NRI-NRT

భారతీయ విద్యార్థులకు అమెరికా గుడ్​న్యూస్.. వీసాల పండగే!

భారతీయ విద్యార్థులకు అమెరికా గుడ్​న్యూస్.. వీసాల పండగే!

అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్​న్యూస్! ఈ ఏడాది భారీ స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ కానున్నాయి. అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు శుభవార్త. గతేడాదిని మించి ఈ ఏడాది భారీ స్థాయిలో విద్యార్థుల వీసాలను జారీ చేయనున్నట్లు దిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారిని పాట్రిసియా లసినా తెలిపారు. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ 2021 వేసవిలో రికార్డు స్థాయిలో సుమారు 62 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేశామని, ప్రస్తుత ప్రవేశాల కోసం లక్ష దరఖాస్తులను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎంబసీలో మంగళవారం నిర్వహించిన 6వ విద్యార్థి వీసాల దినోత్సవంలో ఆమె ఈమేరకు మాట్లాడారు.”అమెరికా విద్యాసంస్థలకు, సమాజానికి తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు మా దేశం ఎంతో విలువనిస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతీయలు రెండో స్థానంలో ఉన్నారు” అని పాట్రిసియా పేర్కొన్నారు. ప్రస్తుతం 2 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారని, మొత్తం విదేశీ విద్యార్థుల్లో వారి సంఖ్య 20 శాతానికిపైగా ఉందని వెల్లడించింది.