DailyDose

ఈ దున్నపోతు నెలకు ఖర్చు 30 వేలు!

ఈ దున్నపోతు నెలకు ఖర్చు 30 వేల!

బిహార్‌ రాజధాని పట్నాలో జరిగిన పశువుల ప్రదర్శనలో దాదాపు రూ.10 కోట్ల విలువైన గోలు-2 అనే దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆరేళ్ల వయసున్న ఈ దున్న 15 క్వింటాళ్ల బరువు ఉంటుంది. పలు పోటీల్లో జాతీయ పతకాలను గెలుచుకుంది. హరియాణాలోని పానీపత్‌ నుంచి తెచ్చిన ఈ ముర్రాజాతి దున్న వీర్యానికి మంచి డిమాండు ఉంది. ఇప్పటికే ఈ దున్నకు 30 వేలకు పైగా సంతానం ఉన్నట్లు సంరక్షకుడు ప్రవీణ్‌ తెలిపారు. ఇంతకుముందు తమ వద్ద గోలు అనే దున్నపోతు ఉండేదని, అది చనిపోయాక తెచ్చిన దీనికి గోలు-2 పేరు పెట్టినట్లు చెప్పారు. ఓ రకంగా ఇది రాజభోగాలు అనుభవిస్తోంది. రోజూ 35 కిలోల పచ్చి, ఎండుగడ్డి మేయడమే కాకుండా ఎండుఫలాలు, ఏడెనిమిది కిలోల బెల్లం సునాయాసంగా లాగించేస్తోంది. నెయ్యి, పాలు గటగటా తాగేస్తుంది. దీని తిండికి నెలకు రూ.30 వేల వరకు ఖర్చు అవుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z