంలోనే మళ్లీ ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు వచ్చాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 20 తేదీలోగా ఆసక్తి గల సభ్యులు ధృవీకరణలతో కూడిన ఫారం–2ను నింపి ఆలయ సహాయ కమిషనర్కు అందజేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం మాత్రమే ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించాల్సి ఉంటుంది.
7. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం వైఎస్ జగన్
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు. ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం సా.6.32గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్గుప్త, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఇతర ఉన్నతాధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయస్వామి వారిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ఇక్కడ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి స్వామివారి వస్త్రాన్ని తలపాగా కట్టారు. తన వెంట తీసుకొచ్చిన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని రాత్రి 7.11గంటలకు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు 7.21గంటలకు చేరుకున్నారు.
8. పంచాంగం 01.10.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం: ఆశ్వయుజ
పక్షం: శుక్ల
తిథి: తదియ రా.06:20 వరకు
తదుపరి చవితి
వారం: మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం: స్వాతి రా.07:32 వరకు
తదుపరి విశాఖ
యోగం: వైధృతి, వృషకుంభ
కరణం: గార
వర్జ్యం: రా.12:54 – 02:25
దుర్ముహూర్తం: 08:29 – 09:17
రాహు కాలం: 03:05 – 04:35
గుళిక కాలం: 12:05 – 01:35
యమ గండం: 09:05 – 10:35
అభిజిత్ : 11:42 – 12:28
అమృత కాలం: ఉ.06:19 – 07:27
సూర్యోదయం: 06:06
సూర్యాస్తమయం: 06:05
వైదిక సూర్యోదయం: 06:09
వైదిక సూర్యాస్తమయం: 06:01
చంద్రోదయం: ఉ.08:30
చంద్రాస్తమయం: రా.08:24
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: పశ్చిమం
స్తనవృద్ధి గౌరీ వ్రతం
సప్తరాత్ర్సోవారంభం
9. తిరుమల \|/ సమాచారం* *
_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈ రోజు మంగళవారం,
*01.10.2019*
ఉదయం 5 గంటల
సమయానికి,
_తిరుమల: *19C°-28℃°*_
• నిన్న *65,028* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• నిన్న *30,496* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని *19*
గదులలో భక్తులు
చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*16* గంటలు పట్టవచ్చును
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 2.66* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
*గమనిక:*
• శ్రీవారి బ్రహ్మోత్సవం
నేపద్యంలో ప్రత్యేక
దర్శనాలు/విఐపి
సిఫార్సు రద్దు,
*_శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వివరాలు:_*
*30/09/19:*
_• సాయంత్రం 5-23 నుండి ధ్వజారోహణం_
_• రాత్రి 8గంటల నుండి పెద్దశేష వాహనము_
*01/10/19:*
_• ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము_
_• రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము_
*02/10/19:*
_• ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము_
_• రాత్రి 8 గంటల నుండి 10 వరకు ముత్యపు పందిరి వాహనము_
*3/10/19:*
_• ఉదయం 9గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము_
_• రాత్రి 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము_
*04/10/19:*
_• ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం_
_• రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము_
*05/10/19:*
_• ఉదయం 9గంట నుండి 11వరకు హనుమంత వాహనము_
_• రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము_
*06/10/19:*
_• ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనము_
_• రాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము_
*07/10/19:*
_• ఉదయం 7గంటల నుండి రధోత్సవము_
_• రాత్రి 8గంటల డి 10వరకు అశ్వవాహనము_
*08/10/19:*
_• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము_
_• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము_
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండిhttps://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
10. విజయవాడలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీరోజు ప్రత్యేక అలంకారల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా నవరాత్రుల్లో భాగంగా మంగళవారం గాయత్రీ దేవీగా దుర్గమ్మ భక్తకోటికి అనుగ్రహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో మూడురోజున అమ్మవారు ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ… భక్తుల ముందుకు వచ్చారు. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీ దేవీని పూజిస్తే అన్ని కష్టాలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే గాయత్రీదేవీ రూంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి క్యూ కట్టారు. అంతేకాకుండా బుద్ధి తేజోవంతం అవుతుంద‌ని భ‌క్తులు విశ్వసిసస్తారు. మంగళవారం వంగ‌, ఆకుప‌చ్చ‌, బంగారు వ‌న్నెల చీర‌ల్లో కొలువుదీరిన అమ్మ‌వారికి నైవేద్యంగా పులిహోర‌, కేస‌రి, పుల‌గాల‌ను స‌మ‌ర్పిస్తారు. మరోవైపు కొండపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అందించేందుకు పెద్దఎత్తున తీర్థప్రసాదాలు సిద్దం చేశారు.
11. చరిత్ర ఈ రోజు* *అక్టోబర్, 01*
*సంఘటనలు*
1869 : ప్రపంచములో తొలిసారిగా పోస్టుకార్డు ను ఆస్ట్రియా దేశంలో విడుదల చేశారు.
1953: కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
1958 : భారతదేశంలో “మెట్రిక్ కొలతల పద్ధతి” ప్రవేశపెట్టబడింది.
1982: తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది.
1984: బజరంగ్ దళ్ అనేది ఒక హిందూ మత సంస్థ. బజరంగ్ దళ్ స్థాపన.
1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
*జననాలు*
847: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
1862: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)
1890: అంకితం వెంకట భానోజీరావు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి.
1908: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
1915: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
1921: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, ప్రముఖ హాస్య నటుడు. (మ.1974)
1922: అ రామలింగయ్య, ప్రముఖ హాస్య నటుడు. (మ.2004)
1928 : సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు శివాజీ గణేశన్ జననం (మ.2001).
1934: భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
1934: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త. (మ.2014)
1939: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
1942: బోయ జంగయ్య, ప్రముఖ రచయిత. (మ.2016)
1951: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002)
1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు
1901: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్
*మరణాలు*
1939: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784)
1946: గూడవల్లి రామబ్రహ్మం, ప్రఖ్యాత సినిమా దర్శకులు మరియు సంపాదకులు. (జ.1902)
1975: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912)
1979: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (జ.1901)
*పండుగలు మరియు జాతీయ దినాలు*- అంతర్జాతీయ శాకాహార దినోత్సవం
– ప్రపంచ వృద్ధుల దినోత్సవం .
– జాతీయ రక్తదాన దినోత్సవం.
– సైప్రస్, నైజీరియా, తువాలు, పలౌ స్వాతంత్య్ర దినోత్సవం.
– ప్రపంచ ఆవాస దినోత్సవం.
స్వచ్ఛంద రక్తదాన దినం.
– అంతర్జాతీయ సంగీత దినం.
12. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం ఆ దేవదేవుడు చిన్నశేష వాహనంపై విహరించారు. తిరు మాడ వీధుల్లో ఐదు తలల శేష వాహనంపై మలయప్పస్వామి వైభవాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు. చిన్నశేష వాహనంపై గోవుల కాపరిగా, వేణుమాధవుడిగా శ్రీవారు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి స్వామివారు హంసవాహనంపై విహరించనున్నారు.
13. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆలయ మర్యాదలతో గవర్నర్ కు స్వాగతం పలికిన దేవస్థాన అధికారులుగవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ కామెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను
ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు దుర్గమ్మను దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉందిదుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలిరాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కనకదుర్గమ్మ దేవస్థానం ఒకటి
14. ఇంద్రకీలాద్రి పై ఎన్ ఎస్ ఎస్, రెడ్ క్రాస్ వాలంటీర్ల అందోళన దుర్గమ్మ అంతరాలయం పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లను బయటకు పంపేసిన వన్ టౌన్ సిఐ కాశీవిశ్వనాధ్..మీరిక్కడ అవసరం లేదండూ పంపీంచేయడంతో తీవ్ర మనస్ధాపానికి గురైన ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు డబ్బులు తీసుకొని మెము విధులు నిర్వహించడం లేదని కేవలం అమ్మవారి సేవ కోసమే వచ్చామంటున్న ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు
క్యూలైన్ల లో వాటర్ ప్యాకేట్లు పంచడంతో పాటు అమ్మవారి సన్నిధిలో క్యూలైన్లు సజావుగా సాగడంలో మా పాత్రే కీలకం పోలీసుల తీరుకు నిరసనగా వాలంటిర్లు బాయ్ కాట్ ..దుర్గగుడి అధికారులు వివరణ ఇచ్చేంతవరకు విధులు చేపట్టమని తేల్చిచెప్పిన ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు
15.శ్రీశైల మల్లన్నకు వజ్ర కిరీటం బహూకరణ
శ్రేసైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానానికి సోమవారం హైదరాబాద్ కు చెందిన ఎం.పట్టాభిరేద్ది దంపతులు వజ్రాలతో పొదిగిన బంగారు కిరీటాన్ని బహూరకిమ్చారు. దీని ఆలయ పరిపాలనా భవనంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఈవో రామారావు అమ్మవారి ప్రధాన అర్చకులు మార్కండేయ స్వామీ ఈఈ రామిరెడ్డికి అందజేశారు. ఈశ్వరన కిరీటం విలువ సుమారు రూ.22.5లక్షలని వేదాశీర్వాదం చేసి స్వామిఅమవార్ల ప్రసాదం శేష వస్త్రాలును ఆలయ అధికారులు అందించారు.
16. దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
గవర్నర్‌ హరిచందన్‌ దంపతులు నేడు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. గవర్నర్‌ దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. ఈవో సురేష్‌బాబు ఆలయ మర్యాదలతో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు.
17. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దసరా సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల సంఖ్య పెరిగింది. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.