Health

7500 దాటిన ఇండియా కరోనా బాధితులు-TNI కథనాలు

indian-covid19-positive-cases-cross-7500-tnilive-coronavirus-bulletin

* దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంపై శనివారం నాటి హెల్త్ బులిటెన్‌ను కేంద్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 24 గంటల్లో భారత్‌లో కరోనా వల్ల 40 మంది మరణించినట్లు ఆయన వెల్లడించారు. కొత్త కేసులతో కలిపి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,502కు చేరింది. భారత్‌లో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారిలో 642 మంది కోలుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకూ భారత్‌లో 239 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

* కొవిడ్‌-19 పోరులో భాగంగా తాను 24క్ష్7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో కొవిడ్‌-19 పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో తాజా పరిస్థితులను సభ్యులకు వివరించింది. అనంతరం ఒక్కో ముఖ్యమంత్రి తమ అభిప్రాయాల్ని ప్రధానితో పంచుకున్నారు.

* గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పాయింట్స్..నేడు గుంటూరులో 14 కొత్త కేసులు….గుంటూరులో మొత్తం 71 కేసులు నమోదు…గుంటూరులో 12 రెడ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించాం…144 సెక్షన్ అమలులో ఉంది…నిత్యావసర సరుకుల కొనుగోలు సమయం ఉదయం 6గంటల నుండి 9గంటల వరకు మాత్రమే…బయటకు వచ్చే సమయంలో మాస్క్ లేకుంటే 1000 ఫైన్…పీడీ చట్టం కింద కేసు నమోదు…రేపు ఫుల్ కర్ఫ్యూ..

* ఏపీ లో 402 కి చేరుకున్న కరోన పాజిటివ్ కేసులు

* దేశవ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ !ముగిసిన ప్రధాని – సీఎంల వీడియో కాన్ఫరెన్స్ప్రజారోగ్యానికే పెద్దపీట వేయాలని ఏకాభిప్రాయంలాక్‌డౌన్ కొనసాగించాలని సూచించిన పలు రాష్ట్రాల సీఎంలుదేశవ్యాప్తంగా 15 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధానికి ముఖ్యమంత్రుల సూచనపరిశ్రమలకు ,వ్యవసాయానికి మినహాయింపు ఇవ్వాలని సూచనరాష్ట్రాలకు వేగంగా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ పంపాలని ప్రధానిని కోరిన ముఖ్యమంత్రులు.