Politics

జగన్‌కు కేజ్రీవాల్ అభినందన

Kejriwal Appreciates Jagan Over Disha Act In AP

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం ‘దిశ చట్టం’ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని ఇప్పటికే కేబినెట్, అసెంబ్లీ, శాసన మండలి కూడా ఆమెదించింది. ఈ చట్టం ప్రకారం. అత్యాచార కేసు నమోదైనా అది 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి సరైన సాక్ష్యాధారాలు ఉంటే దోషులకు కేసు నమోదైనప్పటి నుంచీ 21 రోజుల్లో శిక్ష అమలు చెయ్యాల్సి ఉంటుంది. అయితే జగన్ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక చట్టాన్ని తీసుకురావడంతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందించారు.

తాజాగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. సీఎం జగన్ మోహన్‌రెడ్డిని అభినందించారు. ఈ మేరకు సోమవారం నాడు జగన్‌కు కేజ్రీవాల్ లేఖ రాశారు. దిశ చట్టానికి సంబంధించిన బిల్లును పంపాలని లేఖలో కేజ్రీవాల్ కోరారు. కాగా.. దిశ చట్టం తీసుకొచ్చినందుకు జగన్‌పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అవసరమని వెంకయ్య చెప్పుకొచ్చారు.